నార్త్ వెస్ట్రన్ రైల్వే, జైపూర్ అసిస్టెంట్ లోకో పైలట్‌తో సహా వివిధ పోస్టుల భర్తీ కొరకు నోటిఫికేషన్ జారీ చేసింది. దీనికి కే 10వ తరగతి ఉత్తీర్ణత సాధించాలి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ఈ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు RRC జైపూర్ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా దరఖాస్తులను సమర్పించవచ్చు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ జరుగుతోంది. ఈ పోస్టులకు ఆగస్టు 3 నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. దరఖాస్తు చేయడానికి చివరి తేదీ 2 సెప్టెంబర్ 2023గా నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. ఈ రిక్రూట్‌మెంట్‌ల ప్రత్యేకత ఏమిటంటే.. నార్త్ వెస్ట్ రైల్వేలోని శాశ్వత ఉద్యోగులు మాత్రమే వీటికి దరఖాస్తు చేసుకోవచ్చు. వీరి ఎంపిక రాత పరీక్షల ద్వారా ఉంటుంది. ఈ ఖాళీల కోసం దరఖాస్తులను ఆన్‌లైన్‌లో మాత్రమే చేయవచ్చు. దీని కోసం మీరు RRC జైపూర్ అధికారిక వెబ్‌సైట్‌ను rrcjaipur.in సందర్శించాలి. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా మొత్తం 312 పోస్టులను భర్తీ చేస్తారు. పోస్టుల వివరాల్లోకి వెళ్తే.. ALP/ టెక్నీషియన్ పోస్టులు – 209, టెక్నీషియన్ – III – 16 పోస్టులు, జూనియర్ ఇంజనీర్ - 44 పోస్టులు, గార్డ్/ట్రైన్ మేనేజర్ - 46 పోస్టులు ఉన్నాయి. రైల్వే స్టేషన్ మాస్టర్ ఉద్యోగం కీలకమైన హోదా. ఒక స్టేషన్ మాస్టర్‌కు వివిధ అలవెన్సులు కూడా ఉంటాయి. భారతీయ రైల్వే స్టేషన్ మాస్టర్‌లు వారి నెలవారీ జీతంతో పాటు అలవెన్సులు అదనంగా ఉంటాయి. నైట్ డ్యూటీ అలవెన్స్- నెలకు రూ. 2700, ఓవర్ టైం అలవెన్స్ (OTA), ప్రయాణ భత్యం, ఇతర అలవెన్సులు లభిస్తాయి.
ఉద్యోగ ఖాళీలు 312
- ALP/ టెక్నీషియన్ పోస్టులు – 209
- టెక్నీషియన్ – III – 16 పోస్టులు
- జూనియర్ ఇంజనీర్ - 44 పోస్టులు
- గార్డ్/ట్రైన్ మేనేజర్ - 46 పోస్టులు
ముఖ్యమైన తేదీలు
- ఆగస్ 03, 2023 నుంచి ఈ పోస్టులకు దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం అయింది
- సెప్టెంబర్ 02, 2023 వరకు దరఖాస్తులను స్వీకరించనున్నారు
విద్యార్హత
- గుర్తింపు పొందిన బోర్డు నుంచి పదో తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. దీనితో పాటు సంబంధిత విభాగంలో ఐటీఐ లేదా డిప్లొమా లేదా డిగ్రీ కూడా కలిగి ఉండాలి. వయోపరిమితి విషయానికొస్తే.. 18 నుంచి 42 ఏళ్లుగా నిర్ణయించారు. రిజర్వ్‌డ్ కేటగిరీ నిబంధనల ప్రకారం వయో సడలింపు ఉంటుంది.
ముఖ్యమైన లింక్స్
- రిజిస్ట్రేషన్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి | లాగిన్ అవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
- నోటిఫికేషన్ ను డౌన్లోడ్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి
- అధికారిక వెబ్సైటు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

No comments:
Post a Comment