భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (BDL) పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా పలు విభాగాల్లో ఖాళీ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తుల ప్రక్రియ ఆగస్టు 21 నుంచి ప్రారంభం అయ్యాయి. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు ఈ పోస్టులకు అధికారిక సైట్ bdl-india.in ను సందర్శించి ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది. దరఖాస్తులకు నెల రోజుల సమయం ఇచ్చారు. సెప్టెంబర్ 20వ తేదీన దరఖాస్తుల ప్రక్రియ ముగియనుంది. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా మొత్తం 45 పోస్టులను భర్తీ చేస్తారు. ఇందులో మేనేజ్‌మెంట్ ట్రైనీ , వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టులు ఉన్నాయి. ఎలక్ట్రానిక్స్, మెకానికల్, కంప్యూటర్ సైన్స్, ఫైనాన్స్ తదితర విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ఈ పోస్టులకు అభ్యర్థుల ఎంపిక కోసం రాత పరీక్ష, ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. పరీక్ష రెండు గంటల వ్యవధిలో ఉంటుంది. 150 మల్టిపుల్ చాయిస్ ప్రశ్నల రెండు భాగాలను కలిగి ఉంటుంది. పార్ట్-I సంబంధిత సబ్జెక్ట్/టాపిక్‌పై 100 మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలను కలిగి ఉంటుంది. ఈ భాగంలో జనరల్ ఆప్టిట్యూడ్‌పై 50 ప్రశ్నలు ఉంటాయి. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ కోసం.. అభ్యర్థులు దరఖాస్తు ఫీజును చెల్లించాలి. అభ్యర్థులు రూ.500 అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. SC/ST/PWBD/మాజీ సైనికులు/అంతర్గత శాశ్వత ఉద్యోగులు దరఖాస్తు ఫీజు చెల్లింపు నుండి మినహాయించబడ్డారు. అభ్యర్థులు SBI ఇ-పే కార్డ్/క్రెడిట్ కార్డ్/నెట్ బ్యాంకింగ్/UPI మొదలైన వాటి ద్వారా ఫీజు చెల్లించవచ్చు. మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ సహాయం తీసుకోవచ్చు. రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు ప్రక్రియ 21 ఆగస్టు 2023 న ప్రారంభం కాగా.. దరఖాస్తు ప్రక్రియ ముగిసే తేదీ 20 సెప్టెంబర్ 2023గా నిర్ణయించారు.
ముఖ్యమైన లింక్స్
- ఆన్లైన్ అప్లై చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి
- నోటిఫికేషన్ ను డౌన్లోడ్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి
- అధికారిక వెబ్సైటు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

No comments:
Post a Comment