ఇండియాలో చాలా మంది నిరుద్యోగులు సరైన అవకాశాల కోసం ఎదురుచూస్తున్నారు. నోటిఫికేషన్‌ల కోసం నిరీక్షిస్తున్నారు. ఈ సమయంలో నిరుద్యోగులకు భారత ప్రభుత్వ ఆధ్వర్యంలోని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా (CAG) గుడ్‌న్యూస్ అందించింది. బ్యాచిలర్ డిగ్రీ అర్హతతో CAG భారీ నోటిఫికేషన్‌ను ఇటీవల విడుదల చేసింది. కాగ్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా అప్లికేషన్ ప్రాసెస్ ఆగస్టు 17న ప్రారంభమైంది. ఈ గడువు సెప్టెంబర్ 17న ముగుస్తుంది. దీంతో అర్హులైన అభ్యర్థులు అధికారిక పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా కాగ్ మొత్తంగా 1773 పోస్ట్‌లను భర్తీ చేస్తుంది.
అప్లికేషన్ ప్రాసెస్
ముందుగా కాగ్ అధికారిక పోర్టల్ https://cag.gov.in/en ఓపెన్ చేయాలి. హోమ్ పేజీ మెనులోకి వెళ్లి రిక్రూట్‌మెంట్ నోటీస్ అనే సెక్షన్‌పై క్లిక్ చేయాలి. ఆ తరువాత కాగ్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ కనబడుతుంది. అన్ని వివరాలను పరిశీలించి ‘అప్లై ఆన్‌లైన్’ అనే ఆప్షన్‌పై ట్యాప్ చేసి, అవసరమైన వ్యక్తిగత వివరాలను ఎంటర్ చేసి రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తిచేయాలి. ఆ తరువాత రిజిస్టర్ ఐడీ, పాస్‌వర్డ్ సాయంతో లాగిన్ అయి అప్లికేషన్ ఫారమ్ ఓపెన్ చేయాలి. అన్ని వివరాలను ఎంటర్ చేయాలి. అవసరమైన డాక్యుమెంట్స్అప్‌లోడ్ చేయాలి. చివరగా అప్లికేషన్ ఫారమ్ సబ్‌మిట్ చేయాలి.
అవసరమయ్యే డాక్యుమెంట్స్
అభ్యర్థి ఫోటో, సంతకం స్కాన్ కాపీ, పదో తరగతి మార్క్‌లిస్ట్, క్యాస్ట్ సర్టిఫికేట్(వర్తి్స్తే), ఐడీ ప్రూఫ్‌గా ఆధార్ కార్డ్ వంటి డాక్యుమెంట్లను దరఖాస్తు సమయంలో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. అభ్యర్థులు అప్లికేషన్ సమయంలో ఎలాంటి ఫీజు చెల్లించనవసరం లేదు.
అర్హత ప్రమాణాలు
దరఖాస్తుదారుల వయసు 18 నుంచి 25 ఏళ్లలోపు ఉండాలి. రిజర్వుడ్ కేటగిరీ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితిలో ప్రభుత్వ నిబంధనల ప్రకారం సడలింపు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు గరిష్టంగా ఐదేళ్లు, ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. దరఖాస్తుదారులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా ఫీల్డ్‌లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. కంప్యూటర్ నాలెడ్జ్‌పై బేసిక్ పరిజ్ఞానం తప్పనిసరి. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (NIELIT) నుంచి CCC కోర్సులో సర్టిఫికేట్ ఉండాలి.
ఎంపిక ప్రక్రియ
అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పలు దశల్లో ఉంటుంది. మొదటి దశలో రాత పరీక్ష ఉంటుంది. ఇందులో క్వాలిఫై అయిన అభ్యర్థులకు రెండో రౌండ్‌లో ఇంటర్వ్యూ ఉంటుంది. ఆ తరువాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ను కాగ్ త్వరలో ప్రకటించనుంది.
జీతభత్యాలు
కాగ్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ రిక్రూట్‌మెంట్‌కు ఎంపికయ్యే అభ్యర్థులకు పే స్కేల్ లెవల్-4 ప్రకారం జీతం నెలకు రూ.25,500 నుంచి రూ.81,100 మధ్య ఉంటుంది.
ముఖ్యమైన లింక్స్
Job Alerts |
---|
మీ వాట్స్ అప్ నెంబర్ కె జాబ్ అలర్ట్స్ రావాలంటే ఇక్కడ క్లిక్ చేయండి |
Date |
Item Name |
Details |
---|---|---|
07/07/2023 | ఉద్యోగ సమాచారం | Get Details |
23/07/2023 | ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసారా.. చేయకపోతే చేసుకొండి | Get Details |
23/07/2023 | ధరఖాస్తు చివరితేదీ పొడిగింపు | Get Details |
17/07/2023 | వ్రాత పరీక్ష తేదీ | Get Details |
23/07/2023 | అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్ | Get Details |
15/07/2023 | ఆన్సర్ కీ | Get Details |
01/07/2023 | ఫలితాలు | Get Details |
11/07/2023 | ఫైనల్ రిసల్ట్ | తుది ఫలితం | Get Details |
15/07/2023 | డాక్యుమెంట్ వెరిఫికేషన్ | Get Details |
15/07/2023 | ఎంపిక జాబితా | Get Details |
01/07/2023 | TSPSC గ్రూప్ 4, పేపర్ 1 | Get Details |
07/04/2023 | జనరల్ అవేర్నెస్ | Get Details |
07/04/2023 | క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ | Get Details |
07/04/2023 | రీజనింగ్ | Get Details |
07/04/2023 | కరెంటు అఫైర్స్ | Get Details |
టెలిగ్రామ్ లో జాబ్ అలర్ట్స్ రావాలంటే టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి |
No comments:
Post a Comment