గ్రూప్ -1 మెయిన్స్ పరీక్షల షెడ్యూల్ రిలీజ్ అయింది.
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC)గ్రూప్ -1 మెయిన్స్ పరీక్షల షెడ్యూల్‌ను రిలీజ్ చేసింది. అక్టోబర్ 21వ తేదీ నుంచి 27 వరకు మెయిన్స్ పరీక్షలను నిర్వహించనున్నట్లు TGPSC తెలిపింది. తెలుగు, ఉర్దూ,ఇంగ్లీష్ భాషలలో పరీక్షలు నిర్వహించనున్నారు.
ప్రతి పేపర్ మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు నిర్వహించనున్నారు. కాగా,ఈ నెల 9వ తేదీన గ్రూప్ -1 ప్రిలిమ్స్ పరీక్షను నిర్వహించిన విషయం తెలిసిందే. త్వరలోనే ఫలితాలు వెల్లడి కానున్నాయి.
మెయిన్స్ షెడ్యూల్
అక్టోబర్ 21 – జనరల్ ఇంగ్లీష్(క్వాలిఫయింగ్ టెస్ట్)
అక్టోబర్ 22 – పేపర్ 1(జనరల్ ఎస్సే)
అక్టోబర్ 23 – పేపర్ 2(హిస్టరీ, కల్చర్ అండ్ జియోగ్రఫీ)
అక్టోబర్ 24 – పేపర్ 2 (ఇండియన్ సొసైటీ, రాజ్యాంగం అండ్ గవర్నెన్స్)
అక్టోబర్ 25 – పేపర్ 4(ఎకానమి అండ్ డెవలప్‌మెంట్)
అక్టోబర్ 26 – పేపర్ 5(సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ డాటా ఇంటర్‌ప్రిటేషన్)
అక్టోబర్ 27 – పేపర్ 6(తెలంగాణ మూమెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్)
వెబ్ నోటీసు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
No comments:
Post a Comment