Mother Tongue

Read it Mother Tongue

Sunday, 30 June 2024

పంజాబ్ నేషనల్ బ్యాంకు లో భారీగా అప్రెంటిస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. అప్లికేషన్ లింక్ ఇక్కడే!

 పంజాబ్ నేషనల్ బ్యాంకు లో 2700 అప్రెంటిస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసారు. అప్లికేషన్ కు చివరి తేదీ జులై 14, 2024. వయోపరిమితి 20 ఇయర్స్ నుండి 28 ఇయర్స్ వరకు. BC, SC, ST లకు ఏజ్ రిలాక్సేషన్ అప్లికేబుల్. మరింత సమాచారము కొరకు నోటిఫికేషన్ చూడండి. 

అప్లై కొరకు ఇక్కడ క్లిక్ చేయండి (Link 1), (Link 2)

నోటిఫికేషన్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి 



18 ఏళ్లు దాటిన వారికి గుడ్ న్యూస్.. రూ.2 లక్షల 30 వేల జీతం..

 జనగామ జిల్లాలోని నిరుద్యోగ యువతీ,యువకులకు ప్రైవేట్ రంగంలో ఉపాధి కల్పించేందుకు జులై 3న జాబ్ మేళా నిర్వహించనున్నారు.ఈ మేరకు ఉపాధి కల్పన అధికారి సిహెచ్.ఉమారాణి ఒక ప్రకటనలో తెలిపారు. నిరుద్యోగ నిర్మూలన కోసం ప్రభుత్వాలు అనేక కార్యక్రమాలు చేపడుతున్నాయి. నిరుద్యోగ నిర్మూలనే లక్ష్యంగా ముందుకు వెళుతున్నాయి. ఇందుకోసం ప్రభుత్వాలు పలుచోట్ల ఉచిత ఉపాధి శిక్షణ కల్పిస్తున్నాయి. ఇటు ప్రైవేట్ రంగ సంస్థల సైతం పలుచోట్ల జాబ్ మేళాలు నిర్వహిస్తూ నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తున్నారు. ఇప్పటికే ఎంతోమంది ఈ జాబ్ మేళాలో పాల్గొని పలు కంపెనీలకు ఎంపికై ఉద్యోగాలు చేస్తున్నారు. అయితే పలు సంస్థలు ప్రతి ఏటా పలుచోట్ల జాబ్ మేళాలు నిర్వహిస్తూ నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నారు. జనగామ జిల్లాలోని నిరుద్యోగ యువతీ,యువకులకు ప్రైవేట్ రంగంలో ఉపాధి కల్పించేందుకు జులై 3న జాబ్ మేళా నిర్వహించనున్నారు.ఈ మేరకు ఉపాధి కల్పన అధికారి సిహెచ్.ఉమారాణి ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు ఈ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. హైదరాబాద్ లోని హెటిరో ల్యాబ్స్ లిమిటెడ్ కంపెనీలో ఉద్యోగాల భర్తీకి ఈ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అ కంపెనీలో జూనియర్ కెమిస్ట్ 50,జూనియర్ ఆఫీసర్ 20, జూనియర్ టెక్నిషియన్ 30 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్లు చెప్పారు. జూనియర్ కెమిస్ట్ ఉద్యోగానికి ఏదైనా డిగ్రీ చదివిన వారు అర్హులన్నారు.జూనియర్ ఆఫీసర్ ఉద్యోగానికి ఎంఎస్సీ,జూనియర్ టెక్నిషియన్ కు ఐటీఐ చేసిన వారు అర్హులని పేర్కొన్నారు. ఇందులో ఎంపికైన వారికి వార్షిక వేతనం రూ:2.3లక్షల నుండి ఉంటుందన్నారు.18 నుండి 27 సంవత్సరాల లోపు వయస్సు గల యువతి,యువకులు ఈ మేళాలో పాల్గొనేందుకు అర్హులని తెలిపారు. ఆసక్తి,అర్హత కలిగిన అభ్యర్థులు తమ బయోడేటా మరియు విద్యార్హత సర్టిఫికెట్స్ జిరాక్స్ కాపీలతో పాటు పాస్ ఫోటో తీసుకొని రావాలన్నారు. జులై 3న ఉదయం 10:30 గంటలకు ఈ జాబ్ మేళా ప్రారంభమవుతుందన్నారు. జిల్లా కేంద్రంలోని ఉపాధి కార్యాలయంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. అభ్యర్థులు పూర్తి వివరాలకు 7995430401 నెంబర్ ను సంప్రదించాలన్నారు.జిల్లాకు చెందిన అభ్యర్థులు ఈ జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. 



డీఎస్సీ నోటిఫికేషన్ రద్దు.. సీఎం కీలక నిర్ణయం

 సీఎం కుర్చీలో ఉన్న వెంటనే తొలి సంతకాన్ని డీఎస్సీ నోటిఫికేషన్ పై చేసిన చంద్రబాబు.. ప్రస్తుతం ఆ దిశగా అడుగులేస్తున్నారు. ఈ మేరకు గత వైసీపీ ప్రభుత్వంలో విడుదలైన డీఎస్సీ నోటిఫికేషన్ రద్దు చేశారు. ఏపీలో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం వరుసపెట్టి పలు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. సీఎం కుర్చీలో ఉన్న వెంటనే తొలి సంతకాన్ని డీఎస్సీ నోటిఫికేషన్ పై చేసిన చంద్రబాబు.. ప్రస్తుతం ఆ దిశగా అడుగులేస్తున్నారు. ఈ మేరకు గత వైసీపీ ప్రభుత్వంలో విడుదలైన డీఎస్సీ నోటిఫికేషన్ రద్దు చేసింది టీడీపీ గవర్నమెంట్. గతంలో వైసీపీ ప్రభుత్వం 6,100 టీచర్ పోస్టుల భర్తీకి డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే చంద్రబాబు ఏర్పాటు చేసిన కొత్త ప్రభుత్వం ఇప్పుడు మెగా డీఎస్సీ ప్రకటించి.. ఈ పరీక్షతో పాటు TET కూడా నిర్వహించడానికి కసరత్తులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గత డీఎస్సీ నోటిఫికేషన్ రద్దు చేస్తూ విద్యాశాఖ జీవో నెం.256 జారీ చేసింది. నేడో, రేపో 16,347 పోస్టులతో నూతన డీఎస్సీ నోటిఫికేషన్ జారీ కానుంది. మెగా డీఎస్సీ కోసం మరోసారి టెట్ నిర్వహించడానికి ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. మెగా డీఎస్సీలో మొత్తం 16,347 ఉపాధ్యాయుల పోస్టుల భర్తీని పూర్తి చేసేలా షెడ్యూల్ రెడీ చేయాలని నిర్ణయం తీసుకుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. జులై ఒకటి నుంచి డీఎస్సీ ప్రక్రియ షురూ చేసి డిసెంబర్ 10లోగా పరీక్షలు పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నారట. జిల్లాల వారీగా డీఎస్సీ ఖాళీలు చూస్తే.. శ్రీకాకుళంలో 543, విజయనగరంలో 583, విశాఖలో 1134, తూర్పు గోదావరిలో 1346, పశ్చిమ గోదావరిలో 1067, కృష్ణాలో 1213, గుంటూరులో 1159, ప్రకాశంలో 672, నెల్లూరులో 673, చిత్తూరులో 1478, కడపలో 709, అనంతపురంలో 811, కర్నూలులో 2678 ఖాళీలు ఉన్నాయి. ముందుగా TET పరీక్ష నిర్వహించి, ఆ తర్వాత మెగా డీఎస్సీకి నోటిఫికేషన్ ఇవ్వబోతున్నారట. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీ స్టడీ సర్కిళ్లలో వెనుకబడిన తరగతుల విద్యార్థులకు, నిరుద్యోగులకు ఉచితంగా డీఎస్సీ శిక్షణ ఇవ్వడానికి ప్రభుత్వం రెడీ అవుతోంది.





పోస్టుల భర్తీకి దరఖాస్తుల స్వీకరణ.. వెంటనే అప్లై చేసుకోండిలా..

 సంబంధిత సబ్జెక్టుల్లో పీజీ డిగ్రీ, బీఈడీని ఇంగ్లీష్ మీడియంలో పూర్తి చేసి ఉండాలన్నారు. ఉపాధ్యాయ అనుభవం కలిగి, టెట్ పాసైన వారికి ప్రాధాన్యత ఉంటుందని వెల్లడించారు.

బీఈడీ చేసిన అభ్యర్థులకు డబుల్ ధమాకా. అది ఎలానంటే జూలై 1 వ తేదీ నుండి డీఎస్సీ ప్రకటన ఇస్తామని ఆల్రెడీ ప్రభుత్వం ప్రకటించింది. బీ ఈ డీ చేసిన అభ్యర్థులు కోచింగ్ సెంటర్స్ లో బిజీగా గడుపుతున్నారు. ఒక పక్కన పిల్లలకు బోధిస్తే సబ్జెక్ట్ వస్తుంది. మనం టీచర్ పోస్ట్ కి ప్రిపేర్ అయినట్టు ఉంటుంది. మంచి అవకాశం అని కూడ చెప్పవచ్చు. పిల్లలకు బోధించే కంటెంట్ నుండీ ఎక్కువ ప్రశ్నలు రానున్నాయి.

