Mother Tongue

Read it Mother Tongue

Monday, 13 March 2023

ప్రముఖ బ్యాంకులో 638 ఉద్యోగాలు.. జీతం రూ.1.35 లక్షలు..!

 కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కు ప్రిపేర్ అవుతున్న వారికి అలర్ట్. ప్రముఖ బ్యాంకు వివిధ హోదాల్లో ఉద్యోగాల భర్తీకి రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. మధ్యప్రదేశ్ రాజ్య సహకారి బ్యాంక్ MYDT (అపెక్స్ బ్యాంక్).. మధ్యప్రదేశ్‌లోని 35 జిల్లా సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్‌ల్లో ఆఫీసర్ల పోస్టుల కోసం అప్లికేషన్స్ ఆహ్వానించింది. ఇప్పటికే బ్యాంకు ఉద్యోగాలతో పాటు కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కు ప్రిపేర్ అవుతున్న వారికి ఇది గుడ్‌న్యూస్ అని చెప్పవచ్చు. ఈ రిక్రూట్‌మెంట్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

అపెక్స్ బ్యాంక్ వివిధ కేటగిరీలు, గ్రేడ్‌లలో మొత్తం 638 ఆఫీసర్ల పోస్టుల కోసం రిక్రూట్‌మెంట్ ప్రాసెప్ ప్రారంభించింది. మొత్తం 35 డిస్ట్రిక్ సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్స్‌లో (DCCB) పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిలో కంప్యూటర్ ప్రోగ్రామర్ (సీనియర్ మేనేజ్‌మెంట్ గ్రేడ్ - 2), ఫైనాన్షియల్ అనలిస్ట్ (సీనియర్ మేనేజ్‌మెంట్ గ్రేడ్ - 2), మార్కెటింగ్ ఆఫీసర్ (సీనియర్ మేనేజ్‌మెంట్ గ్రేడ్ - 2), ఇంటర్నల్ ఆడిటర్ (సీనియర్ మేనేజ్‌మెంట్ గ్రేడ్ - 2), ఇంటర్నల్ ఇన్‌స్పెక్టర్ (మిడిల్ మేనేజ్‌మెంట్ గ్రేడ్-1), అసిస్టెంట్ చీఫ్ సూపర్‌వైజర్ (మిడిల్ మేనేజ్‌మెంట్ గ్రేడ్-2) వంటి పోస్టులు ఉన్నాయి.

అభ్యర్థులు ఏప్రిల్ 9 లోపు అపెక్స్ బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్ apexbank.in ద్వారా ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన అభ్యర్థులకు పోస్టును బట్టి 6వ, 7వ పే స్కేల్ కింద జీతం చెల్లిస్తారు. వివిధ పోస్టులకు జీతం రూ. 9,300 నుంచి రూ. 1,35,100 వరకు ఉంటుంది. 

అప్లికేషన్ ప్రాసెస్ 

 ఈ రిక్రూట్‌మెంట్ కోసం అప్లై చేయాల్సిన అభ్యర్థులు ముందు అపెక్స్ బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్ apexbank.in ఓపెన్ చేయాలి. వెబ్ పేజీలో ‘Click Here to Apply Online’ లింక్‌పై క్లిక్ చేస్తే అప్లికేషన్ ఫారం కనిపిస్తుంది.

కొత్త పేజీలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అన్ని వివరాలు నింపి, అవసరమైన డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయండి. తర్వాత అప్లికేషన్‌ను ప్రివ్యూ చేసి, ఫీజు చెల్లించండి. (జనరల్, OBC, EWS కేటగిరీ అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు రూ.500గా ఉంది. SC, ST, వికలాంగ అభ్యర్థులు రూ.250 చెల్లించాలి.)

చివరకు ‘Submit’పై క్లిక్ చేసి ఫారం సబ్‌మిట్ చేయండి. భవిష్యత్తు అవసరాల కోసం ఈ ఫారం కాపీని సేవ్ చేసుకోండి.

ఎవరు అర్హులు?

అభ్యర్థుల వయసు 18 నుంచి 40 సంవత్సరాల మధ్య ఉండాలి. మహిళా అభ్యర్థులు, SC/ST, OBC, శారీరక వికలాంగ వర్గాలకు చెందిన వారికి ఐదేళ్లు వయోపరిమితి సడలింపు ఉంటుంది. మధ్యప్రదేశ్‌కు చెందిన DCCBలు, SCB, PACS రెగ్యులర్ ఉద్యోగులకు కూడా వయోపరిమితి సడలింపు ఉంది. అపెక్స్ బ్యాంకు ఈ రిక్రూట్‌మెంట్‌లో వివిధ పోస్టులను భర్తీ చేయనుంది. ఈ పోస్టులను బట్టి విద్యార్హతలు ఉన్నాయి. పూర్తి వివరాల కోసం బ్యాంక్ విడుదల చేసిన అధికారిక రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్‌ చెక్ చేయవచ్చు.

అప్లై చేసుకున్న అభ్యర్థులను రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా స్క్రీనింగ్ చేస్తారు. ఆ తర్వాత ప్రతి పోస్ట్‌కు IBPS ద్వారా మెరిట్ లిస్ట్, సీనియారిటీ లిస్ట్ తయారు చేస్తారు. అయితే పరీక్ష తేదీని త్వరలో బ్యాంక్ వెబ్‌సైట్‌లో ప్రకటించనున్నారు. 


No comments:

Post a Comment

Job Alerts and Study Materials