తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)కు ఇటీవల నోటిఫికేషన్ విడుదలైందన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 15న టెట్ పరీక్ష నిర్వహించనున్నట్లు ప్రభుత్వం నోటిఫికేషన్ లో పేర్కొంది. వీటికి ఆగస్టు 02 నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కాగా.. ఈనెల 16వ తేదీ వరకు ఆన్‌లైన్ ధరఖాస్తులు స్వీకరించనున్నారు. అంటే నేటితో దరఖాస్తుల ప్రక్రియ ముగియనుంది. ఈ దరఖాస్తుల ప్రక్రియ మరో వారం పొడిగించాలని అభ్యర్థులు వినతి పత్రాలు సమర్పిస్తున్నా.. అధికారులు మత్రం దరఖాస్తుల ప్రక్రియను పొడిగించే అవకాశం లేనట్లు తెలుస్తోంది. పేపర్ -1 పరీక్షకు డీఈడీ, బీఈడీ అభ్యర్థులు ఇద్దరూ రాసుకునే అవకాశం కల్పించారు. బీఈడీ అర్హత కలిగిన అభ్యర్థులు పేపర్ -2తో పాటు పేపర్-1 పరీక్ష కూడా రాసుకోవచ్చు. ఇదిలా ఉండగా.. మంగళవారం సాయంత్రం నాటికి 2,50,963 దరఖాస్తులు వచ్చాయని ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ తెలిపారు. పేపర్ 1కు 74,026, పేపర్ 2కు 16,006 దరఖాస్తులు రాగా, రెండింటికీ 1,60,931 వచ్చాయని చెప్పారు. సోమవారం నాటికి 2.23 లక్షల దరఖాస్తులు రాగా.. మంగళవారం ఒక్కరోజే 27వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. చివరి రోజు దరఖాస్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. టీచర్ వృత్తిలో అడుగుపెట్టాలనుకునేవారికి టెట్ తప్పనిసరి. ఇందులో అర్హత సాధిస్తేనే ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నిర్వహించే టిఆర్‌టి పరీక్ష రాయడానికి అవకాశం ఉంటుంది. దాంతో ఉపాధ్యాయ విద్యను అభ్యసించిన అభ్యర్థులందరూ తప్పనిసరిగా టెట్‌లో అర్హత సాధించవలసి ఉంటుంది. ఇంతక ముందు జరిగిన టెట్ పరీక్షలకు దాదాపు 4 లక్షలకు పైగా దరఖాస్తులు రాగా.. ఈ సారి అంతగా దరఖాస్తులు రాలేదు. రాష్ట్రంలో గురుకుల పరీక్షలు నడుస్తుండటంతో అభ్యర్థులు ఎక్కువగా టెట్‌పై దృష్టి పెట్టలేదనే వాదనలున్నాయి. ఈ నేపథ్యంలో టెట్‌కు ఎడిట్ ఆప్షన్ ఇచ్చి, వారం రోజుల పాటు గడువు పెంచాలని డీఎడ్, బీఎడ్ అభ్యర్థుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రావుల రాంమోహన్ రెడ్డి ఒక ప్రకటనలో కోరారు. రాష్ట్రంలో 1.5 లక్షల డీఈడీ, 4.5 లక్షల మంది బీఈడీ అభ్యర్థులు ఉన్నారు. 2017 టీఆర్‌టీ నోటిఫికేషన్ ద్వారా 8,792 టీచర్ పోస్టులను భర్తీ చేయడం జరిగింది. గతంలో టెట్‌కు ఏడు సంవత్సరాల వ్యాలిడిటీ ఉండగా, రెండేళ్ల క్రితం టెట్ వ్యవధిని జీవితకాలం పొడిగించిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో ఇప్పటి వరకు టెట్ క్వాలిఫై కానీవారి సంఖ్య రెండు లక్షల వరకు ఉంటుంది. వీరితో పాటు కొత్తగా బీఈడీ, డీఎడ్ పూర్తి చేసిన వారి సంఖ్య మరో 20 వేల వరకు ఉంటుంది. తాజా టెట్ నిర్వహణతో వీరందరికి మరోమారు పోటీపడే అవకాశం దక్కుతుంది. వివరాలకు https://tstet.cgg.gov.in/ వెబ్ సైట్ సందర్శించొచ్చు.
ముఖ్యమైన లింక్స్
- ఆన్లైన్ పేమెంట్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
- ఆన్లైన్ అప్లై కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
- అధికారిక వెబ్సైటు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

No comments:
Post a Comment