అలా డీఎస్సీకి ప్రిపేర్ అయినట్టు ఉంటుంది. ఇలా డబ్బులు సంపాదించుకొన్నట్టు ఉంటుంది. అదే విధంగా కొన్ని సంవత్సరాలుగా ప్రైవేటు బడుల్లో బోధిస్తున్న వారికి కూడ మంచి ప్రిఫరెన్స్ కూడ ఉంటుంది. చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం పెద్దపంజాణి మండలం, శంకర్రాయలపేటలోని మహాత్మా జ్యోతిబా పూలే బాలికల గురుకుల పాఠశాలలో ఇంగ్లీష్, ఫిజికల్ సైన్స్, మ్యాథ్స్, తెలుగు సబ్జెక్టుల్లో గెస్ట్ టీచర్లుగా పనిచేసేందుకు మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లుప్రిన్సిపల్ ఏ. జోత్స్న తెలిపారు.

సంబంధిత సబ్జెక్టుల్లో పీజీ డిగ్రీ, బీఈడీని ఇంగ్లీష్ మీడియంలో పూర్తి చేసి ఉండాలన్నారు. ఉపాధ్యాయ అనుభవం కలిగి, టెట్ పాసైన వారికి ప్రాధాన్యత ఉంటుందని వెల్లడించారు. అభ్యర్థులు విద్యార్హత సాఫ్ట్ కాపీని జూలై 3 వ తేదీలోపు mjpapbcwrei spalamaner@gmail.com చేయాలని సూచించారు. వివరాలకు 95157 64818 నంబర్లో సంప్రదించాలని కోరారు.



Saturday, 29 June 2024

రాత పరీక్ష లేకుండానే ఆయిల్ ఇండియాలో ఉద్యోగాలు.. నెలకు రూ. 70000 జీతం

 ఆయిల్ ఇండియా లిమిటెడ్ (OIL)..కెమిస్ట్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కూడా ప్రారంభమైంది. ఆసక్తి, అర్హతలు ఉన్న అభ్యర్థులు ఆయిల్ ఇండియా అధికారిక వెబ్‌సైట్ oil-india.com ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. అప్లయ్ చేయడానికి చివరి తేదీ జూలై 11. ఈ పోస్టులకు అప్లయ్ చేసే ముందు అభ్యర్థులు కింద ఇచ్చిన పాయింట్లను జాగ్రత్తగా చదవాలి.

వయోపరిమితి

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల కనీస వయస్సు 24 సంవత్సరాలు, గరిష్ట వయోపరిమితి 40 సంవత్సరాలు ఉండాలి.

విద్యార్హత

అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ఇన్‌స్టిట్యూట్ నుండి కనీసం 02 (రెండు) సంవత్సరాల వ్యవధిలో కెమిస్ట్రీలో మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే, అభ్యర్థులు కనీసం ఒక  సంవత్సరం పారిశ్రామిక/సంస్థాగత/పరిశోధన ప్రయోగశాలలో పని అనుభవం కలిగి ఉండాలి.

జీతం

ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా ఈ పోస్టులకు ఎంపికైన ఏ అభ్యర్థికైనా నెలకు రూ. 70,000 జీతం చెల్లించబడుతుంది.

నోటిఫికేషన్, అప్లికేషన్ లింక్‌ని ఇక్కడ చూడండి

OIL India Recruitment 2024 నోటిఫికేషన్

OIL India Recruitment 2024అప్లయ్ చేయడానికి లింక్

ఎంపిక ప్రక్రియ

దరఖాస్తు చేస్తున్న అభ్యర్థులందరూ వాక్-ఇన్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేయబడతారు. అభ్యర్థులు క్రింద ఇవ్వబడిన చిరునామాలో ఇంటర్వ్యూకు హాజరు కావాలి

స్థలం: ఆయిల్ ఇండియా లిమిటెడ్, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ ఎనర్జీ స్టడీస్, 5వ అంతస్తు, NRL సెంటర్, 122A క్రిస్టియన్ బస్తీ, G.S. రోడ్, గౌహతి, అస్సాం, ఇండియా, పిన్-781005



కొచ్చిన్ చిప్యార్డ్ లో ఉద్యోగ ఖాళీలకు నోటిఫికేషన్ విడుదల.. అప్లికేషన్ లింక్ ఇక్కడే!

 కొచ్చిన్ చిప్యార్డ్ లో 64 ఉద్యోగ ఖాళీలకు నోటిఫికేషన్ విడుదల చేసారు. ఆన్లైన్ లో అప్లికేషన్ కు చివరి తేదీ జులై 17, 2024. మరిన్ని వివరాలకు నోటిఫికేషన్ చదవండి. 

ఆన్లైన్ లో అప్లై కొరకు ఇక్కడ క్లిక్ చేయండి 

నోటిఫికేషన్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి 



10వ తరగతి పాసైతే చాలు..పోస్టాఫీసులో ఉద్యోగాలు

 ఇండియా పోస్ట్(India post) లో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి గుడ్ న్యూస్.

ఇండియా పోస్ట్(India post) లో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి గుడ్ న్యూస్. 10వ తరగతి పాసై, లైట్, హెవీ మోటారు వాహనాలను ఎలా నడపాలో తెలుసినవాళ్లకు  ఇండియా పోస్ట్‌లో ఉద్యోగం పొందడానికి మంచి అవకాశం ఉంది.  ఇండియన్ పోస్ట్ డ్రైవర్ పోస్టుల భర్లీ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఆసక్తి,అర్హత ఉన్న అభ్యర్థులు ఇండియన్ పోస్ట్ అధికారిక వెబ్‌సైట్ indiapost.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.  ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా మొత్తం 07 పోస్టులు భర్తీ చేయబడతాయి. ఈ పోస్ట్‌లకు దరఖాస్తు చేసుకోకుంటే, జూలై 31వ తేదీలోపు లేదా అంతకు ముందు దరఖాస్తు చేసుకోండి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలని ఆలోచిస్తున్న అభ్యర్థులు కింద ఇచ్చిన పాయింట్లను జాగ్రత్తగా చూడండి.

వయోపరిమితి

అధికారిక నోటిఫికేషన్ ప్రకారం దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల గరిష్ట వయోపరిమితి 56 సంవత్సరాలు. అప్పుడే వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులుగా పరిగణించబడతారు.

విద్యార్హత

అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు లేదా ఇన్‌స్టిట్యూట్ నుండి 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే అభ్యర్థులు హోంగార్డ్ లేదా సివిల్ వాలంటీర్‌గా కనీసం 3 సంవత్సరాల పని అనుభవం కలిగి ఉండాలి.

ఎలా దరఖాస్తు చేయాలి

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి చేసిన దరఖాస్తు ఫారమ్‌ను అవసరమైన అర్హత,అనుభవంతో దిగువ ఇవ్వబడిన అడ్రెస్ కు పంపాలి.

అసిస్టెంట్ డైరెక్టర్ (రిక్రూట్‌మెంట్), చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ కార్యాలయం, రాజస్థాన్ పోస్టల్ సర్కిల్ జైపూర్-302007

ముఖ్యమైన లింక్స్ 

అధికారిక వెబ్సైటు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి. 

నోటిఫికేషన్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి. 



TS DSC టీచర్ ఎక్సమ్ డేట్స్ విడుదల..

 TS DSC టీచర్ ఎక్సమ్ డేట్స్ విడుదల చేసారు. ఎక్సమ్ జులై 18 నుంచి ఆగష్టు 05, 2024 వరకు జరుగును. ఎక్సమ్ డేట్ నోటీసు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి





UPSC నర్సింగ్ ఆఫీసర్ అడ్మిట్ కార్డు విడుదల.. డౌన్లోడ్ లింక్ ఇక్కడే!

UPSC నర్సింగ్ ఆఫీసర్ అడ్మిట్ కార్డు విడుదల చేసారు. దీనికి సంబందించిన నోటిఫికేష ఫిబ్రవరి 2022 న 1930 పోస్టులతో విడుదల చేసారు. అడ్మిట్ కార్డు డౌన్లోడ్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.



Friday, 28 June 2024

SBI క్లర్క్ ఫైనల్ ఫలితాలు విడుదల .. లింక్ ఇక్కడే!

 SBI క్లర్క్ ఫైనల్ ఫలితాలు విడుదల చేసారు. దీనికి సంబందించిన నోటిఫికేషన్ నవంబర్ 2023 న 8283 పోస్టులతో నోటిఫికేషన్ విడుదల చేసారు. చివరి ఫలితాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి



TSPSC AEE ప్రోవిషనల్లీ సెలెక్టెడ్ కాండిడేట్స్ లిస్ట్ విడుదల.. లింక్ ఇక్కడే!

