విశాఖపట్నంలో జాబ్ మేళా జరగనుంది. టెన్త్, ఇంటర్, డిగ్రీ అర్హతతో 461 ఉద్యోగాలు ఉన్నాయి. ఈ జాబ్ మేళాకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోండి.
ఆంధ్ర ప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ మరియు ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజ్ ఆధ్వర్యంలో కంచరపాలెంలో ఉన్న ఉపాధి కార్యాలయంలో ఈ నెల 21 న జాబ్ మేళా నిర్వహించనున్నారని ఎంప్లాయిమెంట్ ఆఫీసర్ సుబ్బిరెడ్డి, జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి సాయి కృష్ణ చైతన్య ఓ పత్రికా ప్రకటన ద్వారా తెలియజేసారు.
శుక్రవారం ఉదయం 10 గంటలకు ప్రముఖ కంపెనీలు, సుమారు 461 పోస్టుల భర్తీ కోసం ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్టు తెలిపారు. విశాఖతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాల్లో అర్హులైన నిరుద్యో గులు దరఖాస్తు చేసుకోవచ్చని, టెన్త్, ఇంటర్, డిగ్రీ, ఎంబీఏ, బీటెక్, ఐటీఐ, డిప్లమో, బి/డి/ఎం ఫార్మ సీ పూర్తి చేసిన వారంతా ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చన్నారు.
ఎంపికైన అభ్యర్థులకు అర్హతల ఆధారంగా రూ.10వేల నుంచి రూ.3 లక్షల వేతనం వరకు ఉంటుందని, విశాఖ, విజయనగరం, అనకాపల్లి, తుని ప్రాంతాల్లో ఉద్యోగం చేయాల్సి ఉంటుందని తెలి పారు. 18 నుంచి 35 ఏళ్ల మధ్య వయసు ఉన్న వారంతా హాజరు కావచ్చని తెలిపారు.
ఆసక్తిగల అభ్యర్థులు స్కిల్ యూనివర్సిటీ డాట్ ఏపీ.ఎస్.ఎస్.డి.సి అనే వెబ్సైట్లో రిజిస్ట్రేష్రన్ చేసుకుని అడ్మిట్ కార్డుతో హాజరు కాగలరని, స్పాట్ రిజిస్ట్రేషన్ కూడా కలదని తెలిపారు. పైన తెలిపిన విధంగా విద్యార్థులందరూ కూడా 10 గంటలకు చేరుకొని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు తెలియజేయడం జరిగింది.
నిరుద్యోగ యువకులకు అవకాశం ఉన్నంతవరకు అధిక సంఖ్యలో పలు కంపెనీలు తీసుకువచ్చి ఉపాధి అవకాశాలు కల్పించడమే తమ దేవని తెలియజేశారు. ఇప్పటి వరకు అనేక మంది విద్యార్థులకు మెగా జాబ్ మేళా ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగిందని తెలియజేశారు.
విద్యార్థులందరూ కూడా చదువుకొని ఖాళీగా ఉండకుండా మెగా జాబ్ మేళాలో పాల్గొని ఉద్యోగ అవకాశాన్ని కల్పించుకోవాలని తెలియజేశారు. తమ నైపుణ్యాన్ని బట్టి పలు కంపెనీల్లో తీసుకోవడం జరుగుతుందని తెలియజేశారు. ఎప్పటికప్పుడు మెగా జాబ్ మేళా ద్వారా ఉపాధి కల్పన చేయడం జరుగుతుందని తెలిపారు.
No comments:
Post a Comment