ISRO Exam Cancelled: అరెస్టయిన అభ్యర్థులు మొబైల్ ఫోన్ కెమెరాలను ఉపయోగించి ప్రశ్నల చిత్రాలను తీసి బయటి వారికి పంపుతున్నారని.. వారు చెవుల్లో బ్లూటూత్ పరికరం ద్వారా సమాధానాలు పంపించారని పోలీసులు తెలిపారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ISRO) నిర్వహించిన రిక్రూట్‌మెంట్ ఎగ్జామ్‌లో 'మున్నా భాయ్' తరహాలో కాపీ కొట్టిన ఇద్దరు అభ్యర్థులను అరెస్ట్ చేశారు. హర్యానాకు చెందిన ఇద్దరు అభ్యర్థులు విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ (VSSC)లో టెక్నికల్ స్టాఫ్ రిక్రూట్‌మెంట్ పరీక్షలో కాపీ కొట్టారు. వేరొకరికి బదులుగా మరొకరు పరీక్షలు రాస్తూ మోసగించారనే ఆరోపణలపై హరియాణాకు చెందిన ఇద్దరిని పోలీసులు సోమ వారం అరెస్టు చేశారు. అరెస్టు చేసిన ఇద్దరిపై చీటింగ్ కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. హరియాణా నుంచే 400 మంది అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరుకావడంతో కోచింగ్ కేంద్రాల పాత్రపైనా అనుమానాలు వ్యక్త మవుతున్నాయి. జాతీయస్థాయి పరీక్షను ఒక్క కేరళ లోనే 10 కేంద్రాల్లో నిర్వహించారు. వేరేవారికి బదులుగా పరీక్షలు రాస్తూ రెడ్ హ్యాండెడ్గా దొరి కిన ఇద్దరితోపాటు హరియాణాకు చెందిన మరో నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్టయిన అభ్యర్థులు మొబైల్ ఫోన్ కెమెరాలను ఉపయోగించి ప్రశ్నలను చిత్రీకరించి బయటి వారికి పంపుతున్నారని.. వారు తమ చెవులకు అమర్చిన బ్లూటూత్ పరికరంలో సమాధానమిచ్చారని పోలీసులు తెలిపారు. వాళ్లు తమ షర్ట్ బటన్ ముందు భాగంలో మైక్రో కెమెరాలను అమర్చినట్లు తెలిపారు. దీని ద్వారా నే స్కానింగ్ చేసినట్లు పేర్కొన్నారు. ఆ పరికరాలను ఫోరెన్సిక్ పరీక్షకు పంపించనున్నట్లు తెలిపారు.
నిందితులను ఎలా పట్టుకున్నారు..?
పరీక్షలో కాపీ కొట్టిన వ్యక్తుల గురించి ఓ అజ్ఞాత వ్యక్తి ఫోన్‌లో తమకు సమాచారం అందించినట్లు పోలీసులు తెలిపారు. రెండు చోట్ల పరీక్షలో చీటింగ్ జరిగినట్లు కాల్ ద్వారా తమకు సమాచారం అందినట్లు పోలీసులు తెలిపారు. హర్యానా నుంచే ఈ కాల్ వచ్చినట్లు పేర్కొన్నారు. ఇద్దరు నిందితుల అధికారిక అరెస్టు ఆదివారం రాత్రి ఆలస్యంగా నమోదైంది. వీరితో పాటు హర్యానాలో... నివసిస్తున్న మరికొందరు కూడా ఈ ఘటనకు సంబంధించి కస్టడీలో ఉన్నారు. అదుపులోకి తీసుకున్న వ్యక్తులు పరీక్ష రాశారా లేదా అనే కోణంలో విచారిస్తున్నారు. దీనిపై కేరళ పోలీసులు పూర్తిస్థాయి విచారణ ప్రారంభించగా, ఈ పరీక్షను రద్దు చేస్తున్నట్లు వీఎస్ఎస్సీ ప్రకటిం చింది.
పరీక్ష రద్దు..
చివరకు భారత అంతరిక్ష పరిశో ధన సంస్థ (ఇస్రో)కు చెందిన 'విక్రమ్ సారా భాయ్ అంతరిక్ష కేంద్రం' (వీఎస్ఎస్సీ)లో సాంకే తిక పోస్టుల భర్తీకి ఆదివారం నిర్వహించిన రాత పరీక్షను రద్దు చేశారు. టెక్నీషియన్-బి, డ్రాఫ్ట్స్ మెన్-బి, రేడియో గ్రాఫర్-ఏ పోస్టుల కోసం మళ్లీ ఎప్పుడు పరీక్షలు జరిగేదీ వెబ్సైట్ ద్వారా తెలియపరుస్తామని తెలిపింది.
Job Alerts |
---|
మీ వాట్స్ అప్ నెంబర్ కె జాబ్ అలర్ట్స్ రావాలంటే ఇక్కడ క్లిక్ చేయండి |
Date |
Item Name |
Details |
---|---|---|
07/07/2023 | ఉద్యోగ సమాచారం | Get Details |
23/07/2023 | ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసారా.. చేయకపోతే చేసుకొండి | Get Details |
23/07/2023 | ధరఖాస్తు చివరితేదీ పొడిగింపు | Get Details |
17/07/2023 | వ్రాత పరీక్ష తేదీ | Get Details |
23/07/2023 | అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్ | Get Details |
15/07/2023 | ఆన్సర్ కీ | Get Details |
01/07/2023 | ఫలితాలు | Get Details |
11/07/2023 | ఫైనల్ రిసల్ట్ | తుది ఫలితం | Get Details |
15/07/2023 | డాక్యుమెంట్ వెరిఫికేషన్ | Get Details |
15/07/2023 | ఎంపిక జాబితా | Get Details |
01/07/2023 | TSPSC గ్రూప్ 4, పేపర్ 1 | Get Details |
07/04/2023 | జనరల్ అవేర్నెస్ | Get Details |
07/04/2023 | క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ | Get Details |
07/04/2023 | రీజనింగ్ | Get Details |
07/04/2023 | కరెంటు అఫైర్స్ | Get Details |
టెలిగ్రామ్ లో జాబ్ అలర్ట్స్ రావాలంటే టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి |
No comments:
Post a Comment