Mother Tongue

Read it Mother Tongue

Sunday, 19 March 2023

గుడ్ న్యూస్.. TSLPRB ఎస్సై(SI) అడ్మిట్ కార్డులు విడుదల..

 SCT SI (PTO) ఉద్యోగాలకు సంబంధించి టెక్నికల్ రాత పరీక్షను 26 మార్చి 2023 ఉదయం 10 నుండి మధ్యాహ్నం 1 గంటల వరకు నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి హాల్ టికెట్స్ విడుదల తేదీని తెలంగాణ పోలీస్ నియామక బోర్డు ప్రకటించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. SCT SI (PTO)కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు.. మార్చి 21వ తేదీ ఉదయం 8 గంటల నుంచి మార్చి 24 అర్ధరాత్రి 12 గంటల వరకు అభ్యర్థులు హాల్ టికెట్స్ డౌన్ లోడ్ చేసుకోవచ్చని పేర్కొన్నారు.

TSLPRB వెబ్‌సైట్‌లో ద్వారా అభ్యర్థి యొక్క రిజిస్ట్రేషన్ నంబర్ మరయి పాస్ వర్డ్ ఉపయోగించి.. 24 మార్చి 2023 లోపు హాల్ టిక్కెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. వీటిపై ఎవైనా సందేహాలు ఉంటే.. support@tslprb.inకు ఇ-మెయిల్ పంపవచ్చు లేదా 93937 11110 లేదా 93910 05006లో సంప్రదించవచ్చు.

 SCT SI (PTO) పోస్టుల భర్తీకి నిర్వహించే ఇతర రెండు పేపర్లకు సంబంధించి హాల్ టికెట్స్ ను త్వరలో జారీ చేయబడతాయని పోలీస్ నియామక మండలి ప్రెస్ నోట్ విడుదల చేసింది. పూర్తి వివరాలకు అధికారిక వెబ్ సైట్ ను సందర్శించండి.

తెలంగాణ పోలీస్ నియామక సంస్థ విడుదల చేసిన నోటిఫికేషన్లలో టెక్నికల్ నోటిఫికేషన్ల వివరాలు ఇలా ఉన్నాయి..

స్టైపెండరీ క్యాడెట్ ట్రైనీ (SCT) పోలీస్ కానిస్టేబుల్ (Information Technology & Communications Organization)- 262

స్టైపెండరీ క్యాడెట్ ట్రైనీ (SCT) పోలీస్ కానిస్టేబుల్ (Mechanics) (Men)- 21

స్టైపెండరీ క్యాడెట్ ట్రైనీ (SCT) పోలీస్ కానిస్టేబుల్ (Drivers) (Men) - 100

స్టైపెండరీ క్యాడెట్ ట్రైనీ (SCT) సబ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ (Information Technology & Communications Organization)- 22

స్టైపెండరీ క్యాడెట్ ట్రైనీ (SCT) సబ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ (Police Transport Organization)- 03

స్టైపెండరీ క్యాడెట్ ట్రైనీ (SCT) అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్- 8

No comments:

Post a Comment

Job Alerts and Study Materials