Mother Tongue

Read it Mother Tongue

Tuesday, 22 August 2023

IBPS SO, PO పోస్టులకు దరఖాస్తు గడువు పెంపు.. కొత్త తేదీ ఇదే..

బ్యాంకింగ్ సెక్టార్‌లో సెటిల్ అవ్వాలనుకునే వారికి విస్తృత అవకాశాలు కల్పిస్తోంది ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS). ఈ సంస్థ దేశంలోని ప్రధాన బ్యాంకుల్లో ఉద్యోగాలకు రిక్రూట్‌మెంట్ నిర్వహిస్తుంది. ఏటా ఐబీపీఎస్ క్లర్క్, ప్రొబేషనరీ ఆఫీసర్ (PO), స్పెషలిస్ట్ ఆఫీసర్ (SO) ఉద్యోగాలను భర్తీ చేస్తుంది. ఈ ఏడాదికి సంబంధించిన నోటిఫికేషన్ ఇప్పటికే రిలీజ్ అయింది. అయితే పీఓ, ఎస్‌ఓ ఉద్యోగాలకు అప్లై చేసుకునేందుకు గడువు నేటితో ఆగస్టు 21న ముగియగా.. తాజా ఈ దరఖాస్తుల గడువును పెంచారు. దీనిని మరో వారం రోజులు పెంచుతున్నట్లు తెలిపారు. IBPS SO మరియు PO పోస్టులకు దరఖాస్తు చేయడానికి కొత్త తేదీని నిర్ణయించారు. 28 ఆగస్టు 2023వ తేదీలోపు దరఖాస్తులు సమర్పించాలని తెలిపారు. దీనికి సంబంధించిన నోటీసును చూడడానికి మీరు క్రింద ఇచ్చిన ibps.in లింక్‌పై క్లిక్ చేయవచ్చు.

IBPS SO రిక్రూట్‌మెంట్..

IBPS SO నోటిఫికేషన్‌తో మొత్తం 1402 ఉద్యోగాలను భర్తీ చేయనుంది. అభ్యర్థులు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్స్ ఆగస్టు 1 నుంచి ఆగస్టు 28 వరకు పూర్తి చేయవచ్చు. ఈ ఉద్యోగాలకు సెలక్షన్ ప్రాసెస్ మూడు దశల్లో ఉంటుంది. ముందు ప్రిలిమ్స్, తర్వాత మెయిన్స్, ఇంటర్వ్యూ నిర్వహించి అభ్యర్థులను సెలక్ట్ చేస్తారు. ఐబీపీఎస్ SO 2023 ప్రిలిమినరీ ఎగ్జామ్స్ డిసెంబర్ 30, 31 తేదీల్లో, మెయిన్స్ పరీక్ష జనవరి 28న జరుగుతుంది. అప్లై చేస్తున్న పోస్టును బట్టి నిర్దిష్ట స్ట్రీమ్‌లో గ్రాడ్యుయేషన్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్‌ను ఈ ఉద్యోగాలకు అర్హతగా నిర్ణయించారు. అభ్యర్థుల వయసు 20 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎంపికైన వారికి జీతం నెలకు రూ.38,000 నుంచి రూ.39,000 వరకు ఉంటుంది.

IBPS PO రిక్రూట్‌మెంట్

ఈ ఏడాది మొత్తం 11 బ్యాంకుల్లో 3049 ప్రొబేషనరీ ఆఫీసర్ ఉద్యోగాలకు ఐబీపీఎస్ నోటిఫికేషన్ ఇచ్చింది. ఇందుకు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌ ప్రాసెస్ ఆగస్టు 1న ప్రారంభం కాగా, తుది గడువు ఆగస్టు 28 వరకు ఉంది. ఈ రిక్రూట్‌మెంట్ మొత్తం మూడు దశల్లో ఉంటుంది. ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షలు, క్వాలిఫై అయిన తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది.

