మజాగాన్ డాక్‌లో పదో తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థుల కోసం 531 పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభం అయింది. మీరు 10వ తరగతి ఉత్తీర్ణులై సంబంధిత రంగంలో ITI డిప్లొమా కలిగి ఉన్నారా.. అయితే మజాగాన్ డాక్‌లో ఈ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఆగస్టు 12 నుండి దరఖాస్తులు స్వీకరించబడుతున్నాయి. ఈ పోస్ట్‌లకు దరఖాస్తు చేయడానికి చివరి తేదీ 21 ఆగస్టు 2023గా నోటిఫికేషన్లో పేర్కొన్నారు. చివరి తేదీ కంటే ముందు సూచించిన ఫార్మాట్‌లో ఫారమ్‌ను పూరించండి. దీన్ని చేయడానికి.. మీరు Mazagon Dock Shipbuilders Limited యొక్క అధికారిక వెబ్‌సైట్‌ను mazagondock.in సందర్శించాలి. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా మొత్తం 531 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులు నాన్ ఎగ్జిక్యూటివ్‌లకు చెందినవి. ఈ పోస్టులు కాంట్రాక్ట్ విధానంలో భర్తీ చేయనున్నారు. మూడు సంవత్సరాల కాలపరిమితితో నియామకాలు చేపడుతున్నారు. ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా స్కిల్డ్ వన్, సెమీ స్కిల్డ్, స్పెషల్ గ్రేడ్ వంటి అనేక పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేయడానికి అభ్యర్థి గుర్తింపు పొందిన బోర్డు నుండి 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండి.. ITI డిప్లొమా కూడా కలిగి ఉండాలి. ఈ పోస్టులకు వయోపరిమితి 18 నుండి 38 సంవత్సరాల వరకు ఉండాలి. రిజర్డ్ కేటగిరీ అభ్యర్థులకు వయోపరిమితిలో సండలింపు ఉంటుంది. ఈ పోస్టులకు అభ్యర్థుల ఎంపిక రాత పరీక్ష ద్వారా జరుగుతుంది. ఆ తేదీని తర్వాత ప్రకటిస్తారు. దీని తర్వాత అభ్యర్థులను వారి అనుభవం ఆధారంగా ఎంపిక చేస్తారు. మూడో దశలో ట్రేడ్ టెస్ట్ లేదా స్కిల్ టెస్ట్ నిర్వహించి చివరిగా మెడికల్ ఎగ్జామినేషన్ నిర్వహిస్తారు. ఎంపికైన అభ్యర్థులకు జీతం పోస్టులను అనుసరించి ఉంటుంది. ఉదాహరణకు.. స్పెషల్ గ్రేడ్ (IDA - IX) కోసం జీతం రూ. 22, 000 నుండి రూ. 83, 180 వరకు ఉంటుంది. స్పెషల్ గ్రేడ్ (IDA - VIII)విభాగానికి జీతం రూ. 21,000 నుండి రూ. 79,380 వరకు ఉంటుంది. అదేవిధంగా ఒక్కో పోస్టుకు వేతనం.. మిగిలిన కేటగిరీలకు రూ.50 వేల వరకు ఉంటుంది.
ముఖ్యమైన లింక్స్
- అధికారిక వెబ్సైటు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

No comments:
Post a Comment