తెలంగాణలో గురుకుల పరీక్షలను ఆగస్టు 01వ తేదీ నుంచి ఆగస్టు 23వ తేదీ వరకు నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే వీటి పరీక్షలకు సంబంధించి రెస్పాన్స్ షీట్స్ ను ఆగస్టు 23వ తేదీన విడుదల చేశారు. ఆగస్టు 03 నుంచి ఆగస్టు 19 వరకు నిర్వహించిన వివిధ విభాగాల పరీక్షలకు సంబంధించి అబ్జెక్షన్స్ కు చివరి తేదీ ఆగస్టు 25తో ముగిసింది. ఆగస్టు 21 నుంచి ఆగస్టు 23వరకు నిర్వహించిన పరీక్షలకు సంబంధించి కీని ఆగస్టు 24న విడుదల చేయగా.. వీటి అబ్జెక్షన్స్ కు ఆగస్టు 26వరకు అవకాశం కల్పించారు. ఇదిలా ఉండగా.. అత్యంత వేగంగా గురుకుల పరీక్షలకు సంబంధించి ఫలితాలను విడుదల చేసేందుకు బోర్డు సన్నాహాలు చేస్తోంది. తొలిసారిగా ఆన్లైన్ పద్ధతిలో అర్హత పరీక్ష లను కేవలం మూడు వారాల వ్యవధిలో నిర్వహిం చి రికార్డు సృష్టించిన తెలంగాణ గురుకుల విద్యా సంస్థల నియామకాల బోర్డు (టీఆర్ ఈఐఆర్బీ). చివరి పరీక్ష రోజునే ప్రాథమిక కీలను విడుదల చేసింది. తాజాగా 'ఫైనల్ కీ' తయారీలో గురుకుల బోర్డు నిమగ్నమైంది. దాదాపు 56 కేటగిరీలకు సంబంధించి 19 రోజుల పాటు రోజుకు మూడు సెషన్లలో పరీక్షలు నిర్వహించిన టీఆర్టీఐఆలీ.. ప్రాథమిక కీలను విడుదల చేసి అభ్యంతరాలను కూడా ఆన్లైన్ పద్ధతిలో స్వీకరించింది. శనివారంతో అభ్యంతరాల స్వీకరణ గడువు ముగిసింది. ఆన్లైన్లో వచ్చిన అభ్యంతరాలను పరిశీలించేందుకు బోర్డు ప్రత్యేకంగా నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ అభ్యర్థుల అభ్యంతరాలను తగిన ఆధారాలతో పరిశీలించి నిర్ణయం తీసుకుంటుంది. రెండ్రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తవుతుందని నిపుణుల కమిటీ సూచనలకు అనుగుణంగా ఫైనల్ కీలను తయారుచేసి వెబ్సైట్లో అందుబాటులో ఉంచేందుకు టీఆర్ ఈఐఆర్బీ కసరత్తు వేగవంతం చేసింది. ఈనెలాఖరులోగా ఈ ప్రక్రియను పూర్తి చేసేలా గురుకుల బోర్డు కసరత్తు చేస్తోంది. సెప్టెంబర్ మొదటి వారంలో ఫలితాలను విడుదల చేయనున్నారు. తెలంగాణలోని అన్ని గురుకుల విద్యాలయాల్లో ఖాళీ పోస్టుల భర్తీకి సంబంధించి కంప్యూటర్ ఆధారిత పరీక్ష(సీబీటీ)లు ఆగస్టు 01వ తేదీ నుంచి 23వ తేదీ వరకు పోస్టులవారీగా పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఆర్ట్, క్రాఫ్ట్, మ్యూజిక్ టీచర్ పోస్టులకు సంబంధించిన అభ్యర్థులతో పరీక్షలు ప్రారంభం కాగా.. అనంతరం టీజీటీ, పీజీ టీ, డీఎల్, జేఎల్ పోస్టులకు సంబంధించిన అభ్యర్థులకు సబ్జెక్టులవారీగా పరీక్షలను నిర్వహించారు. ఎ స్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీ గురుకులాల్లో కలిపి 9 క్యాటగిరీల్లో పీజీటీ- 1,276, టీజీటీ-4,020, జూనియర్ లెక్చరర్, డిగ్రీ లెక్చరర్, ఫిజికల్ డైరెక్టర్ -2,876, టీజీటీ, స్కూల్ లైబ్రేరియన్- 434, స్కూల్ ఫిజికల్ డైరెక్టర్ -275, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్-226, మ్యూజిక్ టీచర్ -124 పోస్టులు మొత్తంగా 9,210 పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించగా.. ట్రిబ్ ఈ నియామక ప్రక్రియను చేపట్టింది. అన్ని పోస్టులకు కలిపి 2,63,045 దరఖాస్తులు వచ్చాయని ట్రిబ్ ఇప్పటికే వెల్లడించింది. పోస్టుల్లో అత్యధికంగా మహిళలకే కేటాయించారు.
No comments:
Post a Comment