ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్. కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 5000 ఖాళీలను భార్తీ చేయనున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లో ఉద్యోగం సంపాందించాలని కలలు కనే ఆశావాహులకు ఇది శుభవార్త అనే చెప్పాలి. ఎఫ్‌సీఐ తమ సంస్థలోని వివిధ విభాగాల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు భారీ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. మొత్తంగా 5000 పోస్టులకు సంబంధించి నియమకాల ప్రక్రియను చేపెట్టేందుకు సిద్ధమైంది ఎఫ్‌సీఐ. నోటిఫికేషన్లో పేర్కొన్న ఖాళీ పోస్టుల వివరాల్లోకి వెళ్తే.. వాచ్మెన్, అసిస్టెంట్ జనరల్ మేనేజర్, మేనేజర్, జూనియర్ ఇంజినీర్, టైపిస్ట్, కేటగిరీ-III సహా ఇతర పోస్టులు ఉన్నాయి. వీటికి దరఖాస్తు చేయాలంటే.. డిగ్రీ, డిప్లొమా, బీటెక్/ఇంజినీరింగ్, 8వ తరగతి(వాచ్మెన్ పోస్టుకు) పూర్తి చేసి ఉండాలి. అభ్యర్థుల యొక్క 25 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఎటువంటి దరఖాస్తు ఫీజు లేదు. ఇతరులు రూ.250 చెల్లించాలి. నోటిఫికేషన్‌కు సంబంధించిన ముఖ్యమైన తేదీలైన దరఖాస్తు ప్రారంభ తేదీతో పాటు చివరితేదీల వివరాలను త్వరలోనే అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచనున్నారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో పోస్టింగ్‌లు కల్పిస్తారు. ఎంపికైన వారికి నెలకు రూ.10,000 నుంచి రూ.30,000 చెల్లిస్తారు. రాతపరీక్ష, ఇంటర్వ్యూలు, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. వివిధ పోస్టులను అనుసరించి ఎంపిక ప్రక్రియలో మార్పులు ఉండవచ్చు. వివిధ పోస్టులకు సంబంధించిన సిలబస్, వయోపరిమితి సడలింపులు తదితర వివరాల కోసం సంస్థ అధికారిక వెబ్సైట్ www.fci.gov.in ను వీక్షించవచ్చు.
ముఖ్యమైన లింక్స్
- అధికారిక వెబ్సైటు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

No comments:
Post a Comment