Mother Tongue

Read it Mother Tongue

Sunday, 30 June 2024

18 ఏళ్లు దాటిన వారికి గుడ్ న్యూస్.. రూ.2 లక్షల 30 వేల జీతం..

 జనగామ జిల్లాలోని నిరుద్యోగ యువతీ,యువకులకు ప్రైవేట్ రంగంలో ఉపాధి కల్పించేందుకు జులై 3న జాబ్ మేళా నిర్వహించనున్నారు.ఈ మేరకు ఉపాధి కల్పన అధికారి సిహెచ్.ఉమారాణి ఒక ప్రకటనలో తెలిపారు. నిరుద్యోగ నిర్మూలన కోసం ప్రభుత్వాలు అనేక కార్యక్రమాలు చేపడుతున్నాయి. నిరుద్యోగ నిర్మూలనే లక్ష్యంగా ముందుకు వెళుతున్నాయి. ఇందుకోసం ప్రభుత్వాలు పలుచోట్ల ఉచిత ఉపాధి శిక్షణ కల్పిస్తున్నాయి. ఇటు ప్రైవేట్ రంగ సంస్థల సైతం పలుచోట్ల జాబ్ మేళాలు నిర్వహిస్తూ నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తున్నారు. ఇప్పటికే ఎంతోమంది ఈ జాబ్ మేళాలో పాల్గొని పలు కంపెనీలకు ఎంపికై ఉద్యోగాలు చేస్తున్నారు. అయితే పలు సంస్థలు ప్రతి ఏటా పలుచోట్ల జాబ్ మేళాలు నిర్వహిస్తూ నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నారు. జనగామ జిల్లాలోని నిరుద్యోగ యువతీ,యువకులకు ప్రైవేట్ రంగంలో ఉపాధి కల్పించేందుకు జులై 3న జాబ్ మేళా నిర్వహించనున్నారు.ఈ మేరకు ఉపాధి కల్పన అధికారి సిహెచ్.ఉమారాణి ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు ఈ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. హైదరాబాద్ లోని హెటిరో ల్యాబ్స్ లిమిటెడ్ కంపెనీలో ఉద్యోగాల భర్తీకి ఈ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అ కంపెనీలో జూనియర్ కెమిస్ట్ 50,జూనియర్ ఆఫీసర్ 20, జూనియర్ టెక్నిషియన్ 30 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్లు చెప్పారు. జూనియర్ కెమిస్ట్ ఉద్యోగానికి ఏదైనా డిగ్రీ చదివిన వారు అర్హులన్నారు.జూనియర్ ఆఫీసర్ ఉద్యోగానికి ఎంఎస్సీ,జూనియర్ టెక్నిషియన్ కు ఐటీఐ చేసిన వారు అర్హులని పేర్కొన్నారు. ఇందులో ఎంపికైన వారికి వార్షిక వేతనం రూ:2.3లక్షల నుండి ఉంటుందన్నారు.18 నుండి 27 సంవత్సరాల లోపు వయస్సు గల యువతి,యువకులు ఈ మేళాలో పాల్గొనేందుకు అర్హులని తెలిపారు. ఆసక్తి,అర్హత కలిగిన అభ్యర్థులు తమ బయోడేటా మరియు విద్యార్హత సర్టిఫికెట్స్ జిరాక్స్ కాపీలతో పాటు పాస్ ఫోటో తీసుకొని రావాలన్నారు. జులై 3న ఉదయం 10:30 గంటలకు ఈ జాబ్ మేళా ప్రారంభమవుతుందన్నారు. జిల్లా కేంద్రంలోని ఉపాధి కార్యాలయంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. అభ్యర్థులు పూర్తి వివరాలకు 7995430401 నెంబర్ ను సంప్రదించాలన్నారు.జిల్లాకు చెందిన అభ్యర్థులు ఈ జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. 



No comments:

Post a Comment

Job Alerts and Study Materials