Mother Tongue

Read it Mother Tongue

Sunday, 19 March 2023

ఎయిర్‌క్రాఫ్ట్ టెక్నీషియన్ ఉద్యోగాలు.. రేపటితో ముగియనున్న దరఖాస్తుల గడువు..

 ఎయిర్ ఇండియా ఇంజనీరింగ్ సర్వీసెస్ లిమిటెడ్(AIESL) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెల్లడించింది. ఈ నోటిఫికేషన్ ద్వారా పదో తరగతి అర్హతతో పలు ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా ఎయిర్‌క్రాఫ్ట్ టెక్నీషియన్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు ఇప్పటికే దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కాగా.. దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ మార్చి 20గా నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. అంటే దరఖాస్తులకు రేపటితో గడువు ముగియనుంది.  వీటికి దరఖాస్తులు అనేవి ఆన్ లైన్ లో మాత్రమే చేయాల్సి ఉంటుంది. దీని కోసం అభ్యర్థులు ఎయిర్ ఇండియా ఇంజనీరింగ్ సర్వీసెస్ లిమిటెడ్ యొక్క అధికారిక వెబ్‌సైట్‌ను aiesl.in సందర్శించాలి. ఇది కాకుండా, ఇతర మార్గాల ద్వారా చేసిన దరఖాస్తులు అంగీకరించబడవు. ఈ రిక్రూట్‌మెంట్‌లకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 20 మార్చి 2023. చివరి తేదీకి ఇంకా తక్కువ సమయం మాత్రమే ఉంది. కాబట్టి ఆలస్యం చేయకుండా.. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు దరఖాస్తులు సమర్పించండి. ఫిబ్రవరి 20 నుంచి దరఖాస్తుల స్వీకరణ జరుగుతోంది.

ఈ పోస్టులకు దరఖాస్తు చేయడానికి.. అభ్యర్థి ఏదైనా గుర్తింపు పొందిన సంస్థ నుంచి SSC / NCVT / ఇంజనీరింగ్‌లో డిప్లొమా కలిగి ఉండాలి. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా మొత్తం 371 పోస్టులను భర్తీ చేస్తారు.

వయోపరిమితి..

దరఖాస్తు చేసే అభ్యర్థి యొక్క వయస్సు OBC అభ్యర్థులకు వయోపరిమితి 38 సంవత్సరాలు , SC/ST అభ్యర్థులకు వయోపరిమితి 40 సంవత్సరాలుగా నిర్ణయించబడింది.

పోస్టుల వివరాలు :

1.ఎయిర్‌క్రాఫ్ట్ టెక్నీషియ‌న్స్ (ఎ&సి)199 పోస్టులు

2.ఎయిర్‌క్రాఫ్ట్ టెక్నీషియ‌న్స్ (ఏవియానిక్స్) 97 పోస్టులు

3.స్కిల్డ్ టెక్నీషియ‌న్స్ 71 పోస్టులు

4.ఎంఆర్ఏసీ (మెకానిక‌ల్ రిఫ్రిజిరేష‌న్ ఎయిర్ కండిష‌న్) 02 పోస్టులు

5.ఎంఎంఓవీ (మెకానిక‌ల్ మోట‌ర్ వెహిక‌ల్ ) 02 పోస్టులు

దరఖాస్తు ఫీజు..

ఈ పోస్టులకు దరఖాస్తు చేసేందుకు జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.1000 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, మాజీ సైనికులు రూ.500 చెల్లించాల్సి ఉంటుంది.

No comments:

Post a Comment

Job Alerts and Study Materials