Mother Tongue

Read it Mother Tongue

Tuesday, 25 June 2024

రైల్వేలో భారీగా ఉద్యోగాలు.. ఇంటర్ పాసైతే చాలు అప్లయ్ చేసుకోవచ్చు!

 భారతీయ రైల్వేలో ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న యువతకు భారీ శుభవార్త. ఇండియన్ రైల్వే బోర్డు త్వరలో నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ (RRB NTPC) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయనుంది. దీని ద్వారా భారతీయ రైల్వేలో క్లర్క్, టైపిస్ట్, అకౌంటెంట్ కమ్ టైపిస్ట్, జూనియర్ టైమ్ కీపర్, ట్రైన్ క్లర్క్, కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ వంటి వివిధ పోస్టులపై బంపర్ రిక్రూట్‌మెంట్ ఉంటుంది. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ ఎగ్జామ్ క్యాలెండర్ 2024 ప్రకారం, RRB NTPC రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ జూలై-సెప్టెంబర్‌లో విడుదల చేయబడుతుంది. జూలై నుండి సెప్టెంబర్ వరకు దరఖాస్తుకు సమయం ఇవ్వబడుతుంది. అక్టోబర్‌లో పరీక్షలు నిర్వహించాల్సి ఉండగా.. అయితే దీనికి సంబంధించి ఇంకా ఎలాంటి నోటిఫికేషన్ రాలేదు.

ఈ పోస్టలకు విద్యార్హత

ఇంటర్మీడియట్ లేదా 12వ తరగతి పాసైన వాళ్లు, గ్రాడ్యేయేషన్ పూర్తైన వాళ్లు RRB NTPC పోస్టులకు అప్లయ్ చేసుకోవచ్చు. జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్, జూనియర్ టైప్ కీపర్, ట్రైన్ క్లర్క్, కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ పోస్టుల కోసం గుర్తింపు పొందిన బోర్డు నుండి 12వ తరగతి లేదా ఇంటర్మీడియట్ పాసై ఉండాలి. అయితే ట్రాఫిక్ అసిస్టెంట్, గూడ్స్ గార్డ్, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ సహా ఇతర పోస్టులకు గ్రాడ్యుయేషన్ డిగ్రీని కలిగి ఉండాలి.

వయోపరిమితి

అభ్యర్థులు 18-30 సంవత్సరాల మధ్యలో ఉండాలి. రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులకు నిబంధనల ప్రకారం గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఇవ్వబడుతుంది.

ఎంపిక ప్రక్రియ

అభ్యర్థులను నాలుగు దశల్లో ఎంపిక చేస్తారు.

స్టేజ్-1: కంప్యూటర్ బెస్ట్ టెస్ట్ (CBT-1)

స్టేజ్-2: కంప్యూటర్ బెస్ట్ టెస్ట్ (CBT-2)

స్టేజ్-3: కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ లేదా టైపింగ్ టెస్ట్

దశ-4: డాక్యుమెంట్స్ వెరిఫికేషన్

పరీక్ష నమూనా

CBT-1: CBT-1 పరీక్షలో 100 మార్కుల 100 ప్రశ్నలు అడుగుతారు. ఇందులో మ్యాథమెటిక్స్ , రీజనింగ్ నుండి 30 ప్రశ్నలు, జనరల్ అవేర్‌నెస్ నుండి 40 ప్రశ్నలు అడుగుతారు. 1 గంట 30 నిమిషాల సమయంలో ఎగ్జామ్ పూర్తి చేయాలి.

CBT-2: CBT-2లో 120 మార్కులకు 120 ప్రశ్నలు అడుగుతారు. ఇందులో మ్యాథమెటిక్స్‌, రీజనింగ్‌ నుంచి 70 ప్రశ్నలు, జనరల్‌ అవేర్‌నెస్‌, జనరల్‌ ఇంటెలిజెన్స్‌ నుంచి 50 ప్రశ్నలు అడుగుతారు.

జీతం

పోస్ట్ ప్రకారం జీతం ఇవ్వబడుతుంది. జూనియర్‌ జూనియర్‌ క్లర్క్‌ కమ్‌ టైపిస్ట్‌, అకౌంట్స్‌ క్లర్క్‌ కమ్‌ టైపిస్ట్‌ ప్రాథమిక వేతనం నెలకు రూ.19,9000. కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ జీతం రూ.21,700, ట్రాఫిక్ అసిస్టెంట్ రూ.25,500, సీనియర్ టైమ్ కీపర్ రూ.29,200. ఈ సమాచారం గతేడాది నోటిఫికేషన్‌పై ఆధారపడి ఉంది.

ఎన్ని పోస్టులు భర్తీ చేస్తారు

RRB NTPC ద్వారా వేల సంఖ్యలో పోస్టులు రిక్రూట్ అవుతున్నాయి. RRB NTPC 2022 ద్వారా 35281 ఖాళీలను నియమించారు.



15 comments:

  1. Saidalli shaik

    ReplyDelete
  2. Mortha Chandra Shekhar

    ReplyDelete
  3. Job application link

    ReplyDelete
  4. Prabhakar Yadav durve

    ReplyDelete
  5. Job application link

    ReplyDelete
  6. Rathi bhabhi vanka boya Chandana son of rb hanumanth Rayudu rayadurgam taluka Anantapur jila Andhra Pradesh pin code number 515 865

    ReplyDelete
  7. Please Job apply cation link pls

    ReplyDelete
  8. Lokhande Gangadhar

    ReplyDelete

Job Alerts and Study Materials