ఆంధ్రప్రదేశ్ లో 411 ఎస్ఐ ఉద్యోగాలకు (AP SI Jobs) సంబంధించిన నియామక ప్రక్రియ కొనసాగుతోన్న విషయం తెలిసిందే. ఈ నోటిఫికేషన్ కు సంబంధించి మొత్తం 1,51,288 మంది అభ్యర్థులు అప్లై చేసుకోగా.. 57,923 మంది దేహదారుఢ్య పరీక్షలకు అర్హత సాధించారు. వీరిలో 49,386 మంది పురుషులు, మరో 8537 మంది మహిళలు ఉన్నారు. అయితే.. ఈ ఫిజికల్ ఈవెంట్స్ కు సంబంధించిన షెడ్యూల్ ను ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ (APSLPRB) తాజాగా విడుదల చేసింది. ప్రిలిమినరీ రాత పరీక్షలో అర్హత సాధించిన వారికి ఆగస్టు 25 నుంచి ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్ (పీఎంటీ), ఫిజికల్ ఎఫీషియన్సీ టెస్ట్(పీఈటీ) నిర్వహించనున్నట్లు బోర్డు ప్రకటనలో పేర్కొంది. విశాఖపట్నం, గుంటూరు, కర్నూలు, ఏలూరులలో ఈ ఈవెంట్స్‌ను నిర్వహించనున్నట్లు ప్రకటించింది బోర్డు. ఆగస్టు 25వ తేదీ నుంచి ఆయా సెంటర్లలో ఫిజికల్ ఈవెంట్స్ నిర్వహించనున్నట్లు తెలిపింది. ఆగస్టు 14 నుంచి పీఎంటీ/ పీఈటీ పరీక్షలకు సంబంధించిన కాల్ లెటర్లు అధికారిక వెబ్‌సైట్ లో (https://slprb.ap.gov.in/) అందుబాటులో ఉంటాయని బోర్డు తెలిపింది. అభ్యర్థులంతా ఆ తేదీ నుంచి తమ కాల్ లెటర్లను డౌన్‌లోడ్ చేసుకోవాలని తెలిపింది. ఇంకా.. ఈవెంట్స్‌కు హాజరయ్యే అభ్యర్థులంతా తమ వెంట తప్పనిసరిగా స్టేజ్ 2 అప్లికేషన్ ఫాం తెచ్చుకోవాలని బోర్డు తెలిపింది. మొత్తం 411 సబ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ (సివిల్) పోస్టులకు (పురుషులు, మహిళలు), రిజర్వ్ సబ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ (పురుషులు) పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల కాగా.. ఈ ఏడాది ఫిబ్రవరి 19న ఎస్సై ఉద్యోగాలకు ప్రిలిమినరీ రాత పరీక్షను నిర్వహించింది ఏపీ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు. ఫిజికల్ ఈవెంట్స్ ముగిసిన తర్వాత మెయిన్స్ ఎగ్జామ్ ను నిర్వహించనున్నారు. అనంతరం ఎంపికైన అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తారు.
ముఖ్యమైన లింక్స్
- అధికారిక వెబ్సైటు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

No comments:
Post a Comment