తెలంగాణలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ఖమ్మం జిల్లా వైద్యారోగ్య అధికారి కార్యాలయం పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ (Telangana Jobs Notification) విడుదల చేసింది. మొత్తం 11 విభాగాల్లో 19 ఉద్యోగాలను (Telangana Jobs) భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు అధికారులు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానంలో ఖమ్మం డీఎంహెచ్ఓ (DMHO) ఆఫీస్ లో తమ దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభం కాగా.. దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల 13ను ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా తమ దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది.
విద్యార్హల వివరాలు:
వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలను నిర్ణయించారు. పోస్టుల ఆధారంగా టెన్త్, ఇంటర్, డీఫార్మసీ, బీపీటీ, బీకాం, డిగ్రీ, ఎంబీబీఎస్, ఎండీ, పీజీ పాసైన వారు దరఖాస్తు చేసుకున్న వారు అప్లై చేసుకోవచ్చు.
వయస్సు: అభ్యర్థుల వయస్సు 18-44 ఏళ్లు ఉండాలి.
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు స్వీకరణకు ఆఖరి తేదీ: మార్చి 13
ఫైనల్ మెరిట్ లిస్ట్: మార్చి 21
నియామక ఉత్తర్వులు జారీ: మార్చి 22
- ఇతర పూర్తి వివరాలకు ఈ లింక్ పై క్లిక్ చేయండి
No comments:
Post a Comment