Mother Tongue

Read it Mother Tongue

Saturday, 26 August 2023

డీఎస్సీ నోటిఫికేషన్ కు రంగం సిద్ధం.. విడుదల ఎప్పుడంటే..



 తెలంగాణలో టీచర్ ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. ఇటీవల విద్యాశాఖ మంత్రి ప్రకటన మేరకు అనుమతులు మంజూరు చేస్తూ ఆర్థిక శాఖ నుంచి నిన్న ఉత్తర్వులు జారీ అయ్యాయి. మంత్రి ప్రకటన మేరకు నిన్న ప్రభుత్వం అనుమతులు సైతం మంజూరు చేసింది. మొత్తం ఉపాధ్యాయుల పోస్టుల్లో 2,575 ఎస్‌జీటీ, 1739 స్కూల్‌ అసిస్టెంట్‌ ఖాళీలు ఉన్నట్లు ప్రభుత్వం పేర్కొంది. ఇంకా 611 భాషా పండితులు, 164 పీఈటీ పోస్టులు ఉన్నట్లు ప్రకటనలో పేర్కొంది. ఇంకా జిల్లాల వారీగా ఖాళీల వివరాలను సైతం ప్రభుత్వం విడుదల చేసింది. పాఠశాల విద్యాశాఖలో 5,089 ఖాళీలు ఉండగా.. ప్రత్యేక విద్యార్థుల పాఠశాలల్లో 1523 స్పెషల్ టీచర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు స్పెషల్ బీఈడీ పూర్తి చేసిన వారు అర్హలు. జిల్లాల వారీగా ఖాళీ పోస్టులు  ఆదిలాబాద్ - 275, ఆసిఫాబాద్ -289, భద్రాద్రి కొత్తగూడెం- 185, హనుమకొండ -54, హైదరాబాద్ -358, జగిత్యాల-14, జనగాం- 76, జయశంకర్ భూపాలపల్లి- 74,  జోగులాంబ- 146, కామారెడ్డి - 200, కరీంనగర్ - 99, ఖమ్మం - 195, మహబూబాబాద్ - 125, మహబూబ్ నగర్- 96, మంచిర్యాల - 113, మెదక్ - 147, మేడ్చల్- 78, ములుగు - 65, నాగర్ కర్నూల్ - 114, నల్గొండ - 219, నారాయణపేట - 154, నిర్మల్ - 115, నిజామాబాద్ - 309, పెద్దపల్లి - 43, రాజన్న సిరిసిల్ల - 103, రంగారెడ్డి - 196, సంగారెడ్డి - 283, సిద్దిపేట -141, సూర్యాపేట - 185, వికారాబాద్ -191, వనపర్తి - 76, వరంగల్ - 99, యాదాద్రి- 99. ఇందులో అత్యధికంగా హైదరాబాద్​ జిల్లాలో 358 నిజామాబాద్​ జిల్లాలో 309 ఖాళీలున్నాయి. పెద్దపల్లి జిల్లాలో అతి తక్కువగా 43, హన్మకొండలో 53 ఖాళీలు మాత్రమే ఉన్నాయి. దాదాపు 20 వేలకు పైగా టీచర్ ఉద్యోగాలు ఉంటాయని భావించిన నిరుద్యోగులు కేవలం 5 వేల ఖాళీలు మాత్రమే ఉండడంతో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా..టెట్ కు సంబంధించి దరఖాస్తుల ప్రక్రియ ముగిసింది. ఇక సెప్టెంబర్ 15వ తేదీన పరీక్షలు కూడా నిర్వహించనున్నారు. ఈ పరీక్షలో భాగంగా రెండు పేపర్లు ఉంటాయి. అందులో పేపర్‌-1 సెకండరీ గ్రేడ్‌ టీచర్లుగా నియామకానికి, పేపర్‌-2 స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టుల కోసం అర్హత సాధించేందుకు నిర్వహిస్తారు. ఒక్కో పేపర్‌ 150 మార్కులకు ఉంటుంది. పేపర్‌-1కు 1-8 తరగతులు, పేపర్‌-2కు 6-10 తరగతుల ప్రామాణికంగా ప్రశ్నలు ఉంటాయి. తుది ఫలితాలను సెప్టెంబర్‌ 27న విడుదల చేస్తారు. సెప్టెంబర్ 15న నిర్వహించే టెట్ పేపర్ 1 పరీక్షనను ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు, పేపర్ -2 ను మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 వరకు నిర్వహిస్తారు. ఈ పరీక్ష ఫలితాల తర్వాతనే డీఎస్సీ పూర్తి నోటిఫికేషన్ విడుదల కానుంది.

1 comment:

  1. Ttc చదివి 7,000 లకు ప్రవైట్స్ స్కూల్ లో టీచ్ చేయలేక కులి పనికి పోయే వాళ్ళం ఉన్నాం
    జాబ్స్ వేకేన్సీ లేనప్పుడు cource తీసేయడం మేలు

    ReplyDelete

Job Alerts and Study Materials