ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ (APSLPRB) తాజాగా కీలక ప్రకటన చేసింది. ప్రస్తుతం జరుగుతున్న SI, RSI ఉద్యోగ నియామకాలకు (AP Police Jobs) సంబంధించిన తుది పరీక్షల తేదీలను ప్రకటించింది. అక్టోబర్ 14, 15 తేదీల్లో ఈ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపింది.ఇంకా ప్రస్తుతం జరుగుతున్న PMT/PET పరీక్షలు సెప్టెంబర్ 25 నాటికి పూర్తవుతాయని పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు తెలిపింది. తుది రాత పరీక్షల కేంద్రాలు విశాఖపట్నం, ఏలూరు, గుంటూరు, కర్నూలులో ఉంటాయని పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ప్రకటనలో పేర్కొంది. ఆంధ్రప్రదేశ్ లో 411 ఎస్ఐ ఉద్యోగాలకు (AP SI Jobs) సంబంధించిన నియామక ప్రక్రియ కొనసాగుతోన్న విషయం తెలిసిందే. ఈ నోటిఫికేషన్ కు సంబంధించి మొత్తం 1,51,288 మంది అభ్యర్థులు అప్లై చేసుకోగా.. 57,923 మంది దేహదారుఢ్య పరీక్షలకు అర్హత సాధించారు. వీరిలో 49,386 మంది పురుషులు, మరో 8537 మంది మహిళలు ఉన్నారు. అయితే.. ఆగస్టు 25 నుంచి ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్ (పీఎంటీ), ఫిజికల్ ఎఫీషియన్సీ టెస్ట్(పీఈటీ) లను నిర్వహిస్తున్నారు.
ముఖ్యమైన లింక్స్
- ప్రెస్ రిలీజ్ డౌన్లోడ్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి
No comments:
Post a Comment