
TS TET Admit Cards Released: తెలంగాణ టెట్ అడ్మిట్ కార్డ్స్ విడుదలయ్యాయి. టెట్ కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు https://tstet.cgg.gov.in/ ద్వారా తమ అడ్మిట్ కార్డులను డౌన్ లోడ్ చేసుకోవచ్చు. డౌన్ లోడ్ చేసుకోవచ్చు. పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
తెలంగాణలో(Telangana) ఆగస్టు 1న టెట్ నోటిఫికేషన్ ను (TS TET-2023) ప్రభుత్వం(Government) విడుదల చేసింది. ఇందుకు సంబంధించిన దరఖాస్తులను ఆగస్టు 2 నుంచి స్వీకరించగా.. దరఖాస్తు ప్రక్రియ(Application Process) ఆగస్టు 16న ముగిసింది. దరఖాస్తు ముగిసే సమయానికి మొత్తం 2,83,620 అప్లికేషన్లు వచ్చినట్లు అధికారులు ప్రకటించారు. పరీక్షకు దరఖాస్తు(Application) చేసుకున్న సెప్టెంబర్ 15వ తేదీన పరీక్ష నిర్వహించేందుకు ఏర్పాట్లు సాగుతున్నాయి. దీనిలో భాగంగానే అధికారులు టెట్ హాల్ టికెట్స్ ను విడుదల చేశారు. అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ https://tstet.cgg.gov.in/ ద్వారా తమ అడ్మిట్ కార్డులను డౌన్ లోడ్ చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అధికారిక సైట్ ను సందర్శించి.. తమ రిజిస్ట్రేషన్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. సెస్టెంబర్ 15న ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపర్-1, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్-2 ను నిర్వహించనున్నారు. అనంతరం సెప్టెంబర్ 27న ఫలితాలను విడదుల చేస్తామని అధికారులు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఫలితాల విడుదల అనంతరం ఒకటి రెండు రోజుల్లో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. టెట్ కు సంబంధించి గత నోటిఫికేషన్ తో పోల్చితే ఈ సారి టెట్ పరీక్షకు దరఖాస్తులు తగ్గాయి. గతంలో 4 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. అయితే.. ఈ సారి దాదాపు అందులో సగం మాత్రమే రావడం గమనార్హం. అభ్యర్థులంతా గురుకుల పరీక్షకు సన్నద్ధం అవ్వడంటో టెట్ పై ఫోకస్ చేయలదని అధికారులు భావిస్తున్నారు. డీఎస్సీ (DSC) లో టెట్ మార్కులకు 20 శాతం మేర వెయిటేజీ ఉండటంతో వీటికి ప్రాధాన్యత ఏర్పడింది. టెట్ ఉత్తీర్ణత సర్టిఫికెట్ చెల్లుబాటు గతంలో ఏడేళ్లు మాత్రమే ఉండగా గతేడాది ఎన్‌సీటీఈ దీన్ని సవరించి జీవితకాలం చెల్లుతుందని ప్రకటించింది. దీంతో ఒక్కసారి పాస్ అయితే చాలు లైఫ్‌టైమ్ వాలిడిటీ ఉంటుందనే ఆశతో అభ్యర్థులు ప్రిపరేషన్స్ షురుచేశారు.
ముఖ్యమైన లింక్స్
- ఆన్లైన్ అప్లై చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి
- అధికారిక వెబ్సైటు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
No comments:
Post a Comment