నిరుద్యోగులకు శుభవార్త. ఢిల్లీ యూనివర్సిటీలోని లేడీ ఇర్విన్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇప్పటికే వీటి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కాగా.. చివరి తేదీ ఏప్రిల్ 02గా నిర్ణయించారు. పూర్తి వివరాలకు అభ్యర్థులు https://ladyirwin.edu.in/ సందర్శించొచ్చు. లేడీ ఇర్విన్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తు చేసుకోవచ్చు. దీని కోసం అభ్యర్థులు ఈ వెబ్‌సైట్‌ను colrec.uod.ac.in . సందర్శించాలి. పూర్తి వివరాలకు ఈ వెబ్ సైట్ ను ladyirwin.edu.in సందర్శించొచ్చు.
దరఖాస్తు ఫీజు..
ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా మొత్తం 65 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులు అసిస్టెంట్ ప్రొఫెసర్ మరియు వివిధ సబ్జెక్టులకు సంబంధించినవిగా ఉన్నాయి. దరఖాస్తు ఫీజు విషయానికొస్తే.. అన్‌రిజర్వ్‌డ్, OBC, EWS కేటగిరీ అభ్యర్థులు రూ. 500 ఫీజు చెల్లించాలి. కాగా SC, ST, PWD అభ్యర్థులు ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు.
పోస్టుల వివరాలిలా..
మొత్తం 65 ఉద్యోగాలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.
వీటిలో బీఎడ్-06, బీఎడ్ విత్ ఐడీ-03, ఆర్కిటెక్చర్ -01, ఫుడ్ టెక్నాలజీ-03, హ్యూమన్ డెవలప్ మెంట్ - 06, బయో కెమిస్ట్రీ -02, బోటనీ -01, కెమిస్ట్రీ -02, డెవలప్ మెంట్ కమ్యూనికేషన్ అండ్ ఎక్సెటెన్షన్ -08, ఇంగ్లీష్ - 01, ఎన్విరాన్ మెంట్ - 01, ఫ్యాబ్రిక్ అండ్ అపారెల్ సైన్స్ - 05, ఫుడ్ అండ్ న్యూట్రిషన్ - 08, మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం - 02, మైక్రోబయాలజీ-01, పిజిక్స్ - 02, సైకాలజీ - 01, రీసోర్స్ మేనేజ్ మెంట్ - 08, సోషియాలజీ - 01, స్టాటిస్టిక్స్ - 01, జువాలజీ - 02 పోస్టులున్నాయి.
జీతం..
ఎంపికైన అభ్యర్థులకు జీతం నెలకు రూ. 57,700 నుండి రూ. 1,82,400 వరకు ఉంటుంది. ఏదైనా ఇతర రకాల సమాచారాన్ని వివరంగా పొందడానికి.. మీరు అధికారిక వెబ్‌సైట్‌లో ఇచ్చిన నోటీసును తనిఖీ చేయవచ్చు. దాని కోసం అభ్యర్థులు ఇక్కడ క్లిక్ చేయండి.
No comments:
Post a Comment