ప్రముఖ ఐడీబీఐ బ్యాంక్ తాజాగా 600 అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ఈ రోజు ముగియనుంది. ఈ స్టెప్స్ తో అభ్యర్థులు తమ దరఖాస్తులను సమర్పించవచ్చు.
బ్యాంక్ ఉద్యోగాల (Bank Jobs) భర్తీకి వరుసగా ఉద్యోగ ప్రకటనలు విడుదల అవుతున్నాయి. తాజాగా ఐడీబీఐ బ్యాంక్ (IDBI Jobs) నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. భారీగా ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 600 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొంది బ్యాంక్. అసిస్టెంట్ మేనేజర్ విభాగంలో ఈ ఖాళీలను భర్తీ చేయనుంది బ్యాంక్. ఇందుకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఫిబ్రవరి 21న ప్రారంభం కానుండగా.. దరఖాస్తు చేసుకోవడానికి మార్చి 3ను ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ (Registration) పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సర్వీస్ మరియు ఇన్సూరెన్స్ విభాగంలో కనీసం రెండేళ్ల పాటు పని చేసిన అనుభవం ఉండాలి. వయస్సు 21-30 ఏళ్లు ఉండాలి. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఏప్రిల్ లో ఆన్లైన్ టెస్ట్ ఉండే అవకాశం ఉందని బ్యాంక్ తెలిపింది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఆన్లైన్ టెస్ట్ ఉంటుంది. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, అనంతరం ప్రీ రిక్రూట్మెంట్ మెడికల్ టెస్ట్ ఉంటుంది.
దరఖాస్తు ప్రక్రియ:
No comments:
Post a Comment