తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(TSPSC) ఇటీవల 25 నోటిఫికేషన్లకు పైగా విడుదల చేసిన విషయం తెలిసిందే. వీటిలో కొన్ని ఉద్యోగ నోటిఫికేషన్లకు పరీక్షలు నిర్వహించగా.. ఫలితాల కోసం అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు. మరి కొన్ని ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించి పరీక్ష తేదీలను(Exam Dates) విడుదల చేయాల్సి ఉంది. ఇప్పటికే గ్రూప్ 1, 2, 4 నోటిఫికేషన్లకు పరీక్ష తేదీలను ప్రకటించిన టీఎస్పీఎస్సీ తాజాగా మరో మూడు నోటిఫికేషన్లకు సంబంధించి పరీక్ష తేదీలను ప్రకటించింది. వాటి గురించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
1. వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్
తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) TSPSC వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ రిక్రూట్‌మెంట్ ప్రక్రియ కోసం 185 ఖాళీలను విడుదల చేసింది. ఆన్‌లైన్ అప్లికేషన్ 30 డిసెంబర్ 2022 నుండి ప్రారంభం కాగా.. TSPSC వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ 15 ఫిబ్రవరి 2023గా నోటిఫికేషన్లో పేర్కొని.. దరఖాస్తులను స్వీకరించారు. ఈ పరీక్షను కంప్యూటర్ బేస్డ్ విధానంలో నిర్వహించనున్నారు.
పరీక్ష తేదీ: మార్చి 15 ఉదయం, సాయంత్రం మరియు మార్చి 16న ఉదయం ఈ పరీక్షలు ఉంటాయి.
2.హార్టికల్చర్ ఆఫీసర్
ఇటీవల టీఎస్పీఎస్సీ ద్వారా 22 హార్టికల్చర్ ఆఫీసర్(Horticulture Officer) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. జనవరి 03 నుంచి ఈ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కాగా.. జనవరి 24 వరకు దరఖాస్తుల ప్రక్రియ కొనసాగింది. తర్వాత ఫిబ్రవరి 08, 2023 నుంచి ఫిబ్రవరి 10, 2023 సాయంత్రం 5 గంటల వరకు అప్లికేషన్ల ఎడిట్ కు అవకాశం కల్పించారు. పరీక్షను కంప్యూటర్ బేస్డ్ విధానంలో నిర్వహించనున్నారు.
పరీక్ష తేదీ: ఏప్రిల్ 04 ఉదయం, సాయంత్రం ఈ పరీక్షను నిర్వహిస్తారు. రెండు పేపర్లు రాయాల్సి ఉంటుంది.
3. అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్
రవాణ శాఖలో 113 అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ ఖాళీలకు ఇటీవల టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ జనవరి 12న ప్రారంభం కాగా.. దరఖాస్తు చేసుకోవడానికి ఫిబ్రవరి 1ను ఆఖరి తేదీగా నిర్ణయించింది. గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా సంస్థ నుంచి మెకానికల్ లేదా అటోమొబైల్ ఇంజనీరింగ్ లో డిగ్రీ పట్టా పొంది ఉన్నవారు ఈ పోస్టులకు అర్హులు. లేదా ఆటోమొబైల్ ఇంజనీరింగ్ లో డిప్లొమా చేసి ఉండాలి. హెవీ మోటార్ వెహికిల్స్ డ్రైవింగ్ లైసెన్స్ పొంది ఉండాలి. వయస్సు 21-39 ఏళ్లు ఉండాలి.
పరీక్ష తేదీ: ఏప్రిల్ 23న ఉదయం, సాయంత్రం ఈ పరీక్షను నిర్వహిస్తారు. రెండు పేపర్లు రాయాల్సి ఉంటుంది.
No comments:
Post a Comment