అర్హత, పోస్టుల వివరాలిలా..

IBPS PO ప్రిలిమ్స్ అడ్మిట్ కార్డులు సెప్టెంబర్ 23న విడుదల అవుతాయి. ప్రిలిమినరీ పరీక్షలు సెప్టెంబర్ 23, 30, అక్టోబర్ 1న జరగనున్నాయి. IBPS PO మెయిన్స్ అడ్మిట్ కార్డులు అక్టోబర్ 23 నుంచి అందుబాటులో ఉంటాయి. మెయిన్స్ పరీక్ష నవంబర్ 5న జరగనుంది. గ్రాడ్యుయేట్ డిగ్రీ పూర్తి చేసినవారు పీఓ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల వయసు 20 ఏళ్ల నుంచి 30 సంవత్సరాల లోపు ఉండాలి. పీఓ ఉద్యోగానికి సెలక్ట్ అయిన వారికి జీతం నెలకు రూ. 52,000 నుంచి రూ. 55,000 వరకు ఉంటుంది.

దరఖాస్తు విధానం ఇలా..

  1. అర్హత, ఆసక్తి ఉన్నవారు IBPS అధికారిక వెబ్‌సైట్‌ ibps.in ఓపెన్ చేసి, హోమ్‌పేజీలో IBPS PO లేదా IBPS SO అప్లికేషన్ లింక్‌ క్లిక్ చేయండి.
  2. ఇక్కడ అవసరమైన వివరాలను అందించి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. తర్వాత క్రెడెన్షియల్స్ ఇచ్చి లాగిన్ అవ్వాలి.
  3. అప్లికేషన్ ఫారమ్‌లో అడిగిన అన్ని వివరాలను తప్పులు లేకుండా నింపాలి. తర్వాత అవసరమైన డాక్యుమెంట్స్ అన్నీ అప్‌లోడ్ చేయండి.
  4. అనంతరం అప్లికేషన్ ఫీజు చెల్లించండి. అన్ని వివరాలను ధ్రువీకరించిన తర్వాత, ఫారమ్‌ను సబ్‌మిట్ చేయండి.
  5. భవిష్యత్తు అవసరాల కోసం సబ్‌మిట్ చేసిన కాపీని సేవ్ చేసుకోండి.

ముఖ్యమైన లింక్స్

  1. IBPS PO ఆన్లైన్ అప్లై చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి
  2. IBPS SO ఆన్లైన్ అప్లై చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి
  3. అధికారిక వెబ్సైటు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

Job Alerts

మీ వాట్స్ అప్ నెంబర్ కె జాబ్ అలర్ట్స్ రావాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

Date

Item Name

Details

07/07/2023 ఉద్యోగ సమాచారం Get Details
23/07/2023 ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసారా.. చేయకపోతే చేసుకొండి Get Details
23/07/2023 ధరఖాస్తు చివరితేదీ పొడిగింపు Get Details
17/07/2023 వ్రాత పరీక్ష తేదీ Get Details
23/07/2023 అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్ Get Details
15/07/2023 ఆన్సర్ కీ Get Details
01/07/2023 ఫలితాలు Get Details
11/07/2023 ఫైనల్ రిసల్ట్ | తుది ఫలితం Get Details
15/07/2023 డాక్యుమెంట్ వెరిఫికేషన్ Get Details
15/07/2023 ఎంపిక జాబితా Get Details
01/07/2023 TSPSC గ్రూప్ 4, పేపర్ 1 Get Details
07/04/2023 జనరల్ అవేర్నెస్ Get Details
07/04/2023 క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ Get Details
07/04/2023 రీజనింగ్ Get Details
07/04/2023 కరెంటు అఫైర్స్ Get Details
టెలిగ్రామ్ లో జాబ్ అలర్ట్స్ రావాలంటే టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి

No comments:

Post a Comment

Job Alerts and Study Materials