
ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) రాష్ట్రంలోని నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. పలు ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగాలను (Private Jobs) భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ముందుగా రిజిస్టర్ (Job Registration) చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్టర్ చేసుకున్న అభ్యర్థులకు ఈ నెల 8న ఇంటర్వ్యూలు ఉంటాయి.
ఖాళీలు, విద్యార్హతల వివరాలు
- Radiant Appliances & Electronics Pvt Ltd: ఈ సంస్థలో 80 ఖాళీలు ఉన్నాయి. డిగ్రీ, బీటెక్ చేసిన వారికి అవకాశం ఉంటుంది.
- Victorious Future Energy Pvt Ltd: ఈ సంస్థలో 200 ఖాళీలు ఉన్నాయి. ఐటీఐ చేసిన వారికి అవకాశం ఉంటుంది.
- EMRI 108&100: ఈ సంస్థలో 50 ఖాళీలు ఉన్నాయి. ఏదైనా డిగ్రీ చేసిన వారికి అవకాశం ఉంటుంది.
- S.K Bio Enterprizes Pvt Ltd: ఈ సంస్థలో 30 ఖాళీలు ఉన్నాయి. టెన్త్ నుంచి డిగ్రీ చేసిన వారికి అవకాశం ఉంటుంది.
ఇతర వివరాలు:
- అభ్యర్థులు ముందుగా ఈ కింద ఇచ్చిన లింక్ తో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.
- రిజిస్టర్ చేసుకున్న వారికి ఈ నెల 8న ఉదయం 9 గంటలకు ఇంటర్వ్యూలు ఉంటాయి.
- ఇంటర్వ్యూలు నిర్వహించే చిరునామా: గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ, నందికొట్కూర్.
- ఇతర వివరాలకు 9440224291 నంబర్ ను సంప్రదించాలని ప్రకటనలో పేర్కొన్నారు.
ముఖ్యమైన లింక్స్
- అధికారిక వెబ్సైటు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
No comments:
Post a Comment