Mother Tongue

Read it Mother Tongue

Thursday, 23 March 2023

పులిట్జర్ అవార్డు-2022

పులిట్జర్ ప్రైజ్ కమిటీ 2022 మే 10న మొత్తం 16 విభాగాల్లో ఈ ఏడాది విజేతలకు ప్రకటించింది. ఈసారి నలుగురు భారత ఫొటో జర్నలిస్టులను ప్రఖ్యాత పులిట్జర్ అవార్డు వరించింది. రాయిటర్స్కు చెందిన దివంగత దానిష్ సిద్ధిఖీ, అద్నాన్ అబిది, సన్నా ఇర్షద్ మట్టో, అమిత్ దవే 2022 ఏడాదికి గాను ఈ బహుమతికి ఎంపికయ్యారు. భారత్లో కరోనా తీవ్రతను వివరించేలా వారు తీసిన ఫొటోలకు ఫీచర్ ఫొటోగ్రఫీ విభాగంలో ఈ అవార్డు దక్కింది. దానిష్ సిద్ధిఖీ ఈ పురస్కారానికి ఎంపికవ్వడం ఇది రెండోసారి. రోహింగ్యాల సంక్షోభం అప్పుడు తీసిన చిత్రాలకు 2018లో తొలిసారి ఆయన ఈ అవార్డును అందుకున్నారు. అమెరికా పార్లమెంటు భవనం (యూఎస్ క్యాపిటల్) పై గత ఏడాది జనవరి 6న జరిగిన దాడిని కవర్ చేసినందుకు.. పబ్లిక్ సర్వీస్ కేటగిరీలో 'వాషింగ్టన్ పోస్ట్'కు పులిట్జర్ లభించింది.

No comments:

Post a Comment

Job Alerts and Study Materials