తెలంగాణాలో కొత్త రేషన్ కార్డుల జారీని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎంపీ ఎన్నికల కోడ్ ముగియడంతో రేషన్ కార్డుల జారీకి సంబంధించి వేగం పెంచింది. ఇప్పటికే సంబంధిత శాఖల అధికారులు కసరత్తు మొదలు పెట్టారు. అర్హుల గుర్తింపు, అనర్హుల ఎరివేతపై దృష్టి సారించారు. వీటికి సంబంధించి మార్గదర్శకాలు…..
తయారీపై చర్చిస్తున్నారు.. ఆగస్టు 15లోగా కొత్త రేషన్ కార్డుల జారీ ప్రారంభం కానున్నట్టు సమాచారం.. అయితే ఈ సారి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చే తెల్ల రేషన్ కార్డులే అన్ని సంక్షేమ పథకాలకు ప్రామణికంగా తీసుకునే అవకాశం ఉన్నందున కొత్త రేషన్ కార్డు దరఖాస్తులను ఇంటింటి సర్వే ద్వారా ఎంపిక చేయనున్నారు. ఈ
ప్రక్రియ హైదరాబాద్లో ఇప్పటికే ప్రారంభం కాగా.. జిల్లాల్లో కూడా ప్రారంభించనున్నారు. వీటి బాధ్యత మహిళా సంఘాలు, అంగన్వాడీ టీచర్లకు అప్పగించనున్నారు.
No comments:
Post a Comment