Mother Tongue

Read it Mother Tongue

Sunday, 12 March 2023

అభ్యర్థులకు అలర్ట్.. తెలంగాణ హైకోర్టు నియామక పరీక్షల సమయాల్లో కీలక మార్పులు..

 ఇటీవల తెలంగాణ హైకోర్టు(Telangana High court) నుంచి భారీగా ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదలయిన విషయం తెలిసిందే. జనవరి మొదటి వారంలో జిల్లా కోర్టుల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలకు 6 నోటిఫికేషన్లకు పైగా విడుదల చేసిన హైకోర్టు(High Court).. జనవరి 11న మరో 9 నోటిఫికేషన్లు విడుదల చేసింది. మొత్తం 15 ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయాగా.. దరఖాస్తుల ప్రక్రియ కూడా ముగిసింది. అయితే వీటికి సంబంధించి పరీక్ష తేదీలు విడుదల అయ్యాయి. వాటిలో పరీక్ష జరిగే సమయం మార్పులు చేస్తూ తెలంగాణ హైకోర్టు తాజాగా వెబ్ నోట్ విడుదల చేసింది. వాటి గురించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

మొదట హైకోర్టులో ఖాళీ పోస్టులకు 9 నోటిఫికేషన్లు విడుదల కాగా.. వీటికి సంబంధించి పరీక్షలు మార్చి 31 , ఏప్రిల్ 01, 2023 రెండు రోజులు నిర్వహించనుంది. మార్చి 31న మూడు షిప్ట్ లో పరీక్ష ఉంటుంది. పోస్టుల వారీగా పరీక్ష తేదీల వివరాలిలా.

1. అసిస్టెంట్ ఉద్యోగాలు 

అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించి 31 మార్చి 2023న మొదటి షిఫ్ట్ లో నిర్వహించనున్నారు. సమయం ఉదయం 9 గంటల నుంచి 10.30 వరకు ఉంటుందని మొదట పేర్కొనగా దానిని సవరిస్తూ మరో సమయాన్ని కేటాయించారు. ఉదయం 08.30 గంటలకు పరీక్ష మొదలుకానుండగా.. 10.30 పరీక్ష ముగుస్తుందని పేర్కొన్నారు

 2. ఎగ్జామినర్

ఎగ్జామినర్ ఉద్యోగాలకు సంబంధించి కంప్యూటర్ బేస్డ్ విధానంలో 31 మార్చి 2023న సెకండ్ షిప్ట్ లో ఉంటుంది. సమయం ఉదయం 12.30 గంటల నుంచి 02.00 వరకు ఉంటుందని మొదట్లో పేర్కొనగా దానిని 12.30 నుంచి 02.30 వరకు ఉంటుందని కొత్త సమయాన్ని ప్రకటించారు.

3. సిస్టమ్ అసిస్టెంట్

సిస్టమ్ అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించి కంప్యూటర్ బేస్డ్ విధానంలో పరీక్ష 31 మార్చి 2023న థర్డ్ షిప్ట్ లో ఉంటుంది. సమయం 04.00 గంటల నుంచి 05.30 వరకు ఉంటుందని మొదట పేర్కొనగా దానిని సాయంత్రం 04.45 నుంచి 6.45 వరకు ఉంటుందని తెలిపారు.

4. ట్రాన్స్ లేటర్, అసిస్టెంట్ లైబ్రేరియన్, కంప్యూటర్ ఆపరేటర్

ట్రాన్స్ లేటర్, అసిస్టెంట్ లైబ్రేరియన్, కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాలకు ఏప్రిల్ 01, 2023న ఒక్కటే షిప్ట్ లో నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటల నుంచి 10.30 వరకు ఉంటుందని మొదట పేర్కొనగా దానిని సవరిస్తూ మరో సమయాన్ని కేటాయించారు. ఉదయం 08.30 గంటలకు పరీక్ష మొదలుకానుండగా.. 10.30 పరీక్ష ముగుస్తుందని పేర్కొన్నారు.

ఈ పరీక్షలకు సంబంధించి అడ్మిట్ కార్డులు మార్చి 23 నుంచి అందుబాటులో ఉండనున్నాయి.

 ఇక తెలంగాణ జిల్లాలో కోర్డుల్లో ఖాళీగా ఉన్న పోస్టులకు పరీక్ష తేదీలు ఇలా ఉన్నాయి.

1.జూనియర్ అసిస్టెంట్ (క్లస్టర్ 03) ఉద్యోగాలకు ఏప్రిల్ 03, 2023న ఉదయం మొదటి షిప్ట్ లో ఉంటుంది. క్లస్టర్ 01 సెకండ్ షిప్ట్ లో ఉండగా.. జూనియర్ అసిస్టెంట్ క్లస్టర్ 02 థర్డ్ షిప్ట్ లో ఉంటుంది. వీటికి కూడా మొదటి షిఫ్ట్ 08.30 నుంచి 10.30 వరకు, సెకండ్ షిప్ట్ 12.30 నుంచి 2.30 వరకు, థర్డ్ షిప్ట్ 4.45 నుంచి 6.45 వరకు ఉండనుంది.

2. రికార్ట్ అసిస్టెంట్ ఉద్యోగాలకు ఏప్రిల్ 04, 2023న రెండు షిప్ట్ లల్లో పరీక్షను ఆన్ లైన్ విధానంలో నిర్వహించనున్నారు. 

 3.ఎగ్జామినర్ పోస్టులకు ఏప్రిల్ 04, 2023న చివరి షిప్ట్ లో పరీక్షను ఆన్ లైన్ విధానంలో నిర్వహించనున్నారు.

4.ఫిల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించి ఆన్ లైన్ పరీక్ష ఒకే షిప్ట్ లో ఏప్రిల్ 05, 2023న నిర్వహించనున్నారు.

ఈ పరీక్షలకు సంబంధించి అడ్మిట్ కార్డులు మార్చి 23 నుంచి అందుబాటులో ఉండనున్నాయి. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.

No comments:

Post a Comment

Job Alerts and Study Materials