Mother Tongue

Read it Mother Tongue

Thursday, 16 March 2023

తెలంగాణలో ఇంజనీర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. ఖాళీలు, విద్యార్హతల వివరాలివే..

 హైదరాబాద్ జిల్లా వైద్యారోగ్య అధికారి కార్యాలయం (Hyderabad-DMHO) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. పలు ఉద్యోగాలను (Telangana Jobs) భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు నోటిఫికేషన్ (TS Job Notification) విడుదల చేసింది. సపోర్ట్ ఇంజనీర్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తులను నింపి.. ప్రింట్ తీసుకోవాలని. ఆ దరఖాస్తును ప్రింట్ తీసుకుని O/o. District Medical & Health Officer, Hyderabad # 4th floor, GHMC Building, Patny, Secunderabad చిరునామాలో ఈ నెల 18వ తేదీ సాయంత్రం 5 గంటలలోగా సమర్పించాల్సి ఉంటుంది. ఆన్లైన్లో దరఖాస్తులను ఈ నెల 17వ తేదీ సాయంత్రం 5 గంటలలోగా సమర్పించాల్సి ఉంటుంది. 

ఖాళీలు, విద్యార్హతల వివరాలు:

మొత్తం 5 సపోర్ట్ ఇంజనీర్ ఉద్యోగాలను ఈ ప్రకటన ద్వారా భర్తీ చేస్తున్నారు. బీటెక్(సీఎస్ఈ, ఐటీ, ఈసీఈ)/ఎంసీఏ విద్యార్హత కలిగిన వారు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థులకు నాలుగేళ్ల అనుభవం ఉండాలి. ఎంపికైన వారికి నెలకు రూ.35 వేల వేతనం ఉంటుంది. అభ్యర్థుల వయస్సు డిసెంబర్ 31, 2022 నాటికి 44 ఏళ్లలోపు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు ఐదేళ్లు, ఎక్స్ సర్వీస్మెన్ అభ్యర్థులకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్లు వయో పరిమితిలో సడలింపు ఇచ్చారు.

అభ్యర్థుల ఎంపిక:

జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలోని కమిటీ అభ్యర్థులను ఎంపిక చేస్తుంది. క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ మార్కులకు 90 శాతం వెయిటేజీ, వయస్సుకు 10 శాతం వెయిటేజీ ఉంటుంది.

అధికారిక వెబ్ సైట్-Link

No comments:

Post a Comment

Job Alerts and Study Materials