 TSPSC AEE ప్రోవిషనల్లీ సెలెక్టెడ్ కాండిడేట్స్ లిస్ట్ విడుదల చేసారు.  దీనికి సంబందించిన నోటిఫికేషన్ సెప్టెంబర్ 2022, న 1540 పోస్టులతో నోటిఫికేషన్ విడుదల చేసినారు. సెలెక్టెడ్ కాండిడేట్స్ లిస్ట్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి వెబ్ నోటీసు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి



పదవ తరగతి అర్హతతో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా 8326 MTS మరియు హవాల్దార్ రిక్రూట్మెంట్.. అప్లికేషన్ లింక్ ఇక్కడే!

 పదవ తరగతి అర్హతతో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా 8326 MTS మరియు హవాల్దార్ రిక్రూట్మెంట్ కి నోటిఫికేషన్ విడుదల. అప్లికేషన్కు చివరి తేదీ జులై 30, 2024. దీనికి సంబందించిన నోటిఫికేషన్ కొరకు  ఇక్కడ క్లిక్ చేయండి. ఆన్లైన్ లో అప్లై చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి



కేవలం ఎనిమిది, 10వ తరగతి అర్హతతో ప్రభుత్వ ఉద్యోగాలు.. భారీగా ఖాళీలు

 నిరుద్యోగులకు గుడ్‌న్యూస్. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ మజగావ్‌ డాక్ షిప్‌బిల్డర్స్ లిమిటెడ్ (MDL), ఉద్యోగాల భర్తీకి తాజాగా నోటిఫికేషన్ రిలీజ్ చేసింది.

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ మజగావ్‌ డాక్ షిప్‌బిల్డర్స్ లిమిటెడ్ (MDL), ఉద్యోగాల భర్తీకి తాజాగా నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. గ్రూప్ A, గ్రూప్ B, గ్రూప్ C పోస్టుల్లో అప్రెంటిస్‌‌గా చేరడానికి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చని పేర్కొంది. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌లో మొత్తం 518 పోస్టులను భర్తీ చేయనున్నారు. 8, 10వ తరగతితో పాటు ఐటీఐ పాసైన అభ్యర్థులు ఈ అప్రెంటిస్‌షిప్ పోస్టులకు అర్హులు. ప్రభుత్వ రంగ సంస్థలో పనిచేయడానికి చదువు మధ్యలో ఆపేసిన వారికి, గ్యాప్ ఉన్నవారికి ఇది మంచి అవకాశం. ఈ పోస్టులకు అప్లికేషన్ ప్రాసెస్, దరఖాస్తుకు చివరి గడువు, సెలక్షన్ ప్రాసెస్, జీతభత్యాలు, తదితర విషయాలు తెలుసుకుందాం.

* ఖాళీలు

రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలో ఉన్న మినీ రత్న కంపెనీల్లో ఎండీఎల్ ఒకటి. గ్రూప్ A కింద ఈ సంస్థ 218 ఖాళీలను భర్తీ చేయనుంది. గ్రూప్ Bలో 240 వేకెన్సీస్ ఉన్నాయి. గ్రూప్ Cలో మొత్తం 60 పోస్టులు ఉన్నాయి.

* అప్లికేషన్ ప్రాసెస్

- అప్రెంటిస్‌షిప్ పోస్టులకు అప్లికేషన్ ప్రాసెస్ పూర్తిగా ఆన్‌లైన్‌లో ఉంటుంది. ఆసక్తి ఉన్నవారు MDL వెబ్‌సైట్ https://mazagondock.in ఓపెన్ చేయాలి.

- తర్వాత కెరీర్స్ సెక్షన్‌కు వెళ్లి, ‘ఆన్‌లైన్ రిక్రూట్‌మెంట్’, ఆ తర్వాత ‘అప్రెంటీస్‌’ ఆప్షన్స్ క్లిక్ చేయండి.

- అప్రెంటీస్ సెక్షన్‌లో అకౌంట్ క్రియేట్ చేసి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ పూర్తి చేయండి.

- తర్వాత అకౌంట్‌కు లాగిన్ అయ్యి దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందుకు నోటిఫికేషన్‌లో సూచించిన ప్రాసెస్‌ ఫాలో అవ్వాలి.

* సెలక్షన్ ఎలా?

అభ్యర్థులను రాత పరీక్ష ద్వారా ఎంపిక చేయనున్నారు. పోస్టులు, విద్యార్హతలను బట్టి క్యాండిడేట్లకు రాత పరీక్ష ఉంటుంది. నోటిఫికేషన్ ప్రకారం.. ఈ ఏడాది ఆగస్టు 10న రాత పరీక్ష జరగనుంది. సిలబస్ కోసం వెబ్‌సైట్‌ చెక్ చేయవచ్చు.

* ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్

పదో తరగతి పాసైన వారు గ్రూప్ A పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. ఐటీఐ పూర్తి చేసిన వారు గ్రూప్ B, 8వ తరగతి పాసైన వారు గ్రూప్ C పోస్టుల కోసం పోటీపడొచ్చు. గ్రూప్ A పోస్టులకు సంబంధించి జనరల్ కేటగిరీ అభ్యర్థులకు పదో తరగతిలో మ్యాథమెటిక్స్, సైన్స్ సబ్జెక్టులలో కనీసం 50 శాతం మార్కులు వచ్చి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు పాసైతే చాలు.

గ్రూప్ B పోస్టులకు దరఖాస్తు చేయాలంటే జనరల్ కేటగిరీ అభ్యర్థులకు ఐటీఐలో కనీసం 50 శాతం మార్కులు వచ్చి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు పాసైతే సరిపోతుంది. గ్రూప్ C అప్రెంటిస్‌షిప్‌కి అప్లై చేసేవారికి కూడా ఇదే రూల్ వర్తిస్తుంది. 8వ తరగతిలో జనరల్ కేటగిరీ అభ్యర్థులు కనీసం 50 శాతం మార్కులు పొందాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు కనీస మార్కుల నిబంధన లేదు.

* స్టైపెండ్ ఎంత?

గ్రూప్ A అప్రెంటిస్ వ్యవధి రెండేళ్లు. ఈ పోస్టులకు ఎంపికైన వారికి మొదటి 3 నెలల వరకు నెలకు రూ.3,000 స్టైపెండ్ అందుతుంది. ఆ తర్వాత నెలకు రూ.6 వేలు పొందవచ్చు. ఇక ఏడాది పాటు గ్రూప్ B అప్రెంటిస్‌లకు ట్రైనింగ్ ఉంటుంది. వీరికి నెలకు రూ.8,050 ఇస్తారు. పైప్ ఫిట్టర్, వెల్డర్, కోపా, కార్పెంటర్‌లకు నెలకు రూ.7,700 స్టైపెండ్ అందుతుంది. ఇక గ్రూప్ C అప్రెంటిస్‌షిప్ ట్రైనింగ్ రెండేళ్ల పాటు ఉంటుంది. ఎంపికైన వారికి మొదటి మూడు నెలలు రూ.2,500 వస్తుంది. ఆ తర్వాత 9 నెలలు రూ.5,000; రెండో ఏడాదిలో నెలకు రూ.5,500 పొందవచ్చు.



10 పాస్ అయితే చాలు.. ఆధార్ చూపిస్తే ప్రతి నెలా రూ.12 వేలు జీతంతో ఉద్యోగం!

 ఆసక్తి ఉన్నవారు 10వ తరగతి మార్క్ లిస్ట్ తో పాటు ఆధార్ కార్డ్ తీసుకొని ఈ నెల 30వ తేదీ లోపు 1వ పట్టణ పోలీస్ స్టేషన్ పక్కన ఉన్న ఆర్మ్డ్ రిజర్వ్ ఆఫీస్ నందు గల ఎం టి ఓ ఆఫీస్ నందు సంప్రదించగలరు.

10వ తరగతి చదువుకొని ఇంటి దగ్గర ఉన్న నిరుద్యోగులకు సువర్ణావకాశం. రోజుకు 400 చొప్పున కూలీ వచ్చే ఉద్యోగం ఉన్నదని రక్షణ శాఖ సిబ్బంది నుంచి కబురు పెట్టారు. చిత్తూరు పట్టణంలో కానీ ఆ పట్టణం నుండి 10 కిలోమీటర్ల దూరంలో ఉండే నిరుద్యోగులకు మంచి అవకాశం అని చెప్పవచ్చు. కానీ వయసు మాత్రం 21 పైన 40 ఏళ్లు లోపల వారు మాత్రమే అర్హులని తెలిపారు. ఇంతకీ ఈ ఉద్యోగం అవకాశం ఎక్కడంటే.. చిత్తూరు పట్టణము నందు దర్గా కూడలి వద్ద నిర్మాణంలో ఉన్న పోలీస్ వెల్ఫేర్ పెట్రోల్ బంక్. త్వరలో ఇక్కడ పెట్రోల్ బంకునుప్రారంభించనున్నారు.

