
ఏపీ రాష్ట్ర సివిల్ సప్లైస్ కార్పొరేషన్ పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా పశ్చిమగోదావరి జిల్లాలో 942 పోస్టులకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు.
ఏపీ రాష్ట్ర సివిల్ సప్లైస్ కార్పొరేషన్ పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్(Notification) విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా పశ్చిమగోదావరి(West Godavari) జిల్లాలో 942 పోస్టులకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. రాష్ట్ర పౌర సరఫరాల కార్పొరేషన్ లిమిటెడ్(Corporation Limited), జిల్లా కార్యాలయం ధాన్య సేకరణకు సంబంధించి రెండు నెలల కాలానికి ఒప్పంద ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఈ పోస్టులను కేవలం ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన నియమిస్తున్నారు. విభాగాల వారీగా పోస్టుల వివరాలు ఇలా ఉన్నాయి. దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల యొక్క అర్హతలు ఈ విధంగా ఉండాలి. టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు బీఎస్సీ (అగ్రికల్చర్/మైక్రోబయాలజీ/బయోకెమిస్ట్రీ /బయోటెక్నాలజీ/ బీఎస్సీ(బీజెడ్సీ)/బీఎస్సీ (లైఫ్ సైన్సెస్/డిప్లొమా(అగ్రికల్చర్) ఉత్తీర్ణులై ఉండాలి. ఈ అర్హతలు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలకు అభ్యర్థులు ఏదైనా డిగ్రీతో పాటు పీజీడీసీఏ ఉత్తీర్ణులై ఉండాలి. హెల్పర్ ఉద్యోగాలకు అభ్యర్థులు కనీసం 8 లేదా 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. ఎంపికలో ఎలాంటి రాత పరీక్ష నిర్వహించరు. కేవలం అకడమిక్ మార్కులు, పని అనుభవం ఆధారంగా ఉంటుంది. నోటిఫికేషన్ ప్రకారం నిర్ణీత నమూనాలో ప్రత్యక్షంగా దరఖాస్తులను సంబంధిత ధ్రువపత్రాల జిరాక్స్ లను జతచేసి రిజిస్టర్ పోస్టు ద్వారా లేదా వ్యక్తిగతంగా సమర్పించాలి. దరఖాస్తులను జిల్లా పౌరసరఫరాల మేనేజర్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల కార్పొరేషన్ లిమిటెడ్, జిల్లా కార్యాలయం, కలెక్టరేట్ కాంపౌండ్, నరసింహపురం, భీమవరం చిరునామాకు పంపించాలి. దరఖాస్తులు సమర్పించడానికి ఒక్కరోజు మాత్రమే సమయం ఉంది. సెప్టెంబర్ 07, 2023 సాయంత్రం 5 గంటలలోపు దరఖాస్తులను సమర్పించాలి. పూర్తి వివరాలకు వెబ్ సైట్ https://westgodavari.ap.gov.in/ సందర్శించండి.
ఉద్యోగ ఖాళీలు 942
- డేటాఎంట్రీ ఆపరేటర్ - 314
- టెక్నికల్ అసిస్టెంట్ -314
- హెల్పర్ - 314
ముఖ్యమైన తేదీలు
- సెప్టెంబర్ 07, 2023 సాయంత్రం 5 గంటలలోపు దరఖాస్తులను సమర్పించాలి.
- దరఖాస్తులు సమర్పించడానికి ఒక్కరోజు మాత్రమే సమయం ఉంది.
వయోపరిమితి
- టెక్నికల్ అసిస్టెంట్, డేటా ఎంట్రా ఆపరేటర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల యొక్క వయస్సు 21 నుంచి 40 ఏళ్లు, హెల్పర్ కు 18నుంచి 35ఏళ్ల మధ్య ఉండాలి.
ముఖ్యమైన లింక్స్
- నోటిఫికేషన్ ను డౌన్లోడ్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి
- అధికారిక వెబ్సైటు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
డేటా ఎంట్రీ
ReplyDeleteAkhil
ReplyDelete