బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర స్పోర్ట్స్ కోటా కింద కస్టమర్ సర్వీస్ అసోసియేట్ (క్లర్క్) పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది.
బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర స్పోర్ట్స్ కోటా కింద కస్టమర్ సర్వీస్ అసోసియేట్ (క్లర్క్) పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా మొత్తం 12 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆసక్తి ,అర్హతలు ఉన్నవాళ్లు బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర అధికారిక వెబ్‌సైట్ bankofmaharashtra.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. అప్లయ్ చేయడానికి చివరి తేదీ జూలై 8. ఈ పోస్టులకు అప్లయ్ చేసే ముందు ఇక్కడ ఇచ్చిన వివరాలను చూడండి.
వయోపరిమితి
ఈ పోస్టులకు అప్లయ్ చేయాలంటే అభ్యర్థుల కనీస వయస్సు పరిమితి 18 సంవత్సరాలు, గరిష్ట వయోపరిమితి 25 సంవత్సరాలు ఉండాలి.
విద్యార్హత
అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు లేదా ఇన్‌స్టిట్యూట్ నుండి 10వ తరగతి పాసై ఉండాలి. అలాగే, క్రియాశీల క్రీడా దశ ముగిసిన 5 సంవత్సరాలలోపు గ్రాడ్యుయేట్ డిగ్రీ అర్హతను పొంది ఉండాలి.
జీతం
ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు రూ.64440 వేతనంగా చెల్లిస్తారు.
దరఖాస్తు రుసుము
జనరల్/EWS/OBC కేటగిరీకి చెందిన అభ్యర్థులకు దరఖాస్తు రుసుము - రూ. 590
ST/SC వర్గానికి చెందిన అభ్యర్థులకు దరఖాస్తు రుసుము - రూ 118
ఇలా దరఖాస్తు చేసుకోండి
ఆసక్తి,అర్హత గల అభ్యర్థులు నిర్ణీత ఫార్మాట్‌లో దరఖాస్తు ఫారమ్‌ను పూరించి, జనరల్ మేనేజర్, హెచ్‌ఆర్‌ఎం, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, హెచ్‌ఆర్‌ఎం డిపార్ట్‌మెంట్, హెడ్ ఆఫీస్, లోక్‌మంగల్, 1501, శివాజీనగర్, పూణే 411005కు పోస్ట్ ద్వారా పూర్తి చేసిన దరఖాస్తు ఫారమ్‌ను పంపాలి.
ముఖ్యమైన లింక్స్
ఆన్లైన్ లో అప్లై చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి
నోటిఫికేషన్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
No comments:
Post a Comment