ఈ మేరకు చిత్తూరు జిల్లా ఎస్పీ వి.ఎన్. మణికంఠ చందోలు ఆదేశాల మేరకు పెట్రోల్ బంక్ నందు పంప్ బాయ్స్ గా పని చేయుటకు 10వ తరగతి పాస్ అయిన 21 సంవత్సరాల నుండి 40 సంవత్సరాల లోపు వయసు గల వారు ఇందుకు అర్హులని తెలిపారు. నెలకు రూ.12,000 జీతం ఇవ్వబడునని తెలిపారు.

ఆసక్తి ఉన్నవారు 10వ తరగతి మార్క్ లిస్ట్ తో పాటు ఆధార్ కార్డ్ తీసుకొని ఈ నెల 30వ తేదీ లోపు 1వ పట్టణ పోలీస్ స్టేషన్ పక్కన ఉన్న చిత్తూరు ఆర్మ్డ్ రిజర్వ్ ఆఫీస్ నందు గల ఎం టి ఓ ఆఫీస్ నందు సంప్రదించగలరని ఆర్.ఐ భాస్కర్ తెలిపారు.ఇతర సమాచారం కొరకు ఆర్.ఐ,ఎం టి ఓ 94910 74516 నెంబర్ ను సంప్రదించగలరన్నారు.





Thursday, 27 June 2024

హెచ్‌సిఎల్‌లో ఉద్యోగాలు..నెలకు రూ. 120000 వరకు జీతం

 ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఇక్కడ ఇచ్చిన అన్ని ముఖ్యమైన అంశాలను జాగ్రత్తగా చదవాలి.

హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్ (HCL).. జూనియర్‌ మేనేజర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానించింది. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు HCL అధికారిక వెబ్‌సైట్ hindustancopper.com ద్వారా అప్లయ్ చేసుకోవచ్చు. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ జూలై 1 నుంచి ప్రారంభం కానుంది. HCL  ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ కింద మొత్తం 56 పోస్టులను భర్తీ చేయనుంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులెవరైనా జూలై 21వ తేదీలోగా లేదా అంతకు ముందు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు కింద ఇచ్చిన అన్ని ముఖ్యమైన అంశాలను జాగ్రత్తగా చదవాలి.

వయోపరిమితి

దరఖాస్తు చేసుకునే అభ్యర్థులందరి వయోపరిమితి 40 ఏళ్లు మించకూడదు.

విద్యార్హత

ఈ రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తప్పనిసరిగా అధికారిక నోటిఫికేషన్‌లో ఇవ్వబడిన సంబంధిత విద్యార్హతలను కలిగి ఉండాలి.

 దరఖాస్తు రుసుము

జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలకు చెందిన అభ్యర్థులు దరఖాస్తు రుసుముగా రూ.500 చెల్లించాలి. అయితే ఇతర కేటగిరీల అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుండి మినహాయింపు ఉంది. దరఖాస్తు రుసుము గేట్‌వే/NEFT ఆన్‌లైన్ ట్రాన్స్ ఫర్ ద్వారా చెల్లించబడుతుంది.

జీతం

ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 30,000 నుండి రూ. 120,000 వరకు జీతం చెల్లించబడుతుంది.

అప్లికేషన్ లింక్, నోటిఫికేషన్‌ను ఇక్కడ చూడండి

నోటిఫికేషన్ 

అప్లికేషన్ 

ఎంపిక ఇలా 

అధికారిక నోటిఫికేషన్ ప్రకారం ఈ పోస్టులకు దరఖాస్తు చేస్తున్న అభ్యర్థులందరూ పరీక్ష, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ ధృవీకరణ ఆధారంగా ఎంపిక చేయబడతారు.



రాత పరీక్ష లేకుండానే ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో ఉద్యోగాలు..మంచి శాలరీ

 రక్షణ మంత్రిత్వ శాఖలో ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న యువతకు గుడ్ న్యూస్.

రక్షణ మంత్రిత్వ శాఖలో ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న యువతకు గుడ్ న్యూస్. మహారాష్ట్రలోని భండారాలోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ వివిధ ట్రేడ్‌లలో అప్రెంటిస్‌షిప్ పోస్టుల కోసం ఖాళీలను విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ddpdoo.gov.in  ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా మొత్తం 49 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆసక్తి ఉన్నవారు జూలై 13లోగా లేదా అంతకు ముందు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేయడానికి ముందు క్రింద ఇచ్చిన పాయింట్‌లను జాగ్రత్తగా చదవండి.

దరఖాస్తు చేసుకోవడానికి అర్హత

గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌షిప్- అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి ఇంజనీరింగ్ లేదా టెక్నాలజీలో గ్రాడ్యుయేట్ కలిగి ఉండాలి. రెగ్యులర్ మోడ్ ద్వారా గ్రాడ్యుయేట్ (ఇంజనీరింగ్) పూర్తి చేసిన అభ్యర్థులు మాత్రమే అప్రెంటిస్‌షిప్‌కు అర్హులు.

టెక్నీషియన్ అప్రెంటిస్‌షిప్- అభ్యర్థి తప్పనిసరిగా స్టేట్ కౌన్సిల్ లేదా బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇంజనీరింగ్ లేదా టెక్నాలజీలో డిప్లొమా కలిగి ఉండాలి.

వయోపరిమితి

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థుల కనీస వయోపరిమితి 14 సంవత్సరాలు, గరిష్ట వయోపరిమితి లేదు.

జీతం

గ్రాడ్యుయేట్, జనరల్ స్ట్రీమ్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌షిప్ - నెలకు రూ. 9,000

టెక్నీషియన్ అప్రెంటిస్‌షిప్ - నెలకు రూ. 8,000

నోటిఫికేషన్, అప్లికేషన్ లింక్‌ని ఇక్కడ చూడండి

నోటిఫికేషన్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

అప్లికేషన్ లింక్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

ఎంపిక ప్రక్రియ

ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో గ్రాడ్యుయేట్, టెక్నీషియన్, జనరల్ స్ట్రీమ్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌షిప్ ఎంపిక ప్రక్రియ మెరిట్ ఆధారంగా ఉంటుంది. అభ్యర్థులు వారి చివరి సంవత్సరం పరీక్షలో (అన్ని సంవత్సరాల మొత్తం) పొందిన మార్కుల ఆధారంగా  అంచనా వేయబడతారు. డాక్యుమెంట్ వెరిఫికేషన్ తర్వాత ఎంపికైన అభ్యర్థులకు మెడికల్ టెస్ట్, పోలీస్ వెరిఫికేషన్ నిర్వహిస్తారు.



APPSC ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఫలితాలు .. లింక్ ఇక్కడే!

 APPSC ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఫలితాలు విడుదల చేసారు. దీనికి సంబందించిన నోటిఫికేషన్ సెప్టెంబర్ 2022 న 269 పోస్టులతో విడుదల చేసారు. ఫలితాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి



TSPSC అగ్రికల్చర్ ఆఫీసర్ ప్రోవిషనల్ సెలక్షన్ లిస్ట్ విడుదల .. లింక్ ఇక్కడే!

 TSPSC అగ్రికల్చర్ ఆఫీసర్ ప్రోవిషనల్ సెలక్షన్ లిస్ట్ విడుదల చేసారు. దీనికి సంబదించిన నోటిఫికేషన్ డిసెంబర్ 2022 న 148 పోస్టులకు విడుదల చేసారు. ప్రోవిషనల్ సెలక్షన్ లిస్ట్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి. 



ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ ఎయిర్‌మెన్ (గ్రూప్ Y) ఇన్టేక్ (01/2025) అడ్మిట్ కార్డ్ 2024 – అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్ లింక్ ఇక్కడే!

 ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ ఎయిర్‌మెన్ (గ్రూప్ Y) ఇన్టేక్ (01/2025) అడ్మిట్ కార్డ్ 2024 విడుదల చేసారు. దీనికి సంబందించిన నోటిఫికేషన్ మే 2024 న విడుదల చేసారు. అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్ లింక్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి



ఎయిర్ ఇండియా ఎయిర్ ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్ లో ఉద్యోగ ఖాళీలకు నోటిఫికేషన్.. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక

 ఎయిర్ ఇండియా ఎయిర్ ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్ లో 63 ఉద్యోగ ఖాళీలకు నోటిఫికేషన్ విడుదలైనది. నోటిఫికేషన్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి



Wednesday, 26 June 2024

గ్రామీణ బ్యాంకుల్లో 10వేల క్లర్క్,PO పోస్టులు..వెంటనే అప్లయ్ చేసుకోండి

 క్లర్క్ పోస్టుకు వయస్సు 18 నుండి 28 సంవత్సరాల మధ్య ఉండాలి.

ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పర్సనల్ బ్యాంకింగ్ సెలక్షన్ (IBPS)దేశంలోని ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల్లో దాదాపు 10వేల క్లర్క్, PO పోస్టుల భర్తీ కోసం ఇప్పటికే నోటిఫికేషన్ రిలీజ్ అవగా…దరఖాస్తు చేయడానికి రేపే(జూన్ 27) చివరి తేదీ. IBPS వెబ్‌సైట్ ibps.in ద్వారా ఈ పోస్టులకు అప్లయ్ చేసుకోవాలి. నోటిఫికేషన్ ప్రకారం, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల్లో మల్టీపర్పస్ ఆఫీస్ అసిస్టెంట్ 5585 పోస్టులు, ఆఫీసర్ స్కేల్-1 పోస్టులు 3499 ఖాళీలు ఉన్నాయి. ఈ రిక్రూట్‌మెంట్ పరీక్ష ఆగస్టు 3వ తేదీ నుండి 18వ తేదీ వరకు నిర్వహించబడుతుంది. లేటెస్ట్ అప్ డేట్ ల కోసం వెబ్‌సైట్‌ని చెక్ చేస్తూ ఉండండి.

దరఖాస్తు రుసుము

దరఖాస్తు రుసుము రూ. 850. అయితే SC/ST,శారీరక వికలాంగ అభ్యర్థులు కేవలం 175 రూపాయలు మాత్రమే చెల్లించాలి. దరఖాస్తు రుసుము చెల్లించడానికి చివరి తేదీ జూన్ 27.

అర్హత

ఆఫీస్ అసిస్టెంట్ అంటే క్లర్క్, ఆఫీసర్ (PO) పోస్టులకు అభ్యర్థులు బ్యాచిలర్ డిగ్రీని కలిగి ఉండాలి. ఆఫీసర్ పోస్టులకు బ్యాచిలర్ డిగ్రీ సంబంధిత సబ్జెక్టులో ఉండాలి. పూర్తి సమాచారం కోసం ఈ లింక్ క్లిక్ చేసి నోటిఫికేషన్ చూడండి.

వయోపరిమితి

క్లర్క్ పోస్టుకు వయస్సు 18 నుండి 28 సంవత్సరాల మధ్య ఉండాలి. అయితే ఆఫీసర్ కేటగిరీ పోస్టులకు ఇది భిన్నంగా ఉంటుంది.

ఎన్ని బ్యాంకుల్లో క్లర్క్‌లు, పీఓల నియామకం ఉంటుంది?

దేశంలోని 43 ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులలో ఈ పోస్టుల భర్తీ జరుగుతుంది. వీటిలో కొన్ని ప్రధాన బ్యాంకుల పేర్లు కింద చూడండి

పంజాబ్ నేషనల్ బ్యాంక్

బ్యాంక్ ఆఫ్ బరోడా

కెనరా బ్యాంక్

ఇండియన్ బ్యాంక్

బ్యాంక్ ఆఫ్ ఇండియా

సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్

పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్

UCO బ్యాంక్

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర

ముఖ్యమైన లింక్స్ 

ఆఫీస్ అసిస్టెంట్ 

ఆఫీసర్ స్కేల్ I, II, III 

నోటిఫికేషన్ 



NMDC లిమిటెడ్ లో ఉద్యోగాలు.. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక

 NMDC లిమిటెడ్ లో 197 ట్రేడ్ అప్రెంటిస్ ఉద్యోగ ఖాళీలకు నోటిఫికేషన్ విడుదల చేసారు. ఇంటర్వ్యూ లు జులై 01 నుండి జులై 09 వరకు జరుగును. నోటిఫికేషన్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి





CRPF కానిస్టేబుల్ హాల్ టికెట్ విడుదల.. డౌన్లోడ్ లింక్ ఇక్కడే!

 CRPF కానిస్టేబుల్ హాల్ టికెట్ విడుదల చేసారు. దీనికి సంబందించిన నోటిఫికేషన్ మార్చ్ 2023 న 9360 ఉద్యోగ ఖాళీలతో విడుదల చేసారు. అడ్మిట్ కార్డు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి. వెబ్ నోటీసు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి. ఎక్సమ్ డేట్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి



Tuesday, 25 June 2024

TSPSC AO, JAO, సీనియర్ అకౌంటెంట్ ప్రొవిజినల్ సెలక్షన్ లిస్ట్ విడుదల .. లింక్ ఇక్కడే!

 TSPSC AO, JAO, సీనియర్ అకౌంటెంట్ ప్రొవిజినల్ సెలక్షన్ లిస్ట్ విడుదల విడుదల చేసారు. ప్రొవిజినల్ సెలక్షన్ లిస్ట్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి. వెబ్ నోటీసు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి



SSC CHSL (10 + 2) అడ్మిట్ కార్డు విడుదల.. డౌన్లోడ్ లింక్ ఇక్కడే!

 SSC CHSL (10 + 2) అడ్మిట్ కార్డు విడుదల చేసారు. దీనికి సంబందించిన నోటిఫికేషన్ ఏప్రిల్ 2024 న 3712 ఖాళీలతో విడుదల చేసారు. అడ్మిట్ కార్డు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి



ఆంధ్రప్రదేశ్ టెట్ ఫలితాలు విడుదల .. లింక్ ఇక్కడే!!

 ఆంధ్రప్రదేశ్ టెట్ ఫలితాలు విడుదల చేసారు. ఎక్సమ్ ఫలితాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి (లింక్ 1). ఎక్సమ్ ఫలితాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి (లింక్ 2)



రైల్వేలో భారీగా ఉద్యోగాలు.. ఇంటర్ పాసైతే చాలు అప్లయ్ చేసుకోవచ్చు!

 భారతీయ రైల్వేలో ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న యువతకు భారీ శుభవార్త. ఇండియన్ రైల్వే బోర్డు త్వరలో నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ (RRB NTPC) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయనుంది. దీని ద్వారా భారతీయ రైల్వేలో క్లర్క్, టైపిస్ట్, అకౌంటెంట్ కమ్ టైపిస్ట్, జూనియర్ టైమ్ కీపర్, ట్రైన్ క్లర్క్, కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ వంటి వివిధ పోస్టులపై బంపర్ రిక్రూట్‌మెంట్ ఉంటుంది. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ ఎగ్జామ్ క్యాలెండర్ 2024 ప్రకారం, RRB NTPC రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ జూలై-సెప్టెంబర్‌లో విడుదల చేయబడుతుంది. జూలై నుండి సెప్టెంబర్ వరకు దరఖాస్తుకు సమయం ఇవ్వబడుతుంది. అక్టోబర్‌లో పరీక్షలు నిర్వహించాల్సి ఉండగా.. అయితే దీనికి సంబంధించి ఇంకా ఎలాంటి నోటిఫికేషన్ రాలేదు.

ఈ పోస్టలకు విద్యార్హత

ఇంటర్మీడియట్ లేదా 12వ తరగతి పాసైన వాళ్లు, గ్రాడ్యేయేషన్ పూర్తైన వాళ్లు RRB NTPC పోస్టులకు అప్లయ్ చేసుకోవచ్చు. జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్, జూనియర్ టైప్ కీపర్, ట్రైన్ క్లర్క్, కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ పోస్టుల కోసం గుర్తింపు పొందిన బోర్డు నుండి 12వ తరగతి లేదా ఇంటర్మీడియట్ పాసై ఉండాలి. అయితే ట్రాఫిక్ అసిస్టెంట్, గూడ్స్ గార్డ్, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ సహా ఇతర పోస్టులకు గ్రాడ్యుయేషన్ డిగ్రీని కలిగి ఉండాలి.

వయోపరిమితి

అభ్యర్థులు 18-30 సంవత్సరాల మధ్యలో ఉండాలి. రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులకు నిబంధనల ప్రకారం గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఇవ్వబడుతుంది.

ఎంపిక ప్రక్రియ

అభ్యర్థులను నాలుగు దశల్లో ఎంపిక చేస్తారు.

స్టేజ్-1: కంప్యూటర్ బెస్ట్ టెస్ట్ (CBT-1)

స్టేజ్-2: కంప్యూటర్ బెస్ట్ టెస్ట్ (CBT-2)

స్టేజ్-3: కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ లేదా టైపింగ్ టెస్ట్

దశ-4: డాక్యుమెంట్స్ వెరిఫికేషన్

పరీక్ష నమూనా

CBT-1: CBT-1 పరీక్షలో 100 మార్కుల 100 ప్రశ్నలు అడుగుతారు. ఇందులో మ్యాథమెటిక్స్ , రీజనింగ్ నుండి 30 ప్రశ్నలు, జనరల్ అవేర్‌నెస్ నుండి 40 ప్రశ్నలు అడుగుతారు. 1 గంట 30 నిమిషాల సమయంలో ఎగ్జామ్ పూర్తి చేయాలి.

CBT-2: CBT-2లో 120 మార్కులకు 120 ప్రశ్నలు అడుగుతారు. ఇందులో మ్యాథమెటిక్స్‌, రీజనింగ్‌ నుంచి 70 ప్రశ్నలు, జనరల్‌ అవేర్‌నెస్‌, జనరల్‌ ఇంటెలిజెన్స్‌ నుంచి 50 ప్రశ్నలు అడుగుతారు.

