తెలంగాణలో ఇంటర్మీడియట్(Intermediate), పాలిటెక్నిక్ కాలేజీల్లో(Polytechnic College) ఇటీవల ఫిజికల్ డైరెక్టర్(Physical Director) ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ వెలువడిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షను సెప్టెంబర్ 11వ తేదీన నిర్వహించాల్సి ఉండగా.. వాయిదా వేస్తున్నట్లు టీఎస్పీఎస్సీ వెబ్ నోట్(Webnote) విడుదల చేసింది. ఎందుకు వాయిదా వేస్తున్నామనే కారణాన్ని పేర్కొనలేదు. అయితే మళ్లీ ఈ పరీక్షను ఎప్పుడు నిర్వహించే విషయాన్ని పేర్కొన్నారు. ఫిజికల్ డైరెక్టర్ పరీక్షను నవంబర్ 14వ తేదీన నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆ రోజున ఉదయం 10 గంటల నుంచి 12.30 వరకు ఒక పేపర్, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 5.00 గంటల వరకు మరో పేపర్ పరీక్షను నిర్వహిస్తారు. వీటికి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ హాల్ టికెట్స్ ను పరీక్షకు వారం రోజులు ముందు డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. దీని కోసం అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ను సందర్శించాల్సి ఉంటుంది.
ముఖ్యమైన లింక్స్
- అధికారిక వెబ్సైటు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
No comments:
Post a Comment