Mother Tongue

Read it Mother Tongue

Thursday, 23 March 2023

68వ జాతీయ సినిమా అవార్డులు

కేంద్ర ప్రభుత్వం 68వ జాతీయ అవార్డులను 2022 జులై 22న ప్రకటించింది. జాతీయ అవార్డులను ఐదు విభాగాలుగా విభజించారు. ఈసారి అవార్డుల్లో తమిళ చిత్రం 'సూరరై పోట్రు' (తెలుగులో 'ఆకాశం నీ హద్దురా..!) ఐదు విభాగాల్లో (జాతీయ ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు (సూర్య), నటి (అపర్ణ), స్క్రీన్ ప్లే (సుధ కొంగర), నేపథ్య సంగీతం (జీవీ ప్రకాశ్కుమార్)) అవార్డులను సొంతం చేసుకుంది. కాగా ఉత్తమ నటుడి అవార్డుకి సూర్యతో పాటు అజయ్ దేవగన్ ('తన్హాజీ')ని ఎంపిక చేశారు. కెరీర్లో సూర్యకు ఇది తొలిసారి జాతీయ అవార్డు కాగా, అజయ్ దేవగన్కు మాత్రం ఇది మూడో అవార్డు. ఇంతకు ముందు 'జఖ్ ' (1998), 'ది లెజండ్ ఆఫ్ భగత్సింగ్' (2002) చిత్రాలకుగాను ఉత్తమ నటుడు విభాగంలో అజయ్ దేవగన్ జాతీయ అవార్డులను సొంతం చేసుకున్నారు.

అవార్డుల విజేతల వివరాలు

  • ఉత్తమ చిత్రం: సూరరై పోట్రు
  • ఉత్తమ నటుడు: సూర్య (సూరరై పోటు), అజయ్ దేవగన్ (తన్హాజీ: ది అన్సంగ్ వారియర్)
  • ఉత్తమ నటి: అపర్ణ బాలమురళి (సూరరై పోట్రు)
  • ఉత్తమ సహాయ నటుడు: బీజూ మీనన్ (అయ్యప్పనుమ్ కోషియుమ్)
  • ఉత్తమ సహాయ నటి: లక్ష్మీ ప్రియా చంద్రమౌళి (శివరంజనియుం ఇన్నుమ్ సిల పెన్గళుమ్) ఉత్తమ దర్శకుడు: దివంగత కేఆర్ సచ్చిదానందన్ (అయ్యప్పనుమ్ కోషియుమ్)
  • ఉత్తమ చైల్డ్ ఆర్టిస్ట్ విభాగంలో అనిశ్ మంగేశ్ గోస్వామి (టక్టక్), ఆకాంక్షా పింగ్లే, దివ్వేష్ తెందుల్కర్ (సుమీ)
  • ఉత్తమ ప్రాంతీయ తెలుగు చిత్రం: కలర్ ఫోటో
  • ఉత్తమ తమిళ చిత్రం: శివరంజనియుం ఇన్నుమ్ సిల పెన్గళుమ్
  • ఉత్తమ కన్నడ చిత్రం: డోలు
  • ఉత్తమ మలయాళం చిత్రం: తింకలచ్చ నిశ్చయమ్
  • ఉత్తమ హిందీ చిత్రం: తులసీదాస్ జూనియర్
  • ఉత్తమ బాలల చిత్రం: సుమి (మరాఠి)
  • ఇందిరాగాందీ అవార్డు ఫర్ బెస్ట్ డెబ్యూ ఫిలిం డైరెక్టర్: మండోన్నా అశ్విన్ (మండేలా తమిళ ఫిల్మ్) ఉత్తమ వినోదాత్మక చిత్రం: తన్హాజీ: ది అన్ సంగ్ వారియర్
  • పర్యావరణ పరిరక్షణపై చిత్రం తలెండా (కన్నడ)
  • బెస్ట్ ఫిల్మ్ ఆన్ సోషల్ ఇష్యూ: ఫ్యూర్నల్ (మరాఠీ)
  • ఉత్తమ సంగీతం (పాటలు): ఎస్ఎస్ తమన్ (అల... వైకుంఠపురములో...)
  • ఉత్తమ సంగీతం (నేపథ్యం): జీవీ ప్రకాశ్కుమార్ (సూరరైపోటు - తమిళం)
  • మధ్యప్రదేశ్ మోస్ట్ ఫ్రెండ్లీ ఫిల్మ్ స్టేట్ అవార్డును దక్కించుకుంది
  • ద లాంగెస్ట్ కిస్'కు 'ది బెస్ట్ బుక్ ఆన్ సినిమా అవార్డు దక్కింది.

No comments:

Post a Comment

Job Alerts and Study Materials