Mother Tongue

Read it Mother Tongue

Thursday, 16 March 2023

5 పేపర్లు లీక్ చేసిన ప్రవీణ్..సిట్ విచారణలో సంచలనాలు

 TSPSC పేపర్ లీకేజి కేసులో తవ్వుతున్న కొద్ది సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. ఈ కేసులో ప్రధాన నిందితునిగా ఉన్న ప్రవీణ్ రాసలీలల కాల్స్ ఇటీవల బయటకు రాగా తాజాగా మరో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. కంప్యూటర్ నుంచి ఏకంగా 5 పేపర్లను ప్రవీణ్ కొట్టేసినట్టు సిట్ దర్యాప్తులో తేలింది. ఇక ప్రవీణ్ పెన్ డ్రైవ్ లో 3 ప్రశ్నపత్రాలను పోలీసులు గుర్తించారు.

త్వరలో జరగబోయే టౌన్ ప్లానింగ్ , వెటర్నరీతో పాటు మరో పేపర్ లీక్ చేసినట్లు సమాచారం. అయితే మిగతా పేపర్లు ఎంటనే ఆధారాలు సిట్ దగ్గర ఉన్నట్లు తెలుస్తుంది. కాగా త్వరలో జరగబోయే మరిన్ని ప్రశ్నాపత్రాలు కూడా ఇస్తానని రేణుకకు ప్రవీణ్ హామీ ఇచ్చినట్లు తెలుస్తుంది. రాజశేఖర్ సహాయంతోనే ప్రవీణ్ పేపర్లు తన పెన్ డ్రైవ్ లోకి కాపీ చేసుకున్నట్లు తెలుస్తుంది. మరోవైపు TSPSC అధికారులతో సిట్ చీఫ్ భేటీ అయ్యారు. లక్ష్మీ ప్రసన్న నుంచి పాస్ వర్డ్ ఎలా వచ్చాయన్న అంశంపై సిట్ చీఫ్ శ్రీనివాస్ ఆరా తీస్తున్నారు.

 ఈ కేసు దర్యాప్తు బాధ్యతలు బేగంబజార్ పోలీస్ స్టేషన్ నుంచి సిట్ (Special Investigation Team) కు బదిలీ చేస్తూ హైదరాబాద్ పోలీస్ కమీషనర్ ఆదేశాలు జారీ చేశారు. దీనితో  తదుపరి దర్యాప్తును సిట్ చీఫ్ ఏఆర్ శ్రీనివాస్ పర్యవేక్షించారు. ఈ క్రమంలో కేసులో సిట్ దూకుడు పెంచింది. దర్యాప్తులో భాగంగా  సిట్  బేగంబజార్ పోలీసుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అంతేకాదు సిట్ చీఫ్ ఏఆర్ శ్రీనివాస్ స్వయంగా పీఎస్ కు వచ్చి రికార్డులను పరిశీలించారు.  ఇప్పటికే బేగంబజార్ పీఎస్ కు వెళ్లి రికార్డులను పరిశీలించిన ఆయన..చైర్మన్ జనార్దన్ రెడ్డిని వివరాలు అడిగి తెలుసుకున్నారు.

అంతేకాదు నాంపల్లిలోని TSPSC ఆఫీస్ కు వెళ్లిన సిట్ చీఫ్ కంప్యూటర్ కు సంబంధించి యూజర్ ఐడి, పాస్ వర్డ్ సహా ఇతర విషయాలు ఎలా తెలిశాయనే అంశంపై ఆరా తీసినట్టు తెలుస్తుంది. పరీక్షల నిర్వహణ సీక్రెసీతో పాటు ప్రింటింగ్ వ్యవహారాలపై ఆరా తీశారు. కాన్ఫిడెన్షియల్ రూంను కూడా ఆయన పరిశీలించారు. కాన్ఫిడెన్షియల్ రూం నుంచే పేపర్ లీక్ అయినట్లు గుర్తించారు. ఈ క్రమంలో కాన్ఫిడెన్షియల్ రూం ఇంఛార్జి లక్ష్మీ ప్రసన్నను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ప్రసన్నలక్ష్మీ వద్దే ప్రవీణ్ యూజర్ ఐడి, పాస్ వర్డ్ చోరీ చేసినట్లు గుర్తించారు. ఈ పేపర్ లీకేజీలో ఎవరెవరి ప్రమేయం ఉంది? పేపర్ ఏ విధంగా లీక్ అయింది? అనే అంశాలపై దర్యాప్తు ఇంకా చేస్తున్నామన్నారు. ఇప్పటివరకు కేవలం ఇద్దరికీ మాత్రమే ఈ పేపర్ లీక్ అయినట్లు గుర్తించామని..నిందితుల కంప్యూటర్, ల్యాప్ టాప్ లను ఫోరెన్సిక్ ల్యాప్ కు పంపించినట్టు సిట్ చీఫ్ పేర్కొన్నారు. ఆ నివేదిక వచ్చాక పూర్తి విషయాలు తెలిసే అవకాశం ఉందన్నారు. 

ప్రవీణ్..రాజశేఖర్, రేణుక..

ప్రవీణ్ అనే వ్యక్తి గత కొన్నిరోజులుగా TSPSCలో సెక్షన్ ఆఫీసర్ గా పని చేస్తున్నాడు. ఇక అవుట్ సోర్సింగ్ విభాగంలో పని చేస్తున్న రాజశేఖర్ అనే వ్యక్తి సాయంతో ప్రవీణ్ అడ్మిన్ కంప్యూటర్ లో యూజర్ ఐడి, పాస్ వర్డ్ తీసుకొని అందులో నుంచే 25 పేపర్లతో కూడిన సెట్ ను కాపీ చేసుకొని రేణుక అనే మహిళకు పంపించాడు. ఆ తరువాత రేణుక నుండి ఇద్దరికీ ఈ పేపర్ లీక్ అయినట్లు తెలుస్తుంది. ఇక ఈ కేసులో ఇప్పటివరకు ప్రవీణ్, రాజశేఖర్, రేణుక సహా 9 మందిని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు.

ప్రశ్నాపత్రం లీకైనట్లుగా తేలడంతో పలు పరీక్షలను రద్దు చేస్తున్నట్లు ఇప్పటికే టీఎస్​పీఎస్సీ (TSPSC) ప్రకటించింది. వివిధ ప్రభుత్వ శాఖల్లో అసిస్టెంట్​ ఇంజనీర్​, మున్సిపల్​ ఇంజినీర్​, టెక్నికల్​ ఆఫీసర్​, జూనియర్​ టెక్నికల్​ ఆఫీసర్​ పోస్టులకు నిర్వహించిన పరీక్షలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు నిన్న రాత్రి అధికారిక ప్రకటన విడుదల చేసింది. పరీక్షకు సంబంధించిన కొత్త తేదీని త్వరలో ప్రకటిస్తామని టీఎస్పీఎస్సీ ప్రకటనలో పేర్కొంది. అయితే పేపర్ లీకేజితో పలు పోటీ పరీక్షలు రాసే, రాయబోయే అభ్యర్థులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. 

No comments:

Post a Comment

Job Alerts and Study Materials