Mother Tongue

Read it Mother Tongue

Sunday, 16 June 2024

విద్యుత్ సంస్థలో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక

ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా మొత్తం 435 పోస్టులను భర్తీ చేయనున్నారు.

పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (PGCIL)లో ట్రైనీ ఇంజనీర్  పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా మొత్తం 435 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కూడా ప్రారంభమైంది. అప్లయ్ చేసుకోవాలనుకునే అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ powergrid.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.  అప్లయ్ చేసుకోడానికి చివరి తేదీ జులై 4.  దరఖాస్తు ఫారమ్‌ను పూరించే ముందు కింద ఇచ్చిన సమాచారాన్ని చూడండి

అప్లయ్ చేయడానికి విద్యార్హత

ఈ రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులందరూ తప్పనిసరిగా సంబంధిత సబ్జెక్ట్‌లో కనీసం 60% లేదా దానికి సమానమైన CGPA డిగ్రీని కలిగి ఉండాలి.

వయోపరిమితి

ఈ రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల కనీస వయస్సు 18 సంవత్సరాలు,గరిష్ట వయస్సు 28 సంవత్సరాలు ఉండాలి. అలాగే, భారత ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం OBC అభ్యర్థులకు 3 సంవత్సరాలు, SC/ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు, PWBD అభ్యర్థులకు 10 సంవత్సరాలు, మాజీ సైనికులకు 10 సంవత్సరాల గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంది.

నోటిఫికేషన్, అప్లికేషన్ లింక్‌ని ఇక్కడ చూడండి

PGCIL Recruitment 2024 నోటిఫికేషన్ PGCIL Recruitment 2024 అప్లయ్ చేయడానికి లింక్

దరఖాస్తు రుసుము

SC/ST/PWBD/Ex-SM/డిపార్ట్‌మెంటల్ అభ్యర్థులకు ఎలాంటి దరఖాస్తు రుసుము లేదు. ఇతర అభ్యర్థులు దరఖాస్తు రుసుము కింద రూ. 500 చెల్లించాలి.



No comments:

Post a Comment

Job Alerts and Study Materials