ప్రస్తుతం టెక్నాలజీ (Technology) రంగంలో జరుగుతున్న చర్చల్లో ప్రధాన అంశం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI). చాట్‌జిపిటి (ChatGpt) లాంచ్ అయిన తర్వాత ఏఐ సామర్థ్యాలను చూసి అందరూ అవాక్కవుతున్నారు. దాదాపు అన్ని కంపెనీలు ఏఐ టెక్నాలజీని వినియోగించుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ మార్పులతో ఏఐ టెక్నాలజీ భవిష్యత్తులో మరిన్ని అవకాశాలను సృష్టించనుంది. ఇప్పటికే ఈ రంగంలో ఉద్యోగ అవకాశాలు పెరుగుతున్నాయి. భారతదేశంలోనే ఫిబ్రవరి నాటికి 45,000 ఉద్యోగావకాశాలు ఉన్నాయని ఓ రీసెర్చ్ టీమ్ రిపోర్ట్ పేర్కొంది. డేటా సైంటిస్టులు, మెషీన్ లెర్నింగ్ ఇంజనీర్లకు డిమాండ్ ఉందని తెలిపింది.
రిక్రూట్‌మెంట్, కన్సల్టెన్సీ ప్లాట్‌ఫామ్ టీమ్‌లీజ్ డిజిటల్.. 'ఇనిషియేటివ్ ఫర్ క్రిటికల్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్(iCET) - ఫోర్సెస్ షేపింగ్ ఫ్యూచర్ ఆఫ్ టెక్నాలజీ AI' పేరుతో తాజాగా ఒక రిపోర్ట్‌ను విడుదల చేసింది. స్కేలబుల్ ML (మెషిన్ లెర్నింగ్) అప్లికేషన్‌లకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం వల్ల స్క్రిప్టింగ్ లాంగ్వేజ్‌లలో ప్రావీణ్యం ఉన్న AI నిపుణులకు డిమాండ్ పెరుగుతోందని ఈ నివేదికలో పేర్కొంది. ట్రెడిషినల్ ML మోడల్‌లను బిల్డ్ చేయడం AIలో కెరీర్‌కు అవసరమైన ప్రాథమిక నైపుణ్యం అని కూడా పేర్కొంది. AI వృద్ధి, ఉద్యోగ అవకాశాలను అన్వేషించడం ద్వారా US, భారతదేశం మధ్య iCET భాగస్వామ్యంపై రిపోర్ట్ దృష్టి పెట్టింది.
ఉద్యోగావకాశాలు
ప్రస్తుతం లేఆఫ్‌ల బెడద ఇంకా తొలగిపోలేదు. అయితే భారతదేశంలో ఉద్యోగార్ధులకు అవకాశాలు పెరుగుతున్నాయని టీమ్‌లీజ్ డిజిటిల్ పేర్కొంది. ఆరోగ్య సంరక్షణ, విద్య , BFSI, తయారీ, రవాణా సహా ప్రధాన పరిశ్రమలలో AI ల్యాండ్‌స్కేప్‌లో అనేక రకాల ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయని తెలిపింది. ఈ జాబ్ ప్రొఫైల్‌లలో క్లినికల్ డేటా అనలిస్ట్, చాట్‌బాట్ డెవలపర్, ఫ్రాడ్ అనలిస్ట్, ఇండస్ట్రియల్ డేటా సైంటిస్ట్, రోబోటిక్స్ ఇంజనీర్, ఎడ్‌టెక్ ప్రొడక్ట్ మేనేజర్, డిజిటల్ ఇమేజింగ్ లీడర్‌లు ఉన్నారు.
భారతదేశంలోని అనేక టెక్నాలజీ రోల్స్‌లో, ముఖ్యంగా ఫ్రెషర్లు సంవత్సరానికి రూ.10 నుంచి రూ.14 లక్షల వరకు జీతం ప్యాకేజీని ఆశించవచ్చు. సంబంధిత రంగాల్లో ఎనిమిదేళ్ల అనుభవం ఉన్న అభ్యర్థులు ఏడాదికి రూ.25 నుంచి రూ.45 లక్షల వరకు జీతాలు పొందవచ్చని నివేదిక పేర్కొంది.
కేంద్ర ప్రభుత్వం పాత్ర
AI రంగంలో ప్రభుత్వం తీసుకొచ్చిన ఇనిషియేటివ్స్‌ను రిపోర్ట్ హైలైట్ చేసింది. ఇందులో ఫ్యూచర్‌స్కిల్స్ ప్రైమ్, MeitY, NASSCOM, నేషనల్ AI పోర్టల్ కొలాబరేషన్, యువత కోసం ‘రెస్పాన్సిబుల్ AI ఫర్ యూత్’ కార్యక్రమం, విశ్వేశ్వరయ్య PhD స్కీమ్, ప్రసిద్ధ సంస్థల్లో 25 టెక్నాలజీ ఇన్నోవేషన్ హబ్‌లు ప్రారంభించడాన్ని ప్రస్తావించింది.
No comments:
Post a Comment