ఏపీలోని నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త. భారత చైతన్య యువజన పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని నిరుద్యోగుల కోసం భారీ జాబ్ మేళా (Job Mela) నిర్వహణకు ఏర్పాట్లు సాగుతున్నాయి. ఈ జాబ్ మేళాలో 500కు పైగా కంపెనీలు పాల్గొనున్నాయి. ఈ జాబ్ మేళా ద్వారా ఈ కంపెనీల్లో 50 వేలకు పైగా ఉద్యోగాలను (Jobs) కల్పించనున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు. ఈ భారీ జాబ్ మేళాను సెప్టెంబర్ 2, 3 తేదీల్లో నిర్వహించున్నారు. ఆ రెండు రోజుల్లో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించనున్నారు. ఈ జాబ్ మేళాలో ఎంపికైన వారు ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులో పని చేయాల్సి ఉంటుందని ప్రకటనలో పేర్కొన్నారు. ఇంకా ఎంపికైన వారికి అదే రోజు నియామక పత్రాలు అందిస్తారని ప్రకటనలో స్పష్టం చేశారు. ఇంకా ఈ జాబ్ మేళాకు హాజరయ్యే వారు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. ఇంకా మధ్యాహ్న భోజనంతో పాటు అన్ని సౌకర్యాలు కల్పించనున్నట్లు వెల్లడించారు.
పాల్గొనున్న కంపెనీలు 500
- ఈ జాబ్ మేళాలో ప్రముఖ విప్రో (Wipro)
- అమెజాన్ (Amazon
- టెక్ మహీంద్రాతో (Tech Mahindra) పాటు మొత్తం 500 కంపెనీలు పాల్గొనున్నాయి
ముఖ్యమైన తేదీలు
- ఈ భారీ జాబ్ మేళాను సెప్టెంబర్ 2, 3 తేదీల్లో నిర్వహించున్నారు.
- ఆ రెండు రోజుల్లో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించనున్నారు.
దరఖాస్తు రుసుము
- ఇంకా ఈ జాబ్ మేళాకు హాజరయ్యే వారు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
- ఇంకా మధ్యాహ్న భోజనంతో పాటు అన్ని సౌకర్యాలు కల్పించనున్నట్లు వెల్లడించారు.
విద్యార్హత
- టెన్త్, ఇంటర్, ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, బీటెక్, ఎంబీఏ, ఎంసీఏ విద్యార్హత కలిగిన వారు ఈ జాబ్ మేళాకు హాజరు కావచ్చు
వయోపరిమితి
- కనిష్ట వయస్సు 18 సంవత్సరాలు నిండి ఉండాలి
- గరిష్ట వయస్సు 35 సంవత్సరాలు లోపు ఉండాలి
వేతనం
- ఎంపికైన వారికి నెలకు రూ.13 వేల నుంచి రూ.1.50 లక్షల వరకు వేతనం ఉంటుందని తెలిపారు.
జాబ్ మేళా వేదిక
- హ్యాపీ రిసార్ట్స్, డీజీపీ ఆఫీస్ ఎదురుగా, మంగళగిరి, విజయవాడ-గుంటూరు హైవే.
రిజిస్ట్రేషన్
- ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ క్రింది లింక్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని నిర్వాహకులు సూచించారు. అయితే రిజిస్ట్రేషన్ చేసుకోని వారు నేరుగా వేదిక వద్దకు వచ్చి జాబ్ మేళాలో పాల్గొనవచ్చని తెలిపారు.
ముఖ్యమైన లింక్స్
- రిజిస్ట్రేషన్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి
- అధికారిక వెబ్సైటు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి