స్టాఫ్ సెలక్షన్ కమీషన్ (SSC) జూనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్, జూనియర్ ట్రాన్స్‌లేటర్, సీనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్ మరియు హిందీ ప్రధ్యాపక్ ఎగ్జామ్ 2023 రిక్రూట్‌మెంట్ కోసం నోటిఫికేషన్‌ను ప్రకటించింది. ఖాళీ వివరాలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు మరియు అన్ని అర్హత ప్రమాణాలను పూర్తి చేసిన అభ్యర్థులు నోటిఫికేషన్‌ను చదివి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
ఖాళీల వివరాలు, జూనియర్ ట్రాన్స్లాటర్ లో 263, జూనియర్ హిందీ ట్రాన్స్లాటర్ లో 21, జూనియర్ ట్రాన్సలేషన్ ఆఫీసర్ 13, SHT & ST లో 10. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి డిప్లొమా & మాస్టర్స్ డిగ్రీ కలిగి ఉండాలి. ఈ పాటికే అప్లికేషన్స్ ప్రారంభం అయ్యాయి. అప్లికేషన్ కు చివరి తేదీ సెప్టెంబర్ 12, 2023 రాత్రి 23:00 గంటలవరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు రుసుము రూ . 100/- మహిళలకు , ఎస్సి, ఎస్టీ, దివ్యంగులకు దరఖాస్తు రుసుము మినహాయింపు (ఫీజు లేదు). ఆన్లైన్ లో క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు మరియు నెట్బ్యాంకింగ్ ద్వారా దరఖాస్తు రుసుము చెల్లించొచ్చు, ఆఫ్ లైన్ లో SBI బ్యాంకు చాలను ద్వారా చెల్లించొచ్చు. కనిష్ట మరియు గరిష్ట వయసులు వరుసగా 18 మరియు 30 సంవత్సరాలు. నిబంధనల ప్రకారం SC/ST/OBC/ PH/ ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు వయో సడలింపు అనుమతించబడుతుంది. “దరఖాస్తు ఫారమ్ దిద్దుబాటు కోసం విండో” మరియు దిద్దుబాటు ఛార్జీల ఆన్‌లైన్ చెల్లింపు తేదీ సెప్టెంబర్ 13, 2023 నుండి సెప్టెంబర్ 14, 2023 వరకు ఉంటుంది. ఆన్‌లైన్ ఫీజు చెల్లింపుకు చివరి తేదీ సెప్టెంబర్ 12, 2023. అక్టోబర్ 2023 లో కంప్యూటర్ బేస్డ్ ఎక్సమినేషన్ ఉండొచ్చు. ఆన్లైన్ లో అప్లికేషన్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి. నోటిఫికేషన్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి. అధికారిక వెబ్సైటు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.
No comments:
Post a Comment