జీతం

పోస్ట్ ప్రకారం జీతం ఇవ్వబడుతుంది. జూనియర్‌ జూనియర్‌ క్లర్క్‌ కమ్‌ టైపిస్ట్‌, అకౌంట్స్‌ క్లర్క్‌ కమ్‌ టైపిస్ట్‌ ప్రాథమిక వేతనం నెలకు రూ.19,9000. కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ జీతం రూ.21,700, ట్రాఫిక్ అసిస్టెంట్ రూ.25,500, సీనియర్ టైమ్ కీపర్ రూ.29,200. ఈ సమాచారం గతేడాది నోటిఫికేషన్‌పై ఆధారపడి ఉంది.

ఎన్ని పోస్టులు భర్తీ చేస్తారు

RRB NTPC ద్వారా వేల సంఖ్యలో పోస్టులు రిక్రూట్ అవుతున్నాయి. RRB NTPC 2022 ద్వారా 35281 ఖాళీలను నియమించారు.



ఏపీ మెగా డీఎస్సీ పోస్టులు.. జిల్లాల వారీగా ఖాళీలివే

 ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో మెగా డీఎస్సీ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా జిల్లాల వారీగా ఖాళీల వివరాలు బయటకొచ్చాయి.

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో కొత్తగా కొలువుదీరిన టీడీపీ ప్రభుత్వం ప్రజలకు వరుసపెట్టి శుభవార్తలు చెబుతోంది. ప్రజా సంక్షేమం, స్టూడెంట్స్ భవితవ్యంపై ప్రధానంగా దృష్టి సారించిన చంద్రబాబు సర్కార్.. వచ్చి రావడంతోనే మెగా డీఎస్సీ అనౌన్స్ చేసింది.
సీఎం కుర్చీలో కూర్చున్న వెంటనే చంద్రబాబు ఐదు ఫైళ్లపై సంతకాలు చేసిన సంగతి తెలిసిందే. ఇందులో ప్రధానమైన అంశంగా మెగా డీఎస్సీని తీసుకున్నారు. నిన్న (సోమవారం) జరిగిన ఏపీ కేబినెట్ సమావేశంలో మెగా డీఎస్సీకి మంత్రి వర్గం ఆమోదం తెలిపింది.
మెగా డీఎస్సీలో మొత్తం 16,347 ఉపాధ్యాయుల పోస్టుల భర్తీని పూర్తి చేసేలా షెడ్యూల్ రెడీ చేయాలని నిర్ణయం తీసుకుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. జులై ఒకటి నుంచి డీఎస్సీ ప్రక్రియ షురూ చేసి డిసెంబర్ 10లోగా పరీక్షలు పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నారట.
అయితే 16,347 డీఎస్సీ పోస్టులకు జులై 1న పూర్తి షెడ్యూల్ విడుదల చేయనున్నామని ప్రభుత్వం తెలిపింది. జిల్లా, మండల పరిషత్, మున్సిపల్ స్కూళ్లలో 14,066 పోస్టులు ఖాళీగా ఉన్నాయఐ తెలిసింది.
శ్రీకాకుళంలో 543, విజయనగరంలో 583, విశాఖలో 1134, తూర్పు గోదావరిలో 1346, పశ్చిమ గోదావరిలో 1067, కృష్ణాలో 1213, గుంటూరులో 1159, ప్రకాశంలో 672, నెల్లూరులో 673, చిత్తూరులో 1478, కడపలో 709, అనంతపురంలో 811, కర్నూలులో 2678 ఖాళీలు ఉన్నాయి.
ముందుగా TET పరీక్ష నిర్వహించి, ఆ తర్వాత మెగా డీఎస్సీకి నోటిఫికేషన్ ఇవ్వబోతున్నారట. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీ స్టడీ సర్కిళ్లలో వెనుకబడిన తరగతుల విద్యార్థులకు, నిరుద్యోగులకు ఉచితంగా డీఎస్సీ శిక్షణ ఇవ్వడానికి ప్రభుత్వం రెడీ అవుతోంది.


Monday, 24 June 2024

నిరుద్యోగులకు బంపరాఫర్: 17,727 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. అప్లికేషన్ లింక్ ఇక్కడే!

 ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు గుడ్ న్యూస్. కేంద్ర మంత్రిత్వ శాఖలల, వివిధ కేంద్ర సంస్థల్లో గ్రూప్-B, గ్రూప్-C విభాగాల్లోని ఖాళీల భర్తీ కోసం నిర్వహించే కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ ఎగ్జామినేషన్‌-2024 (SSC CGL 2024) నోటిఫికేషన్‌ను స్టాఫ్ సెలక్షన్ కమిషన్(SSC)రిలీజ్ చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా దాదాపు 17,727 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఇందులో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (ASO), సబ్ ఇన్‌స్పెక్టర్ నార్కోటిస్ట్, అప్పర్ డివిజన్ క్లర్క్, టాక్స్ అసిస్టెంట్, అసిస్టెంట్ ఇన్‌స్పెక్టర్ (CGST మరియు సెంట్రల్ ఎక్సైజ్), ఇన్‌స్పెక్టర్, అసిస్టెంట్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫీసర్, సబ్ ఇన్‌స్పెక్టర్ (CBI) వంటి పోస్టులు ఉన్నాయి.

ఏదైనా డిగ్రీ అర్హత ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లయ్ చేసుకోవడానికి అర్హులు. పోస్టులవారీగా అదనపు విద్యార్హతలు నిర్ణయించారు. అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పోస్టుల భర్తీకి జూన్ 24 నుంచి జులై 24 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. SSC అధికారిక వెబ్‌సైట్ https://ssc.gov.in/ ద్వారా అప్లయ్ చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు సెప్టెంబర్‌/ అక్టోబర్‌లో రాత పరీక్షలు ఉంటాయి.  అయితే ఈ పోస్టులకు అప్లయ్ చేసే ముందు పోస్టుల వివరాలు, ఎంపిక ప్రక్రియ,విద్యార్హత తదితర వివరాలు తెలుసుకోవడం ముఖ్యం. వీటన్నింటికి సంబంధించిన సమాచారం ఇక్కడ ఉంది.

పోస్టుల వివరాలు

మొత్తం పోస్టుల సంఖ్య: 17,727

-సబ్ ఇన్‌స్పెక్టర్ (CBI)

-సబ్ ఇన్‌స్పెక్టర్ (NIA)

-ఇన్‌స్పెక్టర్ ( పోస్టల్ శాఖ)

-పోస్టల్ అసిస్టెంట్/సార్టింగ్ అసిస్టెంట్ (పోస్టల్)

-ఇన్‌స్పెక్టర్ ( నార్కోటిక్స్)

-ఇన్‌స్పెక్టర్ - ఇన్‌కమ్ ట్యాక్స్

-అసిస్టెంట్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫీసర్

- అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్

-అసిస్టెంట్

- ఇన్‌స్పెక్టర్ (సీజీఎస్టీ & సెంట్రల్ ఎక్సైజ్)

- ఇన్‌స్పెక్టర్ (ప్రివెంటివ్ ఆఫీసర్)

-ఇన్‌స్పెక్టర్ (ఎగ్జామినర్)

- అసిస్టెంట్/అసిస్టెంట్ సూపరింటెండెంట్

-ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ (CBIC)

-డివిజనల్ అకౌంటెంట్ (కాగ్)

- రిసెర్చ్ అసిస్టెంట్ (NHRC)

- సబ్ ఇన్‌స్పెక్టర్/ జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ (NCB)

-జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ (స్టాటిస్టిక్స్)

ముఖ్యమైన లింక్స్ 

రిజిస్ట్రేషన్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి 

లాగిన్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి 

నోటిఫికేషన్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి 

అధికారిక వెబ్సైటు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి 



గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ ఇన్ ది స్టేట్ అఫ్ తెలంగాణ ప్రొవిజినల్ సెలక్షన్ లిస్ట్ విడుదల..

 గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ ఇన్ ది స్టేట్ అఫ్ తెలంగాణ ప్రొవిజినల్ సెలక్షన్ లిస్ట్ విడుదల చేసారు. దీనికి సంబందించిన నోటిఫికేషన్ డిసెంబర్ 2022 లో 32 ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయడానికి విడుదల చేసారు. 

ప్రోవిషనల్ సెలక్షన్ లిస్ట్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి 

నోటీసు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి 

సి.వి.  డేట్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి 

లిస్ట్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి




హైదరాబాద్ నిమ్స్ లో ఉద్యోగాలు.. నెలకు రూ.1 లక్ష పైనే జీతం

 హైదరాబాద్‌లోని నిజాం ఇన్ డిగ్రీ ఆఫ్ మెడికల్ సైన్సెస్(NIMS)సీనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 51 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు అప్లయ్ చేయడానికి చివరి తేదీ జూన్ 26,2024. అయితే ఈ పోస్టులకు అప్లయ్ చేసేముందు విద్యార్హత,జీతం,ఎంపిక ప్రక్రియ తదితర వివరాలు తెలుసుకోవడం ముఖ్యం. దీనికి సంబంధించిన వివరాలను ఇక్కడ చూడండి.

