Mother Tongue

Read it Mother Tongue

Wednesday, 6 September 2023

ఆంధ్రప్రదేశ్ లో 8వ తరగతి, 10వ తరగతి మరియు డిగ్రీ అర్హతతో 942 డేటా ఎంట్రీ ఆపరేటర్, టెక్నికల్ అసిస్టెంట్ మరియు హెల్పేర్ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల..

ఏపీ రాష్ట్ర సివిల్ సప్లైస్ కార్పొరేషన్ పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా పశ్చిమగోదావరి జిల్లాలో 942 పోస్టులకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు.

ఏపీ రాష్ట్ర సివిల్ సప్లైస్ కార్పొరేషన్ పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్(Notification) విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా పశ్చిమగోదావరి(West Godavari) జిల్లాలో 942 పోస్టులకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. రాష్ట్ర పౌర సరఫరాల కార్పొరేషన్ లిమిటెడ్(Corporation Limited), జిల్లా కార్యాలయం ధాన్య సేకరణకు సంబంధించి రెండు నెలల కాలానికి ఒప్పంద ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఈ పోస్టులను కేవలం ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన నియమిస్తున్నారు. విభాగాల వారీగా పోస్టుల వివరాలు ఇలా ఉన్నాయి. దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల యొక్క అర్హతలు ఈ విధంగా ఉండాలి. టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు బీఎస్సీ (అగ్రికల్చర్/మైక్రోబయాలజీ/బయోకెమిస్ట్రీ /బయోటెక్నాలజీ/ బీఎస్సీ(బీజెడ్సీ)/బీఎస్సీ (లైఫ్ సైన్సెస్/డిప్లొమా(అగ్రికల్చర్) ఉత్తీర్ణులై ఉండాలి. ఈ అర్హతలు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలకు అభ్యర్థులు ఏదైనా డిగ్రీతో పాటు పీజీడీసీఏ ఉత్తీర్ణులై ఉండాలి. హెల్పర్ ఉద్యోగాలకు అభ్యర్థులు కనీసం 8 లేదా 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. ఎంపికలో ఎలాంటి రాత పరీక్ష నిర్వహించరు. కేవలం అకడమిక్ మార్కులు, పని అనుభవం ఆధారంగా ఉంటుంది. నోటిఫికేషన్ ప్రకారం నిర్ణీత నమూనాలో ప్రత్యక్షంగా దరఖాస్తులను సంబంధిత ధ్రువపత్రాల జిరాక్స్ లను జతచేసి రిజిస్టర్ పోస్టు ద్వారా లేదా వ్యక్తిగతంగా సమర్పించాలి. దరఖాస్తులను జిల్లా పౌరసరఫరాల మేనేజర్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల కార్పొరేషన్ లిమిటెడ్, జిల్లా కార్యాలయం, కలెక్టరేట్ కాంపౌండ్, నరసింహపురం, భీమవరం చిరునామాకు పంపించాలి. దరఖాస్తులు సమర్పించడానికి ఒక్కరోజు మాత్రమే సమయం ఉంది. సెప్టెంబర్ 07, 2023 సాయంత్రం 5 గంటలలోపు దరఖాస్తులను సమర్పించాలి. పూర్తి వివరాలకు వెబ్ సైట్ https://westgodavari.ap.gov.in/ సందర్శించండి.

ఉద్యోగ ఖాళీలు 942

  1. డేటాఎంట్రీ ఆపరేటర్ - 314
  2. టెక్నికల్ అసిస్టెంట్ -314
  3. హెల్పర్ - 314

ముఖ్యమైన తేదీలు

  1. సెప్టెంబర్ 07, 2023 సాయంత్రం 5 గంటలలోపు దరఖాస్తులను సమర్పించాలి.
  2. దరఖాస్తులు సమర్పించడానికి ఒక్కరోజు మాత్రమే సమయం ఉంది.

వయోపరిమితి

  1. టెక్నికల్ అసిస్టెంట్, డేటా ఎంట్రా ఆపరేటర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల యొక్క వయస్సు 21 నుంచి 40 ఏళ్లు, హెల్పర్ కు 18నుంచి 35ఏళ్ల మధ్య ఉండాలి.

ముఖ్యమైన లింక్స్

  1. నోటిఫికేషన్ ను డౌన్లోడ్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి
  2. అధికారిక వెబ్సైటు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

Job Alerts

మీ వాట్స్ అప్ నెంబర్ కె జాబ్ అలర్ట్స్ రావాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

Date

Item Name

Details

07/07/2023 ఉద్యోగ సమాచారం Get Details
06/09/2023 ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసారా.. చేయకపోతే చేసుకొండి Get Details
23/07/2023 ధరఖాస్తు చివరితేదీ పొడిగింపు Get Details
17/07/2023 వ్రాత పరీక్ష తేదీ Get Details
06/09/2023 అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్ Get Details
15/07/2023 ఆన్సర్ కీ Get Details
01/07/2023 ఫలితాలు Get Details
11/07/2023 ఫైనల్ రిసల్ట్ | తుది ఫలితం Get Details
15/07/2023 డాక్యుమెంట్ వెరిఫికేషన్ Get Details
15/07/2023 ఎంపిక జాబితా Get Details
01/07/2023 TSPSC గ్రూప్ 4, పేపర్ 1 Get Details
07/04/2023 జనరల్ అవేర్నెస్ Get Details
07/04/2023 క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ Get Details
07/04/2023 రీజనింగ్ Get Details
07/04/2023 కరెంటు అఫైర్స్ Get Details
టెలిగ్రామ్ లో జాబ్ అలర్ట్స్ రావాలంటే టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి

2 comments:

Job Alerts and Study Materials