కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో జూనియర్ ఇంజనీర్‌గా చేరాలనుకునే వారికి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) గుడ్‌న్యూస్ చెప్పింది. వివిధ విభాగాల్లో వెయ్యికి పైగా జూనియర్ ఇంజనీర్ ఉద్యోగాల భర్తీ కోసం భారీ నోటిఫికేషన్‌ను రిలీజ్ చేసింది. ఆసక్తి గల అభ్యర్థులు ఆగస్టు 16 రాత్రి 11 గంటల లోపు దరఖాస్తు చేసుకోవాల్సిందిగా సూచించింది. అంటే దరఖాస్తులకు కొన్ని గంటలే సమయం ఉంది. SSC JE 2023 రిక్రూట్‌మెంట్ ఎగ్జామ్ రాసిన అభ్యర్థులు సివిల్, మెకానికల్ లేదా ఎలక్ట్రికల్ జూనియర్ ఇంజనీర్‌గా ఉద్యోగం సంపాదించవచ్చు. SSC జులై 26న ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ప్రారంభమైంది. SSC అఫీషియల్ వెబ్‌సైట్ ssc.nic.inలో దరఖాస్తు చేసుకోవచ్చు. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్ స్పెషలైజేషన్స్‌లో జూనియర్ ఇంజనీర్ల కోసం 1,324 స్థానాలను భర్తీ చేయడానికి రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌ను నిర్వహిస్తోంది. ఈ ఖాళీలు MES, BRO, CPWD, NTRO సహా కేంద్ర ప్రభుత్వంలోని వివిధ డిపార్ట్‌మెంట్లలో ఉన్నాయి. ఈ డ్రైవ్‌లో బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (BRO) కేవలం మేల్ అప్లికేంట్స్‌ను మాత్రమే ఉద్యోగంలో చేర్చుకోనుంది. ఈ సంస్థ 431 మంది జూనియర్ సివిల్ ఇంజనీర్లను, 55 మంది ఎలక్ట్రికల్ & మెకానికల్ జూనియర్ ఇంజనీర్లను భర్తీ చేస్తోంది. సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ (CPWD) 421 మంది జూనియర్ సివిల్ ఇంజనీర్లను, 124 మంది ఎలక్ట్రికల్ జూనియర్ ఇంజనీర్లను నియమించుకుంటోంది. సెంట్రల్ వాటర్ కమిషన్‌లో 188 జూనియర్ ఇంజనీర్ (సివిల్) పోస్టులు, 23 జూనియర్ ఇంజనీర్లు (మెకానికల్) పోస్టులు ఉన్నాయి. ఫరక్కా బ్యారేజ్ ప్రాజెక్ట్‌లో 15 జూనియర్ ఇంజనీర్ (సివిల్) పోస్టులు, 6 జూనియర్ ఇంజనీర్ (మెకానికల్) పోస్టులు ఉన్నాయి. మిలిటరీ ఇంజనీర్ సర్వీసెస్ 29 జూనియర్ ఇంజనీర్ (సివిల్) పోస్టులు, 18 జూనియర్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్ & మెకానికల్) పోస్టులు ఉన్నాయి. మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్, షిప్పింగ్ & వాటర్‌వేస్ (అండమాన్ లక్షద్వీప్ హార్బర్ వర్క్స్‌లో జూనియర్ ఇంజనీర్ (సివిల్) పోస్టులు 7, జూనియర్ ఇంజనీర్ (మెకానికల్) పోస్టులు 1 ఉన్నాయి. నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్‌లో జూనియర్ ఇంజనీర్ (సివిల్) పోస్టులు 4, జూనియర్ ఇంజనీర్లు (ఎలక్ట్రికల్) పోస్టులు 1, జూనియర్ ఇంజనీర్లు (మెకానికల్) పోస్టులు 1 ఉన్నాయి. ఈ పోస్టులకు ఏజ్ లిమిట్ 30 నుంచి 32 వరకు ఉంటుంది. సంబంధిత ఇంజనీరింగ్ విభాగాల్లో డిప్లొమా లేదా డిగ్రీ పూర్తి చేసిన వారు అప్లికేషన్ దరఖాస్తుకు అర్హులు.
ముఖ్యమైన లింక్స్
- ఆన్లైన్ అప్లై చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి
- నోటిఫికేషన్ ను డౌన్లోడ్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి
- అధికారిక వెబ్సైటు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

No comments:
Post a Comment