Mother Tongue

Read it Mother Tongue

Saturday, 26 August 2023

తెలంగాణాలో 1393 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలు.. నోటిఫికేషన్ ఎప్పుడంటే..?



 తెలంగాణలో(Telangana) ఉద్యోగాల జాతర కొనసాగుతోంది. ఇప్పటికే టీఎస్పీఎస్సీ నుంచి పలు ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్లు రిలీజ్ అయ్యాయి. ఆ నోటిఫికేషన్లకు సంబంధించి దరఖాస్తుల ప్రక్రియ ముగిసింది. చాలా వరకు పరీక్షలను కూడా నిర్వహించారు. ఫారెస్ట్ డిపార్ట్ మెంట్లో ఖాళీగా ఉన్న 1665 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ఇటీవల ప్రణాళికలు సిద్ధం అయ్యాయి. దీనికి సంబంధించి ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు అధికారులు కూడా పేర్కొంటున్నారు. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్(FBO), ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్(FRO), ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్స్ (FSO) వంటి కేటగిరీల్లో పోస్టులను భర్తీ చేయనున్నారు. అయితే వీటిలో ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ కు సంబంధించి పోస్టులను ప్రమోషన్ల ద్వారా భర్తీ చేయనున్నారు. వీటికి సంబంధించి ఆర్థిక శాఖ ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా.. వీటికి ఇప్పటి వరకు నోటిఫికేషన్లు విడుదల కాలేదు. వీటిలో అత్యధికంగా 1393 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పోస్టులున్నాయి.వీటిని టీఎస్పీఎస్సీ ద్వారా భర్తీ చేయనున్నారు. ఈ నోటిఫికేషన్ విడుదల చేయాలని నిరుద్యోగులు కోరుతున్నారు. జిల్లాల వారీగా ఉంటే ఈ ఖాళీల కారణంగా అందరికీ అవకాశం వస్తుందని వారు టీఎస్పీఎస్సీని కోరుతున్నారు. అయితే ఇప్పటికే చాలా వరకు నోటిఫికేషన్లు విడుదల కాగా టీఎస్పీఎస్సీ వాటి నియామక ప్రక్రియలో బిజీ అయింది. ఈ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్ ఎన్నికల తర్వాత విడుదల చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు సమాచారం.

No comments:

Post a Comment

Job Alerts and Study Materials