టెన్త్, ఇంటర్, డిగ్రీ లాంటి విద్యార్హతలు ఉన్నవారికి అలర్ట్. 616 ఉద్యోగాల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. అప్లై చేయడానికి మరో 6 రోజులే సమయం ఉంది. ఈ జాబ్ నోటిఫికేషన్ (Job Notification) వివరాలు తెలుసుకోండి.
అస్సాం రైఫిల్స్‌లో భారీగా ఉద్యోగాల భర్తీకి జాబ్ నోటిఫికేషన్ (Job Notification) విడుదలైంది. టెక్నికల్, ట్రేడ్స్‌మెన్ పోస్టుల భర్తీకి అస్సాం రైఫిల్స్ (Assam Rifles) నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 616 పోస్టులున్నాయి. అవసరాన్ని బట్టి ఈ పోస్టుల సంఖ్య పెరగొచ్చు లేదా తగ్గొచ్చు. రైఫిల్‌మ్యాన్, హవిల్దార్, వారెంట్ ఆఫీసర్, నైబ్ సుబేదార్, రైఫిల్‌వుమెన్ లాంటి పోస్టులున్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అప్లై చేయడానికి 2023 మార్చి 19 చివరి తేదీ. పరీక్ష తేదీ ప్రకటించాల్సి ఉంది. అభ్యర్థులు ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేయాలి. వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. టెన్త్, ఇంటర్, డిగ్రీ పాసైనవారు ఈ పోస్టులకు అప్లై చేయొచ్చు. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్, పర్సనాలిటీ టెస్ట్ లేదా ఫిజికల్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా ఈ పోస్టులకు ఎంపిక చేస్తారు. ఈ జాబ్ నోటిఫికేషన్ వివరాలు, ముఖ్యమైన తేదీలు, విద్యార్హతల గురించి తెలుసుకోండి. మొత్తం 616 ఖాళీలు ఉండగా అందులో ఆంధ్రప్రదేశ్- 25, తెలంగాణ- 27 పోస్టులున్నాయి. విద్యార్హతల వివరాలు చూస్తే టెన్త్, ఇంటర్మీడియట్, డిప్లొమా, గ్రాడ్యుయేషన్ పాసైనవారు దరఖాస్తు చేయొచ్చు. అభ్యర్థుల వయస్సు 18 ఏళ్ల నుంచి 30 ఏళ్ల లోపు ఉండాలి. ఎంపిక విధానం చూస్తే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్, పర్సనాలిటీ టెస్ట్ లేదా ఫిజికల్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు- అన్‌రిజర్వ్‌డ్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులకు గ్రూప్ బీ పోస్టులకు రూ.200, గ్రూప్ సీ పోస్టులకు రూ.100. ఎస్‌సీ, ఎస్‌టీ అభ్యర్థులకు పీజు లేదు. ఈ పోస్టులకు అప్లై చేయడానికి అభ్యర్థులు ముందుగా https://www.assamrifles.gov.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి. హోమ్ పేజీలో JOIN ASSAM RIFLES పైన క్లిక్ చేయాలి. కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. రాష్ట్రం, ట్రేడ్ సెలెక్ట్ చేయాలి. ఆ తర్వాత ఇతర వివరాలతో దరఖాస్తు ఫామ్ పూర్తి చేయాలి. అవసరమైన డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయాలి. ఫీజు చెల్లించి అప్లికేషన్ ప్రాసెస్ పూర్తి చేయాలి.
No comments:
Post a Comment