యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) ఈరోజు అనగా.. మార్చి 3, 2023న UPSC ESE ప్రిలిమినరీ పరీక్షా ఫలితాలు 2023ని విడుదల చేసింది. ఇంజినీరింగ్ సర్వీసెస్ (ప్రిలిమినరీ) పరీక్ష, 2023కి హాజరైన అభ్యర్థులు upsc.gov.in లో UPSC అధికారిక సైట్ ద్వారా ఫలితాలను చూసుకోవచ్చు. దీనికి సంబంధించిన పరీక్ష ఫిబ్రవరి 19, 2023న జరిగింది.
UPSC ESE ప్రిలిమ్స్ ఫలితాలు చెక్ చేసుకోండిలా..
- upsc.gov.in లో UPSC అధికారిక సైట్‌కి వెళ్లండి.
-హోమ్ పేజీలో అందుబాటులో ఉన్న UPSC ESE ప్రిలిమ్స్ ఫలితాలు 2023 లింక్‌పై క్లిక్ చేయండి.
-అభ్యర్థులు తమ ఫలితాలను చెక్ చేసుకోగలిగే కొత్త PDF ఫైల్ తెరవబడుతుంది.
-తదుపరి అవసరాల కోసం పేజీని డౌన్‌లోడ్ చేసుకోండి మరియు దాని హార్డ్ కాపీని మీ వద్ద ఉంచుకోండి.
జూన్ లో మెయిన్ పరీక్ష..
అర్హత సాధించిన అభ్యర్థులు జూన్ 25, 2023న జరిగే ఇంజనీరింగ్ సర్వీసెస్ (మెయిన్) పరీక్షకు హాజరు కావాలి. అభ్యర్థులు తమ ఇ-అడ్మిట్ కార్డ్‌లను కమీషన్ వెబ్‌సైట్ నుండి 3 వారాల ముందు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
వీటితో పాటు..
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) మార్చి 3, 2023న UPSC జియో సైంటిస్ట్ ప్రిలిమ్స్ ఫలితాలు 2023ని ప్రకటించింది. కంబైన్డ్ జియో-సైంటిస్ట్ (ప్రిలిమినరీ) ఎగ్జామినేషన్, 2023కి హాజరైన అభ్యర్థులు UPSC అధికారిక సైట్ upsc.gov.in ద్వారా తమ ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.
Power Saving Tips: ఒక్క పరికరం.. మీ కరెంట్ బిల్లును సగం (50 శాతం) తగ్గిస్తుంది.. ఏంటో తెలుసుకోండి..
రాతపూర్వక ప్రిలిమినరీ పరీక్ష ఫిబ్రవరి 19, 2023న జరిగింది. పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు ప్రధాన పరీక్షకు హాజరు కావడానికి అర్హులుగా ఉంటారు.. ప్రధాన పరీక్ష జూన్ 24 మరియు జూన్ 25, 2023 న నిర్వహించబడుతుంది.
ఫలితాల కొరకు అభ్యర్థులు డైరెక్ట్ లింక్ https://upsc.gov.in/ ఇక్కడ క్లిక్ ఇచ్చి తనిఖీ చేయవచ్చు. కంబైన్డ్ జియో-సైంటిస్ట్ (మెయిన్) పరీక్ష 2023 ప్రారంభానికి 3 వారాల ముందు అభ్యర్థులు తమ ఇ-అడ్మిట్ కార్డ్‌లను కమిషన్ వెబ్‌సైట్ నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మరిన్ని సంబంధిత వివరాల కోసం అభ్యర్థులు UPSC అధికారిక సైట్‌ను సందర్శించవచ్చు.
No comments:
Post a Comment