ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఇక్కడ ఇచ్చిన అన్ని ముఖ్యమైన అంశాలను జాగ్రత్తగా చదవాలి.
హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్ (HCL).. జూనియర్ మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానించింది. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు HCL అధికారిక వెబ్‌సైట్ hindustancopper.com ద్వారా అప్లయ్ చేసుకోవచ్చు. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ జూలై 1 నుంచి ప్రారంభం కానుంది. HCL ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ కింద మొత్తం 56 పోస్టులను భర్తీ చేయనుంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులెవరైనా జూలై 21వ తేదీలోగా లేదా అంతకు ముందు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు కింద ఇచ్చిన అన్ని ముఖ్యమైన అంశాలను జాగ్రత్తగా చదవాలి.
వయోపరిమితి
దరఖాస్తు చేసుకునే అభ్యర్థులందరి వయోపరిమితి 40 ఏళ్లు మించకూడదు.
విద్యార్హత
ఈ రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తప్పనిసరిగా అధికారిక నోటిఫికేషన్‌లో ఇవ్వబడిన సంబంధిత విద్యార్హతలను కలిగి ఉండాలి.
దరఖాస్తు రుసుము
జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలకు చెందిన అభ్యర్థులు దరఖాస్తు రుసుముగా రూ.500 చెల్లించాలి. అయితే ఇతర కేటగిరీల అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుండి మినహాయింపు ఉంది. దరఖాస్తు రుసుము గేట్‌వే/NEFT ఆన్‌లైన్ ట్రాన్స్ ఫర్ ద్వారా చెల్లించబడుతుంది.
జీతం
ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 30,000 నుండి రూ. 120,000 వరకు జీతం చెల్లించబడుతుంది.
అప్లికేషన్ లింక్, నోటిఫికేషన్‌ను ఇక్కడ చూడండి
ఎంపిక ఇలా
అధికారిక నోటిఫికేషన్ ప్రకారం ఈ పోస్టులకు దరఖాస్తు చేస్తున్న అభ్యర్థులందరూ పరీక్ష, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ ధృవీకరణ ఆధారంగా ఎంపిక చేయబడతారు.
No comments:
Post a Comment