పోస్టుల వివరాలు

సీనియర్ రెసిడెంట్: 51 పోస్టులు

విభాగాలు: న్యూరాలజీ, రేడియేషన్ అంకాలజీ,మైక్రోబయాలజీ, జనరల్ మెడిసిన్, పాథాలజీ,రేడియాలజీ అండ్ ఇమేజియాలజీ, అనస్థీషియాలజీ అండ్ క్రిటికల్ కేర్, గైనకాలజీ, వైద్య ఇమ్యునాలజీ, ఎండోక్రైనాలజీ, మెడికల్ జెనెటిక్స్, హేమటాలజీ

విద్యార్హత

సంబంధిత స్పెషాలిటీలో MD/MS/DNB ఉత్తీర్ణులై ఉండాలి.

జీతం

నెలకు రూ.1,21,641.

ఎంపిక ప్రక్రియ

ఇంటర్వ్యూ, డాక్యుమెంట్స్ పరిశీలన ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం

ఆఫ్‌లైన్‌ దరఖాస్తులను డీన్, నిమ్స్, పంజాగుట్ట, హైదరాబాద్‌ చిరునామాకు పంపించాలి.

అప్లికేషన్ ఫీజు

రూ. 500

నోటిఫికేషన్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి 



కాటన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియాలో ఉద్యోగాలు.. నెలకు రూ.1.40 లక్షల జీతం

 కాటన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (CCI)లిమిటెడ్‌ లో 214 పోస్టులను భర్తీ కోసం నోటిఫికేషన్ రిలీజ్ అయింది. నిరుద్యోగులకు గుడ్ న్యూస్. నవీ ముంబైలోని ప్రభుత్వ రంగ సంస్థ కాటన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (CCI)లిమిటెడ్‌ లో 214 పోస్టులను భర్తీ కోసం నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా అసిస్టెంట్‌ మేనేజర్, మేనేజ్‌మెంట్‌ ట్రెయినీ, జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు జూన్ 12న ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాగా..అప్లయ్ చేయడానికి చివరి తేదీ జులై 2,2024. సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, సీఏ/ సీఎంఏ, బీఎస్సీ, బీకాం, లా డిగ్రీ, ఎంబీఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.  అయితే ఈ పోస్టులకు అప్లయ్ చేసే ముందు పోస్టుల వివరాలు, ఎంపిక ప్రక్రియ,విద్యార్హత తదితర వివరాలు తెలుసుకోవడం ముఖ్యం. వీటన్నింటికి సంబంధించిన సమాచారం ఇక్కడ ఉంది. 

పోస్టుల వివరాలు

-జూనియర్‌ కమర్షియల్‌ ఎగ్జిక్యూటివ్‌ - 120 పోస్టులు: 50 శాతం మార్కులతో బీఎస్సీ అగ్రికల్చర్‌ ఉత్తీర్ణత. ఎస్సీ/ఎస్టీ/ దివ్యాంగులు 45 శాతం మార్కులు సాధించాలి.

-జూనియర్‌ అసిస్టెంట్‌ (అకౌంట్స్‌) - 40 పోస్టులు: 50 శాతం మార్కులతో బీకాం డిగ్రీ ఉత్తీర్ణత. ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులు 45 శాతం మార్కులు సాధించాలి.

-జూనియర్‌ అసిస్టెంట్‌ (జనరల్‌)- 20పోస్టులు: బీఎస్సీ అగ్రికల్చర్‌ డిగ్రీ 50 శాతం మార్కులతో పాసవ్వాలి. ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులు 45 శాతం మార్కులు సాధించాలి.

-మేనేజ్‌మెంట్‌ ట్రెయినీ (అకౌంట్స్‌)- 20 పోస్టులు: సీఏ లేదా సీఎంఏ పాస్ అవ్వాలి

-మేనేజ్‌మెంట్‌ ట్రెయినీ (మార్కెటింగ్‌)- 11 పోస్టులు : అగ్రికల్చర్‌ మేనేజ్‌మెంట్‌లో ఎంబీఏ/ ఎంబీఏతో సమానమైన వ్యవసాయ సంబంధిత మేనేజ్‌మెంట్‌ కోర్సు పూర్తిచేయాలి.

-జూనియర్‌ అసిస్టెంట్‌ (హిందీ ట్రాన్స్‌లేటర్‌): 01 పోస్టు: డిగ్రీ (హిందీ)/ పీజీ డిగ్రీ (హిందీ). ఇంగ్లిష్ ఒక సబ్జెక్టుగా చదివి ఉండాలి. హిందీ, ఇంగ్లిష్ ట్రాన్స్‌లేషన్ తెలిసి ఉండాలి. సంస్కృతంతోపాటు ఇతర భారతీయ భాషలపై అవగాహన ఉండాలి. జర్నలిజం, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అనుభవం ఉండాలి.

-అసిస్టెంట్‌ మేనేజర్‌(అఫీషియల్‌ లాంగ్వేజ్‌): 01 పోస్టు:  కనీసం 50 శాతం మార్కులతో పీజీ డిగ్రీ (హిందీ) కలిగి ఉండాలి. డిగ్రీ వరకు ఇంగ్లిష్ ఒక సబ్జెక్టుగా చదివి ఉండాలి. హిందీ ట్రాన్స్‌లేషన్ అర్హత ఉన్నవారికి ప్రాధ్యాన్యమిస్తారు.కనీసం ఏడాది పని అనుభవం ఉండాలి.

-అసిస్టెంట్‌ మేనేజర్‌ (లీగల్‌): 01 పోస్టు: కనీసం 50 శాతం మార్కులతో న్యాయశాస్త్రంలో డిగ్రీ (3 సంవత్సరాలు లేదా 5 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ లా కోర్సు) కలిగి ఉండాలి. అడ్వొకేట్‌గా కనీసం ఏడాది పనిచేసిన అనుభవం ఉండాలి. లేదా ఏదైనా న్యాయసేవా సంస్థల్లో పనిచేసిన అనుభవం ఉండాలి.

వయోపరిమితి

అసిస్టెంట్‌ మేనేజర్‌ పోస్టుకు 32 ఏళ్లు, ఇతర పోస్టులకు 30 ఏళ్లు మించకూడదు. గరిష్ఠ వయసులో ఎస్సీ/ ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీ (NCL)కు మూడేళ్లు, PWBDలకు 10 నుంచి 15 ఏళ్లు, ఎక్స్‌ సర్వీస్‌మెన్‌కు మూడేళ్ల సడలింపు ఉంటుంది.

దరఖాస్తు ఫీజు

జనరల్ అభ్యర్థులు రూ.1500; ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్ సర్వీస్‌మెన్‌ అభ్యర్థులు రూ.500 చెల్లించాలి.

దరఖాస్తు విధానం

ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఎంపిక విధానం

రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

పరీక్ష కేంద్రాలు

ముంబై,నవీ ముంబై, హైదరాబాద్, న్యూఢిల్లీ, చెన్నై, లక్నో, చండీగఢ్‌, కోల్‌కతా, బెంగళూరు, అహ్మదాబాద్, పాట్నా, జైపూర్.

జీతం

అసిస్టెంట్‌ మేనేజర్‌ పోస్టుకు నెలకు రూ.40,000- రూ.1,40,000. మేనేజ్‌మెంట్‌ ట్రైనీ పోస్టులకు రూ.30,000- రూ.1,20,000. ఇతర పోస్టులకు రూ.22,000-రూ.90,000.

అప్లై ఆన్లైన్ మరియు నోటిఫికేషన్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి 



Telangana Jobs: నిరుద్యోగులకు మరో శుభవార్త.. ఆ ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం..

  తెలంగాణ నిరుద్యోగులకు మరో భారీ శుభవార్త. జిల్లా వైద్యారోగ్య శాఖలో పలు ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. దీనికి సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ఇటీవల హైదరాబాద్ జిల్లా వైద్యఆరోగ్యశాఖ పరిధిలోని జాతీయ హెల్త్‌ మిషన్‌ ద్వారా పలు పీహెచ్‌సీల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేశారు. కలెక్టర్‌ రాజర్షి షా సమక్షంలో కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో అభ్యర్థులకు కౌన్సెలింగ్‌ నిర్వహించి పోస్టింగ్‌ ఉత్తర్వులు అందజేశారు. మెరిట్‌, రోస్టర్‌ ప్రతిపాదికన పోస్టింగ్‌ కల్పించారు. ఇక కొత్తగా ఏర్పడిని ఖాళీలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. దీనిలో వైద్యాధికారులు 5, ఫార్మసిస్ట్‌లు 3, స్టాఫ్‌ నర్స్‌లు 27, ఏఎన్‌ఏంలు 13, రేడియోగ్రాఫర్‌ 1, సైకియాట్రిస్ట్‌ 1, ఫిజియో థెరపిస్ట్‌ 1, వీసీసీఎం 1, ఆయుష్‌ మెడికల్‌ ఆఫీసర్‌ ఒకటి చొప్పున పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం ఈ నోటిఫికేషన్ ద్వారా 52 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.



Sunday, 23 June 2024

రేపు మెగా జాబ్ మేళా.. ఎలాంటి విద్యార్హత లేని వారు కూడా అర్హులు..

