ఆంధ్రప్రదేశ్ స్టేట్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ లిమిటెడ్ (APSCSC) కాంట్రాక్ట్ ప్రాతిపదికన టెక్నికల్ అసిస్ట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, మరియు హెల్పర్స్ ఉద్యోగ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌ను ప్రచురించింది. ఖాళీ వివరాలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు మరియు అన్ని అర్హత ప్రమాణాలను పూర్తి చేసిన అభ్యర్థులు నోటిఫికేషన్‌ను చదివి ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
ఖాళీల వివరాలు చూస్తే టెక్నికల్ అసిస్ట్ లో 275, డేటా ఎంట్రీ ఆపరేటర్ లో 275, మరియు హెల్పర్స్ లో 275 ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. విద్య అర్హతలు హెల్పర్స్ కి అయితే ఎనిమిదవ తరగతి మరియు పదవ తరగతి ఉత్తీర్ణులయి ఉండాలి. డేటా ఎంట్రీ ఆపరేటర్ కి డిగ్రీ తో పాటు కంప్యూటర్ అప్లికేషన్స్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఉండాలి. మరియు చివరగా టెక్నికల్ అసిస్టెంట్ కి డిప్లొమా ఇన్ అగ్రికల్చర్, డిగ్రీ/ అగ్రికల్చర్/ మైక్రోబయాలజీ/ బయోకెమిస్ట్రీ/ బయోటెక్నాలజీ/ లైఫ్ సైన్స్/ BZC (బోటనీ/ జువాలజీ/ కెమిస్ట్రీ) ఉండాలి. సెప్టెంబర్ 02, 2023 దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ (సెప్టెంబర్ 02 సాయంత్రం 05:00 గంటలకు లేదా అంతకంటే ముందు). హెల్పర్స్ కి కనిష్ట మరియు గరిష్ట వయస్సులు 18 సంవత్సరాల నుండి 35 సంవత్సరాలవరకు. టెక్నికల్ అసిస్టెంట్ మరియు డేటా ఎంట్రీ ఆపరేటర్స్ కి కనిష్ట మరియు గరిష్ట వయస్సులు 21 సంవత్సరాల నుండి 40 సంవత్సరాల వరకు. ఏస్సీ, బీసీ మరియు ఎస్టీ లకు వయోసడలింపులు కలవు. నోటిఫికేషన్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి మరియు అధికారక వెబ్సైటు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
No comments:
Post a Comment