భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. పలు ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు తాజాగా నోటిఫికేషన్ (ISRO Job Notification) విడుదల చేసింది. టెక్నీషియన్ 'బి'/డ్రాఫ్ట్స్‌మెన్ 'బి' పోస్టుల కోసం ఈ దరఖాస్తు ప్రక్రియ సాగుతోంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే ఆసక్తిగల అభ్యర్థులు మరియు అర్హతగల అభ్యర్థులు ISRO అధికారిక వెబ్‌సైట్ isro.gov.in ని సందర్శించడం ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించడానికి చివరి తేదీ ఆగస్టు 21. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 35 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఇందులో 34 ఖాళీలు టెక్నీషియన్ 'బి', ఒక ఖాళీ డ్రాఫ్ట్స్‌మన్ 'బి' పోస్టుకు సంబంధించింది. టెన్త్ తో పాటు సంబంధిత ట్రేడ్ లో ఐటీఐ విద్యార్హత కలిగిన వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయోపరిమితి 18 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి. అభ్యర్థులు ఇతర పూర్తి వివరాలను నోటిఫికేషన్లో చూడొచ్చు.
ముఖ్యమైన లింక్స్
- ఆన్లైన్ అప్లై చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి
- నోటిఫికేషన్ ను డౌన్లోడ్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి
- అధికారిక వెబ్సైటు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

No comments:
Post a Comment