స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) ఆధ్వర్యంలో జరిగే పోటీ పరీక్షలను ఇకపై 13 ప్రాంతీయ భాషల్లో నిర్వహించనున్నారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుందని కేంద్రమంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు పోటీ ఎక్కువగా ఉంటుంది. ఏటా లక్షలాది మంది అభ్యర్థులు వివిధ రిక్రూట్‌మెంట్ ఏజెన్సీలు నిర్వహించే పోటీ పరీక్షలకు హాజరవుతుంటారు. అయితే జాతీయ స్థాయిలో జరిగే కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌ను కేవలం హిందీ, ఇంగ్లిష్‌లో మాత్రమే నిర్వహిస్తున్నారు. దీంతో తమిళం, తెలుగు, మలయాళం వంటి ప్రాంతీయ భాషలకు చెందిన అభ్యర్థులు లాంగ్వేజ్ విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యపై కేంద్ర ప్రభుత్వం తాజాగా దృష్టిసారించింది. భాషా సమస్య కారణంగా యువత ఉద్యోగావకాశాలను కోల్పోకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) ఆధ్వర్యంలో జరిగే పోటీ పరీక్షలను ఇకపై ఇంగ్లీష్, హిందీతో పాటు 13 ప్రాంతీయ భాషల్లో నిర్వహించనున్నారు. అంటే మొత్తం 15 లాంగ్వేజెస్‌లో ప్రశ్నపత్రాలు అందుబాటులో ఉంటాయి. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుందని కేంద్రమంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు.
ప్రాంతీయ భాషలకు పెద్దపీట
మినిస్ట్రీ ఆఫ్ పర్సోనెల్ పబ్లిక్ గ్రివెన్సెస్ అండ్ పెన్షన్స్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్వంలో బుధవారం 14వ హిందీ కన్సల్టేటివ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కేంద్రమంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ.. హిందీతో పాటు భారతీయ ప్రాంతీయ భాషలను ప్రోత్సహించడానికి ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. యువత ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని SSC పోటీ పరీక్షలను 13 ప్రాంతీయ భాషల్లో నిర్వహిస్తామని తెలిపారు. ఈ చరిత్రాత్మక నిర్ణయం యువత భాగస్వామ్యానికి ప్రేరణనిస్తుందన్నారు.
ఏయే భాషల్లో అంటే?
13 ప్రాంతీయ భాషల జాబితాలో అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, మరాఠీ, మలయాళం, కన్నడ, తమిళం, తెలుగు, ఒడియా, ఉర్దూ, పంజాబీ, మణిపురి (మీతీ), కొంకణి ఉన్నాయి. అంటే ఇకపై SSC పరీక్షలు ఇంగ్లిష్, హిందీతో పాటు ఈ 13 భాషల్లో నిర్వహించనున్నారు.
ఎన్నో ఏళ్ల డిమాండ్
గత కొన్నేళ్ల నుంచి తమిళనాడుతో పాటు ఇతర రాష్ట్రాలు ఎస్‌ఎస్‌సీ పరీక్షలను ప్రాంతీయ భాషల్లో నిర్వహించాలని డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ అంశంపై పరిశీలించేందుకు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఓ కమిటీని ఏర్పాటు చేసింది. కేంద్ర ప్రభుత్వం తాజాగా తీసుకున్న ఈ నిర్ణయంతో పోటీ పరీక్షలకు సన్నద్ధం అవుతున్న లక్షలాది ప్రాంతీయ భాషల అభ్యర్థులకు ప్రయోజనం ఉంటుందని, వారి ఎంపిక అవకాశాలు మెరుగుపడతాయని నిపుణులు పేర్కొంటున్నారు.
భవిష్యత్‌లో 22 షెడ్యూల్డ్ భాషల్లో
అభ్యర్థులు పోటీ పరీక్షలను 15 భాషల్లో రాయడానికి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఇటీవలే ఫార్మాట్‌ను ఆవిష్కరించిందని కేంద్రమంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. రాబోయే రోజుల్లో మొత్తంగా 22 షెడ్యూల్డ్ భాషల్లో రాత పరీక్షలను నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని, ఇప్పటికే జేఈఈ , నీట్ , యూజీసీ పరీక్షలు 12 ప్రాంతీయ భాషల్లో నిర్వహిస్తున్న విషయాన్ని కేంద్రమంత్రి ఈ సందర్భంగా ప్రస్తావించారు.
హిందీ మీడియంలో ఎంబీబీఎస్
ఎంబీబీఎస్, ఇంజనీరింగ్ వంటి హయ్యర్ ఎడ్యుకేషన్‌ను ప్రాంతీయ భాషల్లో అందుబాటులోకి వచ్చేలా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే చర్యలు ప్రారంభించింది. ఇందుకోసం కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ ప్రత్యేక చొరవ తీసుకుంది. గతేడాది అక్టోబర్‌లో భోపాల్‌లో ఎంబీబీఎస్ కోర్సును హిందీ లాంగ్వేజ్‌లో మొదట ప్రారంభించారు. ఆ తరువాత ఉత్తరాఖండ్‌లోనూ ప్రారంభించారు. కాగా, అధికారిక భాషా నిబంధనలు-1976 అనుసరించి కేంద్ర ప్రభుత్వం ప్రాంతీయ భాషలకు ప్రాధాన్యత కల్పిస్తోంది.
Job Alerts |
---|
మీ వాట్స్ అప్ నెంబర్ కె జాబ్ అలర్ట్స్ రావాలంటే ఇక్కడ క్లిక్ చేయండి |
Date |
Item Name |
Details |
---|---|---|
07/07/2023 | ఉద్యోగ సమాచారం | Get Details |
23/07/2023 | ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసారా.. చేయకపోతే చేసుకొండి | Get Details |
23/07/2023 | ధరఖాస్తు చివరితేదీ పొడిగింపు | Get Details |
17/07/2023 | వ్రాత పరీక్ష తేదీ | Get Details |
23/07/2023 | అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్ | Get Details |
15/07/2023 | ఆన్సర్ కీ | Get Details |
01/07/2023 | ఫలితాలు | Get Details |
11/07/2023 | ఫైనల్ రిసల్ట్ | తుది ఫలితం | Get Details |
15/07/2023 | డాక్యుమెంట్ వెరిఫికేషన్ | Get Details |
15/07/2023 | ఎంపిక జాబితా | Get Details |
01/07/2023 | TSPSC గ్రూప్ 4, పేపర్ 1 | Get Details |
07/04/2023 | జనరల్ అవేర్నెస్ | Get Details |
07/04/2023 | క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ | Get Details |
07/04/2023 | రీజనింగ్ | Get Details |
07/04/2023 | కరెంటు అఫైర్స్ | Get Details |
టెలిగ్రామ్ లో జాబ్ అలర్ట్స్ రావాలంటే టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి |
No comments:
Post a Comment