 ఈ నెల 24న హుస్నాబాద్ లో జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఈ జాబ్ మేళాలో సుమారు 5 వేల మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ఈ నెల 24న హుస్నాబాద్ లో జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఈ జాబ్ మేళాలో సుమారు 5 వేల మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ఈ నెల 24వ తేదీన హుస్నాబాద్ లో నిర్వహించే జాబ్ మేళాను నిరుద్యోగ యువతీ, యువకులు సద్వినియోగపరుచుకోవాలని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. ఈ జాబ్ మేళా కార్యక్రమంలో సుమారు 5 వేల మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామన్నారు. ఇటీవల హుస్నాబాద్ పట్టణంలోని తిరుమల గార్డెన్స్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బీసీ సంక్షేమ, రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ జాబ్ మేళా పోస్టర్‌ను ఆవిష్కరించారు . జాబ్ మేళా ద్వారా 5 వేల మందికి పైగా ఉపాధి కల్పించేందుకు యువజన సర్వీసుల శాఖ ప్రణాళికలు సిద్ధం చేసిందన్నారు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు చదివిన యువత జాబ్ మేళాలో ప్రవేశించి సరైన సంస్థతో సరైన అవకాశాన్ని పొందవచ్చని ప్రభాకర్ అన్నారు. ఎలాంటి విద్యార్హత లేని వారు కూడా ఈ జాబ్ మేళాకు హాజరు కావచ్చన్నారు. యువతకు లాభసాటి ఉద్యోగాలు దొరుకుతున్న విదేశాల్లో ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం నైపుణ్యాన్ని పెంపొందించే శిక్షణను కూడా ఇస్తుందని చెప్పారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నియోజక వర్గంలోని యువత అధిక సంఖ్యలో జాబ్ మేళాలో పాల్గొనాలని మంత్రి పిలుపునిచ్చారు. 



Job Mela: రూ.2 లక్షల జీతంతో జాబ్.. ఈ ఛాన్స్ మిస్ అవ్వొద్దు..

 సోమవారం జేకేసీ ఆధ్వర్యంలో ఉద్యోగమేళా నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ డాక్టర్ ఎం.శ్రీలత తెలిపారు. ఈ మేరకు శని వారం ఒక ప్రకటన విడుదల చేశారు. 

డిగ్రీలో సైన్స్ విభాగంలో మూడు కోర్స్ ల్లో పట్టు ఉన్నవారు ఈ జాబ్ మేళాకు అర్హులుగా తెలిపారు. ఇందులో జాబ్ వరిస్తే మంచి సంవత్సర ప్యాకేజ్ ఉంటుందని తెలిపారు. మహిళా మిల్క్ ప్రొడ్యూసర్ కంపెనీ అనేది. ఉమ్మడి జిల్లాలో మంచి మార్క్ ఉన్న కంపెనీ గా పేరొందినది. తిరుపతి జిల్లాలో ఉన్న నిరుద్యోగులకు మంచి సువర్ణావకాశం అని చెప్పవచ్చు. మంచి నెల వేతనాలు కూడ ఉంటాయన్నారు.

కానీ ఒక్కటే డిగ్రీలో కచ్చితంగా కెమెస్ట్రీ, బయాలజీ, బి ఎస్సి చదివిన వారికి అర్హులుగా తెలిపారు. శ్రీకాళహస్తి పట్టణంలోని ప్రభుత్వ పురుషులడిగ్రీ కళాశాలలో సోమవారం జేకేసీ ఆధ్వర్యంలో ఉద్యోగమేళా నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ డాక్టర్ ఎం.శ్రీలత తెలిపారు. ఈ మేరకు శని వారం ఒక ప్రకటన విడుదల చేశారు. తిరుపతికి చెందిన శ్రీజ మహిళా మిల్క్ ప్రొడ్యూసర్ కంపె నీలో జూనియర్ ఎగ్జిక్యూటివ్ కోసం డిగ్రీ బీఎస్సీ, కెమిస్ట్రీ, మైక్రో బయాలజీ చదివి, రెండేళ్లు అనుభవం గల పురుషులు అవసరమని, వారికి టూ వీలర్ డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరిగా ఉండాలని తెలిపారు.

వార్షిక వేతనం రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు ఉంటుందని, ఇతర అలవెన్సులు కూడా ఉంటాయని పేర్కొ న్నారు. అదేవిధంగా ఎన్ఎస్ ఇన్స్ట్రూమెంట్స్ ప్రయివేట్ లిమిటెడ్ లో ఉద్యోగాలకు ఇంట ర్వ్యూలు నిర్వహించనున్నట్లు తెలిపారు. మరిన్ని వివరాలకు 8074461722, 94405023385 ఈ నంబర్లలో సంప్రదించాలని కోరారు.



హైదరాబాద్ లో ఉచితంగా సివిల్స్ కోచింగ్.. వసతి,ఖర్చులకు కూడా డబ్బులిస్తారు

 మనదేశంలో అత్యంత కఠినమైన పరీక్షలో యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ (UPSC Civil Services)ఎగ్జామ్ ఒకటి. సివిల్స్ క్లియర్ చేసినోళ్లు దేశవ్యాప్తంగా అడ్మినిస్ట్రేటివ్, పోలీస్ సర్వీసెస్‌లో ఉద్యోగాల్లో చేరతారు. అయితే సివిల్స్ కోచింగ్ ప్రస్తుతం భారీ ఖర్చుతో కూడుకున్న వ్యవహారంగా మారింది. దీంతో పేద విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్‌లోని తెలంగాణ స్టేట్ ఎంప్లాయిబిలిటీ స్కిల్ డెవలప్‌మెంట్ అండ్ ట్రైనింగ్ సెంటర్(TSBCESDTC)ఆధ్వర్యంలో టీఎస్ బీసీ స్టడీ సర్కిల్.. సివిల్ సర్వీస్(ప్రిలిమ్స్,మెయిన్స్)ఎగ్జామ్ కి సంబంధించి ఉచిత కోచింగ్ అందిస్తోంది. అర్హులైన బీసీ, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు జులై 3వ తేదీలోగాఅప్లయ్ చేసుకోవచ్చు. ఎంపికైనవారికి ఫ్రీ కోచింగ్ తో పాటు వసతి, భోజన ఖర్చుల కింద రూ.5000, బుక్‌ఫండ్‌ రూ.5000 అందజేస్తారు.

అర్హత

ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థి వార్షిక ఆదాయం రూ.5.00 లక్షలు మించకూడదు. వయసు 32 ఏళ్ల లోపు ఉండాలి

సీట్లు

మొత్తం 150మందికి ఫ్రీ కోచింగ్ ఉంటుంది. ఈ 150 మందిలో బీసీలకు 75%, ఎస్సీలకు 15%, ఎస్టీలకు 5%, ఇతరులకు 5% సీట్లను కేటాయించారు. ఇందులో 100 మందిని ఆన్‌‌లైన్ ఎగ్జామ్ ద్వారా ఎంపికచేస్తారు. మిగతా 50 సీట్లు సివిల్స్‌ ఫ్రిలిమ్స్‌ ఉత్తీర్ణులైన అభ్యర్థులకు కేటాయిస్తారు.

కోచింగ్ తేదీలు

18.07.2024 నుంచి 18-04-2025 వరకు.

ఎంపిక విధానం

ప్రవేశ పరీక్ష, రిజర్వేషన్ రూల్ ఆధారంగా.

స్థలం

టీజీ బీసీ స్టడీ సర్కిల్, లక్ష్మీనగర్ కాలనీ, సైదాబాద్, హైదరాబాద్.

గుర్తుంచుకోవాల్సిన తేదీలు

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 03-07-2024.

ప్రవేశ పరీక్ష నిర్వహణ తేదీ: 07-07-2024.

పరీక్ష ఫలితాల వెల్లడి: 10-07-2024.

క్లాస్ ల ప్రారంభం : 18-07-2024.



Saturday, 22 June 2024

CSIR-CASE సెక్షన్ ఆఫీసర్ అండ్ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ స్టేజి II ఎక్సమ్ తేదీలు

 CSIR-CASE సెక్షన్ ఆఫీసర్ అండ్ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ స్టేజి II ఎక్సమ్ తేదీ జులై 07, 2024 న జరుగును. మరింత సంచారం కొరకు ఇక్కడ క్లిక్ చేయండి



నాన్ మాథ్స్ స్టూడెంట్స్ కి అర్ధమయ్యే విధంగా క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ పిడిఎఫ్ ఫైల్స్ ఫ్రీ డౌన్లోడ్

 నాన్ మాథ్స్ స్టూడెంట్స్ కి శుభవార్త.. నాన్ మాథ్స్ వారికీ సులభంగా అర్ధం కావడానికి స్టెప్ బై స్టెప్ వివరించడం జరిగింది. ఇక్కడ క్లిక్ చేసి పిడిఎఫ్ ఫైల్స్ ను డౌన్లోడ్ చేసుకోవచ్చు


రిసోనింగ్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి 





Job Alerts and Study Materials