Mother Tongue

Read it Mother Tongue

Sunday, 30 June 2024

డీఎస్సీ నోటిఫికేషన్ రద్దు.. సీఎం కీలక నిర్ణయం

 సీఎం కుర్చీలో ఉన్న వెంటనే తొలి సంతకాన్ని డీఎస్సీ నోటిఫికేషన్ పై చేసిన చంద్రబాబు.. ప్రస్తుతం ఆ దిశగా అడుగులేస్తున్నారు. ఈ మేరకు గత వైసీపీ ప్రభుత్వంలో విడుదలైన డీఎస్సీ నోటిఫికేషన్ రద్దు చేశారు. ఏపీలో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం వరుసపెట్టి పలు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. సీఎం కుర్చీలో ఉన్న వెంటనే తొలి సంతకాన్ని డీఎస్సీ నోటిఫికేషన్ పై చేసిన చంద్రబాబు.. ప్రస్తుతం ఆ దిశగా అడుగులేస్తున్నారు. ఈ మేరకు గత వైసీపీ ప్రభుత్వంలో విడుదలైన డీఎస్సీ నోటిఫికేషన్ రద్దు చేసింది టీడీపీ గవర్నమెంట్. గతంలో వైసీపీ ప్రభుత్వం 6,100 టీచర్ పోస్టుల భర్తీకి డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే చంద్రబాబు ఏర్పాటు చేసిన కొత్త ప్రభుత్వం ఇప్పుడు మెగా డీఎస్సీ ప్రకటించి.. ఈ పరీక్షతో పాటు TET కూడా నిర్వహించడానికి కసరత్తులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గత డీఎస్సీ నోటిఫికేషన్ రద్దు చేస్తూ విద్యాశాఖ జీవో నెం.256 జారీ చేసింది. నేడో, రేపో 16,347 పోస్టులతో నూతన డీఎస్సీ నోటిఫికేషన్ జారీ కానుంది. మెగా డీఎస్సీ కోసం మరోసారి టెట్ నిర్వహించడానికి ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. మెగా డీఎస్సీలో మొత్తం 16,347 ఉపాధ్యాయుల పోస్టుల భర్తీని పూర్తి చేసేలా షెడ్యూల్ రెడీ చేయాలని నిర్ణయం తీసుకుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. జులై ఒకటి నుంచి డీఎస్సీ ప్రక్రియ షురూ చేసి డిసెంబర్ 10లోగా పరీక్షలు పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నారట. జిల్లాల వారీగా డీఎస్సీ ఖాళీలు చూస్తే.. శ్రీకాకుళంలో 543, విజయనగరంలో 583, విశాఖలో 1134, తూర్పు గోదావరిలో 1346, పశ్చిమ గోదావరిలో 1067, కృష్ణాలో 1213, గుంటూరులో 1159, ప్రకాశంలో 672, నెల్లూరులో 673, చిత్తూరులో 1478, కడపలో 709, అనంతపురంలో 811, కర్నూలులో 2678 ఖాళీలు ఉన్నాయి. ముందుగా TET పరీక్ష నిర్వహించి, ఆ తర్వాత మెగా డీఎస్సీకి నోటిఫికేషన్ ఇవ్వబోతున్నారట. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీ స్టడీ సర్కిళ్లలో వెనుకబడిన తరగతుల విద్యార్థులకు, నిరుద్యోగులకు ఉచితంగా డీఎస్సీ శిక్షణ ఇవ్వడానికి ప్రభుత్వం రెడీ అవుతోంది.





No comments:

Post a Comment

Job Alerts and Study Materials