ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (FCI) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ప్రకారం FCIలో 46 పోస్టులకు రిక్రూట్‌మెంట్ ఉంటుంది. అభ్యర్థులు అధికారిక సైట్ fci.gov.in ను సందర్శించడం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. వీటికి ఇప్పటికే దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కాగా.. 3 ఏప్రిల్ 2023 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌సిఐ)లో మొత్తం 46 పోస్టులను భర్తీ చేస్తారు. ఇందులో 26 అసిస్టెంట్ జనరల్ మేనేజర్ (AE) మరియు 20 అసిస్టెంట్ జనరల్ మేనేజర్ (EM) పోస్టులు ఉన్నాయి.
అర్హత
అసిస్టెంట్ జనరల్ మేనేజర్ (AE): ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సివిల్ ఇంజినీరింగ్‌లో డిగ్రీ చేసి ఉండాలి. అసిస్టెంట్ ఇంజనీర్ ర్యాంక్‌లో కనీసం ఐదు సంవత్సరాల అనుభవం ఉండాలి.
అసిస్టెంట్ జనరల్ మేనేజర్ (EM): ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్/మెకానికల్ ఇంజనీరింగ్‌లో డిగ్రీని కలిగి ఉండాలి. అసిస్టెంట్ ఇంజనీర్ ర్యాంక్‌లో కనీసం ఐదు సంవత్సరాల పని అనుభవం కలిగి ఉండటం అవసరం.
ఈ పోస్టులకు అభ్యర్థులను పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు రూ.60 వేల నుంచి రూ.1.80 లక్షల వరకు వేతనం అందజేస్తారు.
ఎంపికైన అభ్యర్థుల ప్లేస్‌మెంట్ ఢిల్లీ / NCR, చెన్నై, ముంబై, కోల్‌కతా, గౌహతి, చండీగఢ్, సిమ్లా, జైపూర్, లక్నో, జమ్మూ & కాశ్మీర్, డెహ్రాడూన్, పంచకుల, బెంగళూరు, అమరావతి , హైదరాబాద్ , అహ్మదాబాద్, రాయ్‌పూర్, భోపాల్, పాట్నా, రాంచీ, భువనేశ్వర్, షిల్లాంగ్, ఇటానగర్, ఇంఫాల్, దిమాపూర్ తదితర ప్రాంతాల్లో నిర్వహించనున్నారు.
No comments:
Post a Comment